రకుల్ ప్రీతి సింగ్ గురించి మీకు తెలియని పర్సల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!

చిన్న సినిమాల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే.

Posted By:
Subscribe to Boldsky

చిన్న సినిమాల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే.. రకుల్ మాత్రం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రంతో పాటు, రాం చరణ్ ధృవలోనూ హీరోయిన్గా నటిస్తోంది.

Rakul Preet Singh reveals interesting facts about her personal and Profissional life

తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కోలీవుడ్లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో తడైయర తక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా కోలీవుడ్లో కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాలన్ సినిమాలో నటిస్తోన్న రకుల్, మరో భారీ ప్రాజెక్ట్కు సైన్ చేసింది. ఇన్ని విజయాలతో ముందుకు దూసుకుపోతున్న రకుల్ ప్రీతి సింగ్ గురించి కొన్ని పర్సల్ అండ్ ప్రొఫిషనల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం...!

పుట్టింది

రకుల్ ప్రీతి సింగ్ అక్టోబర్ 1990లో న్యూడిల్లీ జన్మించింది.

తల్లిదండ్రులు:

రకుల్ ప్రీతి సింగ్ పంజాబ్ ఫ్యామిలీలో జన్మించింది, ఆమె తండ్రి ఆర్మీలో పనిచేసే రాజేంద్ర సింగ్, మదర్ కుల్విందర్ సింగ్ .

స్కూల్ అండ్ కాలేజ్ జీవితం :

ఆర్మీ పబ్లిక్ స్కూల్, దౌలా కువాన్ , న్యూఢిల్లీలో చదివింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్. కాలేజి చదివే రోజుల్లోనే మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది.

తొలిగుర్తింపు :

2011లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.

సినిమాల్లోకి :

ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ‘‘గిల్లి'' అనే ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. పాకెట్ మనీకోసం ఈ గిల్లీ సినిమాను ఒప్పుకుంది.

తెలుగులో తొలిసారి :

2011లో సిద్ధార్థ్ రాజ్ కుమార్ సరసన తెలుగులో కెరటం మొదటిసినిమా చేసింది. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల కు హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ , తర్వాత కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ తెలుగు సినిమాల్లో నటించింది. కరెంట్ తీగ, లౌక్యం, కిక్ 2 లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

తమిళ ఎంట్రీ :

2012వ సంవత్సరంలో థడైయార్ థాక్కా చిత్రం ద్వారా సపోర్టింగ్ రోల్ తో పరిచయం అయ్యింది.

బాలీవుడ్ ఎంట్రీ:

దివ్వా కుమార్ డైరెక్షన్ లో యారియాన్ తో సినిమా చేసింది.

నటించే భాషలు :

నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ.

నివాసం:

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ తీసుకుని పేరంట్స్ తో కలిసి ఉంటోంది.

సినిమాలు కాకుండా :

జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.

ఇష్టమైన వ్యాపకాలు :

గుర్రపుస్వారీ, గోల్ఫో ఆడటం, భరతనాట్యం సాధన చేయడం

హాబీలు :

క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.

నచ్చే సెలెబ్రిటీలు :

షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్

ప్రముఖ పొలిటీషియన్ ఇంట్లోని పెళ్ళి వేడకులో డ్యాన్స్ :

రీసెంట్ గా గాలి జనార్ధన రెడ్డి కూతురి పెళ్ళికి రకుల్ ప్రీత్ సింగ్, ప్రిమని, శాన్వి, తమన్నా డాన్సులతో పెళ్ళికి వచ్చిన వాళ్ళకి కనువిందు చేశారు. ఈ పెళ్ళిలో వాళ్ళ డంకేసులకి ఈలలు, గోలలతో పెళ్ళికి వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారంట.

English summary

Rakul Preet Singh reveals interesting facts about her personal and Profissional life

Ravishing actress Rakul Preet Singh has revealed interesting details ... In a recent interview, she revealed many interesting facts about herself.
Story first published: Friday, November 18, 2016, 17:06 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter