70ఏళ్లలోనూ యవ్వనం, 65ఏళ్లలో హెల్తీ బేబీ జననం..! వండర్ ఫుల్ ప్లేస్..!

మనం 70ఏళ్ల జీవితాన్ని అనుభవిస్తే చాలు అనుకుంటాం.. కానీ.. అక్కడి వాళ్లు మాత్రం 70 ఏళ్లు వచ్చినా.. యవ్వనంగా ఉంటారు. అదెలా అనుకుంటున్నారా ? ఐదే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

Posted By:
Subscribe to Boldsky

మనం 70ఏళ్ల జీవితాన్ని అనుభవిస్తే చాలు అనుకుంటాం.. కానీ.. అక్కడి వాళ్లు మాత్రం 70 ఏళ్లు వచ్చినా.. యవ్వనంగా ఉంటారు. 40ఏళ్లలోకి అడుగుపెట్టాం అంటే చాలు.. ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గుతుందని చెబుతారు. కానీ.. అక్కడి మహిళలు.. 65ఏళ్లలో కూడా హెల్తీ బేబీకి జన్మనిస్తారట.

place

వావ్ ఇదంతా వింటుంటే.. నిజమేనా అనిపిస్తోంది కదూ. నిజమే ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇంత హెల్తీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. ప్రాణాంతకమైన క్యాన్సర్ గురించే తెలియదట, క్యాన్సర్ మాటే వినలేదట.

ఇంత హెల్తీగా, ఇంత యవ్వనమైన వాళ్లు ఉండే ప్రజలు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా ? ఈ కాలుష్యపూరితమైన వాతావరణంలో ఇంత హెల్తీగా బతుకుతున్న వండర్ ఫుల్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోవాల్సిందే..

ఆ ప్లేస్ ఎక్కడ ఉంది

నార్త్ పాకిస్తాన్ లో హంజ్ కుట్స్ లేదా హంజా కమ్యునిటీకి చెందిన వాళ్లు నివసిస్తారు. అందుకే.. ఈ ప్రాంతాన్ని హుంజా వాలీ అని పిలుస్తారు.

యంగ్ గా ఉంటారు

జీవితం చివరి దశకు వచ్చినా.. ఇక్కడి ప్రజలు యవ్వనంగా ఉంటారు. అదే ఇక్కడి స్పెషాలిటీ. 70ఏళ్లు పూర్తయ్యేవరకు ఇక్కడి ప్రజలు చాలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటారు. వావ్.. ఎంత అదృష్టవంతులో కదా.

క్యాన్సర్ అంటే తెలియదు

ఈ భూమ్మీద ఉన్నవాళ్లెవరికైనా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి తెలియకుండా ఉంటుందా అని అనుకుంటాం కదా. కానీ.. హంజ్ వాలీలో నివసించే వీళ్లకు మాత్రం.. ఇలాంటి ఒక వ్యాధి ఉందని కూడా తెలియదు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎవరికీ క్యాన్సర్ రాకపోవడమే.

65ఏళ్ల వరకు గర్భం

సాధారణంగా 40 నుంచి 50 ఏళ్లు వచ్చాయంటే.. ఆ మహిళ కన్సీవ్ అవడం కష్టం. ఎందుకంటే.. వాళ్ల ఆరోగ్యం సహకరించదు. అయితే.. ఈ అందమైన ప్రదేశంలో నివసించే ఆడవాళ్లు మాత్రం 65ఏళ్లలో కూడా హెల్తీ బేబీకి జన్మనిస్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తోంది కదూ.

ఈ ప్రాంతం చరిత్ర

నాలుగవ శతాబ్ధంలో.. ఈ గ్రామం నుంచి అలెగ్జాండర్ వచ్చారు. ఆయన వారసులుగా ఈ కమ్యునిటినీ భావిస్తారు. ఈ ప్రాంతంలో నివసించేవాళ్ల సంఖ్య 87 వేల మంది. వీళ్లందరూ ముస్లిం నేషన్ కి చెందినవాళ్లే.

వీళ్ల హెల్త్ సీక్రెట్

ఇక్కడివాళ్లు 70ఏళ్లు వచ్చిన యవ్వనంగా ఉండటం, 65ఏళ్ల వరకు బిడ్డను జన్మించే అదృష్టం కలిగిఉండటానికి కారణం వాళ్ల హెల్తీ లైఫ్ స్టైలే. అయితే.. వీళ్లు కేవలం ప్రొటీన్ ఫుడ్స్ అయిన పండ్లు, కూరగాయలు, పాలు, డ్రైఫ్రూట్స్, ఎగ్స్ మాత్రమే తీసుకుంటారు. అలాగే వాల్ నట్స్ ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే.. క్యాన్సర్ కి దూరంగా ఉంటారు.

English summary

REALLY? Nobody Falls Ill In This Place!

REALLY? Nobody Falls Ill In This Place! A place in Pakistan where people hardly fall ill and their life expectancy will simply stun you, as people in this place are young even at the age of 70 years
Please Wait while comments are loading...
Subscribe Newsletter