ఈ రాశి వారు అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారు..!

వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రంలో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభరాశిగా వ్యవహరిస్తారు. వృషభరాశ

Posted By:
Subscribe to Boldsky

వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రంలో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభరాశిగా వ్యవహరిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగము భాగం వరకు ఉంటుంది.

వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు

వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు.

కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది.

కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు.

తేలికగా అలసట చెందరు.

తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు.
అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు.

వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు.

వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు.

సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ

లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు.

అందరినీ ప్రేమించే మనస్తత్వం

వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు.తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు.

అసాధారణమైన తెలివితేటలు,

అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు.ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.

ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా

ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో నేర్పరులు. క్లిష్టమైన వ్యవహారాలను సైతం తేలికగా చక్కదిద్దగలరు. దౌత్యం నెరపడంలో సిద్ధహస్తులు. 

వృషభరాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు.

అవసరమైతే ఇతరుల భారాన్ని సైతం తామే భరించేందుకు సిద్ధపడతారు.

వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు.

నిర్భీతి, కారుణ్యం, ఓపిక సహజ లక్షణాలుగా గల వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు. వాహన, వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, అలంకరణలు, ప్లాస్టిక్, హోటల్, మద్యం వ్యాపారాలు వీరికి కలసి వస్తాయి.

సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు

సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు. గ్రహగతులు సానుకూలంగా లేకుంటే మాత్రం అసూయతో రగిలిపోతూ ఇతరులను ఇబ్బందిపెడతారు. మార్పును ఒకపట్టాన అంగీకరించలేరు.

మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు.

మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు. అంతులేని ఐశ్వర్య లాలసతో సంపాదనే వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తారు. ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు

బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో

బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం కారణంగా శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతారు.

 

 

English summary

Secrets Of The Taurus Personality

Secrets Of The Taurus Personality,Those of us that are born under the Taurus sign are often labelled as many things ranging from short tempered through to downright aggressive.
Please Wait while comments are loading...
Subscribe Newsletter