For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్‌లో మాన‌సిక ప్ర‌శాంత‌త పొందే సింపుల్ టిప్స్..!!

By Swathi
|

మాన‌సిక శాంతి. దీని కోసం చాలా మంది చాలార‌కాలుగా వెతుకుతూ ఉంటారు. డ‌బ్బు, స్నేహితులు, ఉద్యోగం, కుటుంబం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శాంత‌త కోసం వెతుకుతూ ఉంటాం. మాన‌సిక ప్ర‌శాంత‌త బ‌య‌ట ఉండే అంశాల ద్వారా పొంద‌లేం.. కానీ ఆలోచ‌న‌ల్లో మార్పుల ద్వారా అది పొంద‌వ‌చ్చు.

మాన‌సిక ప్ర‌శాంత‌త పొంద‌డానికి ఎవ‌రూ స‌హాయ‌ప‌డ‌లేరు.. ఎందుకంటే మిమ్మ‌ల్ని మీరు బెస్ట్ గా మార్చుకున్న‌ప్పుడే అది సాధ్యం. ఈ బిజీ ప్ర‌పంచంలో మ‌నుషుల అవ‌స‌రాలు తీర్చుకోవ‌డానికి డ‌బ్బు పొందాల‌నుకుంటారు. చుట్టూ ఉన్న అంశాలు ఎలాంటి ప్రోత్బ‌లం ఇచ్చినా, మారాల‌ని టెంప్ట్ చేసినా.. మిమ్మ‌ల్ని న‌మ్మాలి. నిజ‌మైన సంతోషం ఎక్క‌డ పొందుగ‌లుగుతారో.. అన‌లైజ్ చేసుకోవ‌డానికి స‌మ‌యం ఇవ్వాలి.

అంత‌రాత్మ ఏం చెబుతుందో వినండి.. దాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి. మాన‌సిక ప్ర‌శాంత‌త నిదానంగా పొంద‌గ‌ల‌గాలి అంతేకానీ.. కొన‌లేనిది. చాలామంది జీవితంలో అన్ని పొందా.. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌ప్ప అని చెబుతూ ఉంటారు. దీని బట్టి ఫైనాన్షియ‌ల్ స్టేట‌స్ మీద ప్ర‌శాంత‌త ఆధార‌ప‌డి ఉండ‌ద‌ని తెలుపుతుంది. ఆర్థికంగా వెన‌క‌బ‌డి ఉన్న వ్య‌క్తికి ప్ర‌శాంత‌త‌ను పొందగ‌లుగుతాడు. మాన‌సిక ప్ర‌శాంత‌త ఎలా పొందాలో తెలుసుకోవాల‌నుకుంటున్నారా ఇక్క‌డ కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి.

ప్ర‌స్తుతం గురించి ఆలోచించ‌డం

ప్ర‌స్తుతం గురించి ఆలోచించ‌డం

జ‌రిగిపోయిన గ‌తం గురించి వ‌దిలేయాలి.. భ‌విష్య‌త్ ని అంచ‌నావేయ‌లేం. కాబ‌ట్టి భ‌విష్య‌త్ గురించి అన‌వ‌స‌రంగా ఆలోచించి ఎన‌ర్జీ కోల్పోకోకుండా ఉండాలి. గ‌తం గురించి, భ‌విష్య‌త్ గురించి ఆలోచించ‌డం మానేయ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగా, సంతోషంగా ఉండ‌వ‌చ్చు.

సింపుల్ గా ఉండ‌టం

సింపుల్ గా ఉండ‌టం

సింపుల్‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి హాని క‌లుగ‌దు.. అలాగే కాంప్లికేటెడ్‌గా ఉండ‌టం వ‌ల్ల ఏం లాభ‌ముండ‌దు. సింపుల్ గా జీవించ‌డానికి, చుట్టు ఉన్న‌వాటిని సింపుల్ గా మార్చుకోవ‌డానికి దేవుడు మ‌న‌కి అవ‌కాశ‌మిచ్చాడు. సింప్లిసిటీతో జీవిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌త ఈజీగా పొంద‌వ‌చ్చు. గాసిప్స్, షోయింగ్ ౠప్, మీకంటే హైలెవెల్ లో ఉన్న వారినే స్నేహితుల‌ను చేసుకోవాల‌నుకోవ‌డం వ‌ల్ల ప్ర‌శాంత‌త కోల్పోతారు.

మార్పుల‌కు సిద్ధంగా మైండ్

మార్పుల‌కు సిద్ధంగా మైండ్

స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు అభిప్రాయాలు మార్చుకునేలా మైండ్ ని అల‌ర్ట్ చేయాలి. మీరు భావించిన‌దే నిజ‌మ‌వ్వాల‌ని లేదు.. అది త‌ప్పు అని భావిస్తే అభిప్రాయం మార్చుకోవాలి.

కృత‌జ్ఙ‌తా భావం

కృత‌జ్ఙ‌తా భావం

మాన‌సిక ప్ర‌శాంత పొంద‌డానికి ఇదొక మార్గం. జీవితంలో పొందే ప్ర‌తి చిన్న విష‌యానికి కృత‌జ్ఙ‌త తెల‌పాలి. శ్వాస పొంద‌డం నుంచి అన్ని బ్లెస్సింగే అని న‌మ్మాలి. మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్ర‌తి ఒక్క‌రిపైనా కృత‌జ్ఙ‌తా భావం క‌లిగి ఉండాలి.

చీక‌టి త‌ర్వాత వెలుగు త‌ప్ప‌నిస‌రి

చీక‌టి త‌ర్వాత వెలుగు త‌ప్ప‌నిస‌రి

బాధ, ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎల్ల‌కాలం అలానే ఉండ‌వు. కాలం గ‌డిచే కొద్ది కొత్త విష‌యాలు వ‌స్తాయి. ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎంజాయ్ చేయ‌డం వ‌ల్ల మిమ్మ‌ల్ని మీరు మ‌రింత స్ర్టాంగ్ అవుతారు. అంతేకాదు దీనివ‌ల్ల జీవితాన్ని మ‌రింత బాగా అర్థం చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల మ‌రింత కాన్ఫిడెన్స్ పొంద‌వ‌చ్చు. చింత‌లు, బాధ‌లు, పెయిన్ వ‌చ్చిన‌ప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి.

అహాన్ని అణ‌గ‌తొక్కాలి

అహాన్ని అణ‌గ‌తొక్కాలి

మాన‌సిక ప్ర‌శాంత‌త కోల్పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అహం. కాబ‌ట్టి అహాన్ని త‌గ్గించుకోవాలి.

చుట్టు ఉన్న‌వాటిని మార్చుకోవాలి

చుట్టు ఉన్న‌వాటిని మార్చుకోవాలి

మీ గ‌దిలోకి ఫ్రెష్ గాలి వ‌చ్చేలా మార్చుకోవాలి. అలాగే సూర్య‌ర‌శ్మి త‌గిలేలా చూసుకోవాలి. దీనివ‌ల్ల రిలాక్స్‌గా, హ్యాపీగా అనిపిస్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త చుట్టూ ఉన్న అంశాల ద్వారా కూడా పొంద‌వ‌చ్చు. వ‌స్తువుల‌ను శుభ్రం చేయ‌డం, వాటిని చ‌క్క‌గా స‌ర్దుకోవ‌డం వ‌ల్ల ప్ర‌శాంత‌త పొంద‌వ‌చ్చు. ఈ విధంగా మాన‌సిక ప్ర‌శాంత‌త పొంద‌వ‌చ్చు.

English summary

Simple tips to Get The Inner Peace

Inner peace! A thing that most of us are searching for; however, do we know that it actually lies within us. We try to search peace in worldly things such as money, friends, job, family, etc. Inner peace cannot be achieved by the outer surroundings, but by making changes inside your soul and thoughts.
Story first published: Monday, July 25, 2016, 21:26 [IST]
Desktop Bottom Promotion