రూ. 500, 1000 నోట్ల బ్యాన్ తర్వాత షాకిస్తున్న రియాక్షన్స్..!

500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయిన తర్వాత.. కొన్ని చిత్రవిచిత్రమైన రియాక్షన్స్ వెలుగులోకి వచ్చాయి. కొన్ని చాలా నవ్వుతెప్పించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

Posted By:
Subscribe to Boldsky

ఇండియాలో రూ. 500, 1000 నోట్లు బ్యాన్ అయిన తర్వాత.. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పడుగెడుతున్నాయి. నరేంద్రమోడీ నిర్ణయం.. అవినీతికి పాల్పడి.. అక్రమంగా సొమ్ము చేసుకున్న నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

ban

అయితే.. పాత నోట్లను బ్యాన్ చేసిన తర్వాత.. సామాన్యులకు కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ.. ఈ నిర్ణయం.. దేశానికి చాలామంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే.. 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయిన తర్వాత.. కొన్ని చిత్రవిచిత్రమైన రియాక్షన్స్ వెలుగులోకి వచ్చాయి. కొన్ని చాలా నవ్వుతెప్పించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

గంగా నదిలో

1000, 500 రూపాయల నోట్లు బ్యాన్ కావడంతో.. తమ దగ్గర మూలుగుతున్న బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియక ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లోని గంగా నదిలో పడేశారు.

చింపేసిన నోట్లు

కోల్ కత్తాలో చింపేసిన చిత్తుకాగితాల్లా 500, 1000 రూపాయల నోట్లు మారిపోయాయి. అది కూడా.. చెత్త కుండీలో ఈ చింపేసిన నోట్లు పడేశారు.

డ్రైనేజ్ లో

గౌహతిలోని రుక్మిణి నగర్ లో డ్రైనేజ్ లలో చింపేసిన 500, 1000 రూపాయల నోట్లు పడేశారు.

దొంగ

నోయిడాలో ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి నుంచి 1500 రూపాయలు కొంతమంది దొంగలు దోచుకున్నారు. కానీ.. ఈ నోట్లను బ్యాన్ చేసిన తర్వాత.. వాటిని మళ్లీ తిరిగి ఆ వ్యక్తికే ఇచ్చేశారు.

చేంజ్ కోసం బెగ్గర్స్

ఢిల్లీలోని చిన్న చిన్న షాపుల యజమానులు, ఆటోవాలాలు.. తమ డబ్బును మార్చుకోవడానికి బెగ్గర్స్ గా మారిపోయారు.

షాక్ ఇచ్చిన కలర్ జిరాక్స్

తమిళనాడులోని తిరువన్నామలైలో ఒక వ్యక్తి.. 2000 రూపాయల నోటుని కలర్ జిరాక్స్ చేయించి.. ఏదో ఒక వస్తువు కొనుగోలు చేశాడు. ఇంతకుముందు 2000 రూపాయల నోటు చూడకపోవడం వల్ల.. అది ఒరిజినలా లేదా డూప్లికేట్ అనేది గ్రహించలేకపోయానని ఆ ఉద్యోగి వివరించాడు.

కిడ్నాప్

వారణాసిలో కిడ్నాపర్స్ కూడా.. షాక్ తిన్నారు. 9వ తరగతి అబ్బాయిని నవంబర్ 8న కిడ్నాప్ చేశారు. కరెన్సీ నోట్లు బ్యాన్ కావడంతో... ఆ అబ్బాయిని ఆదివారం రిలీజ్ చేశారు. మోడీ నిర్ణయానికి ఆ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

విలువలేనివిగా

మోడీ నిర్ణయం తర్వాత 500, 1000 రూపాయల నోట్లను విలువలేనివిగా భావిస్తున్నారు. దీంతో తమ వద్ద ఉన్న నల్లధనంను.. కాల్చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రద్దు అయిన నోట్లను కాల్చేశారు.

ఆత్మహత్య

తెలంగాణలోని ఓ మహిళ తన దగ్గర ఉన్న డబ్బంతా విలువలేనిదిగా భావించింది. తన భర్త తాజాగా ఒక పొలం అమ్మడంతో.. 55 లక్షలు క్యాష్ రూపంలో అందుకున్నారు. ఈ నోట్లు చెల్లవని మోడీ ప్రకటించిన తర్వాత.. తమ డబ్బంతా విలువనేదే కదూ అని భావించి.. ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

లక్కీ నెంబర్

కేరళలోని ఒక వ్యక్తి 786 తన లక్కీ నెంబర్ అని భావించి.. ఈ నెంబర్ తో ఎండ్ అయ్యే కరెన్సీ నోట్లు కలెక్ట్ చేశాడు. 500 రూపాయల నోట్లు 80, 1000 రూపాయల నోట్లు 30 కలెక్ట్ చేశాడు.. ఇప్పుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

స్వీపర్

రోజూ స్వీపింగ్ చేసే ఒక మహిళకు.. 1000 రూపాయల నోట్ల కట్టతో కూడిన ఒక బ్యాగ్ దొరికింది. ఆ నోట్ల బ్యాగ్ చూసిన ఆమె దాన్ని దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చింది.

పెళ్లిళ్లు

కరెన్సీ బ్యాన్ కారణంగా.. అనేక పెళ్లిళ్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి. పెళ్లి చేయాలంటే.. క్యాష్ రూపంలో చాలా వాటికి చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. దీంతో.. బ్యాంక్ లలో కూడా లిమిట్ ఉండటంతో.. చేసేదేమీ లేక.. పెళ్లి వేడుకనే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

 

 

English summary

Strangest Things That Have Happened Since The Currency Ban

Strangest Things That Have Happened Since The Currency Ban. The Good, The Bad And the Weird of Currency Ban. Let's have a look at the side effects of the demonetisation drive.
Please Wait while comments are loading...
Subscribe Newsletter