For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ అసలు రహస్యం ఇదే..!!

బెర్ముడా ట్రయాంగిల్ అంటే.. కొందరు అదృశ్య శక్తి అని, కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతం అని.. ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారు. బెర్ముడా ట్రయాంగిల్ అంతుచిక్కని ప్రదేశంగా మారింది.

By Swathi
|

భూ ప్ర‌పంచంమే కాదు, విశ్వ‌మంటేనే అనేక వింత‌లు, విశేషాల‌కు ప్రతీక. వాటిలో మ‌న‌కు రోజుకో కొత్త విష‌యం తెలుస్తూనే ఉంది. అయినా మ‌నిషి ప్ర‌య‌త్నాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విశేషాల‌ను తెలుసుకోవాల‌ని ఎప్ప‌టికప్పుడు ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకుంటున్నా.. కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగా మిగులుతున్నాయి. అలాంటి మిస్టరీకి కేరాఫ్ గా మారింది.. బెర్ముడా ట్ర‌యాంగిల్‌.

bermuda triangle

బెర్ముడా ట్రయాంగిల్ అంటే.. కొందరు అదృశ్య శక్తి అని, కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతం అని.. ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశంగా.. అక్కడికి వెళ్లిన ఓడలు, హెలీ కాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ లు, విమానాలు ఏవైనా సరే అదృశ్యమయిపోవడమే ఇందుకు కారణం. ఇది ఇప్పుడు మొదలైనది కాదు. కొన్ని శతాబ్దాలుగా ఇది మిస్టరీగానే కొనసాగుతోంది.

కానీ రకరకాల ప్రచారాలు, అభిప్రాయాలు, భయాలు అలుముకున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఛేధించాలనే పట్టుదలతో.. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఇక్కడ అంతుచిక్కని రహస్యం ఏముందని.. పరిశోధనలు ప్రారంభించారు. చివరికి బెర్ముడా ట్రయాంగిల్ వెనక ఉన్న రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి బెర్ముడా ట్రయాంగిల్ గురించి మిస్టరీ వీడిందా ? అసలు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు ? దీనివెనక ఉన్న రహస్యం ఏంటి ?

బెర్ముడా ట్రయాంగిల్

బెర్ముడా ట్రయాంగిల్

వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు.

ప్రమాదకరమైన ప్రదేశం

ప్రమాదకరమైన ప్రదేశం

ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా విహరించే విమానాలు, హెలీకాప్టర్లు, ఆ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు.. అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండటంతో.. ఇది డేంజరస్ ప్లేస్ గా మారిపోయింది.

ఎన్నో అదృశ్యం

ఎన్నో అదృశ్యం

ఈ భయంకరమైన బెర్ముడా ట్రయాంగిల్ లో 40 ఓడలు, 20 విమానాలు అదృశ్యం అయినట్టు.. రికార్డ్స్ చెబుతున్నాయి. అందుకే.. ఈ ప్రదేశం డేంజర్ గా మారిపోయింది.

బెర్ముడా ట్రయాంగిల్ కాదు

బెర్ముడా ట్రయాంగిల్ కాదు

బెర్ముడా ట్రయాంగిల్ అంటే త్రికోణం కాదు.. ఇది అతిపెద్ద సముద్రంలో పెద్ద భాగం. ఇది విస్తరించిన ప్రాంతాన్ని రకరకాల భాగాలుగా శాస్త్రవేత్తలు వివరించారు. ఒక్కొక్క రచయితా ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు.

కిల్లర్ క్లౌడ్స్

కిల్లర్ క్లౌడ్స్

ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఛేదించాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు.. వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేశారు. ఈ క్రమంలోనే కిల్లర్ క్లౌడ్స్ ని గుర్తించారు. అదృశ్యమైన ఓడలు, విమానాలకు మేఘాలు కూడా కారణమని గుర్తించారు.

170ఎమ్ పీ హెచ్

170ఎమ్ పీ హెచ్

ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండే హెక్సోగోనల్ ఆకారంలో మేఘాలు విస్తరించి ఉండటం వల్ల .. వీటి ద్వారా వచ్చే గాలులు చాలా భయంకరంగా ఉంటున్నాయట. వీటి వేగం 170ఎమ్ పీహెచ్ గా ఉంటోందని.. అందుకే ఆ మార్గంలో వెళ్లే విమానాలు, ఓడలు.. అంతుచిక్కని విధంగా అదృశ్యమయ్యాయట.

మేఘాల వెడల్పు

మేఘాల వెడల్పు

సాధారణంగా బెర్ముడా ట్రయాంగిల్ కి పడమర వైపు మేఘాలు ఏర్పడి ఉంటాయి. అయితే చాలా మేఘాలకు ఒక పొడవాటి స్ట్రెయిట్ గీత ఉంటుంది. ఇది.. అసాధారణమైన విషయం. అలాగే.. ఈ మేఘాలు 20 నుంచి 55 మైళ్ల వెడల్పు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎయిర్ బాంబ్స్

ఎయిర్ బాంబ్స్

ఈ మేఘాలు సాధార‌ణమైనవి కాదుని సైంటిస్ట్ లు చెబుతున్నారు. అంతేకాదు వీటిని ఎయిర్ బాంబ్స్ అని పిలుస్తార‌ట‌. అంటే ఇవి గాలి శ‌క్తితో ఉన్న పెద్ద పెద్ద బాంబుల‌న్న‌మాట‌. సాధార‌ణ బాంబుల‌లాగే ఇవి కూడా విస్ఫోట‌న శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో విస్ఫోటన శక్తి కలిగి ఉంటాయి.

అలలు.. 45 అడుగుల ఎత్తు

అలలు.. 45 అడుగుల ఎత్తు

ఈ మేఘాలు విస్ఫోటనం చెందినప్పుడు గంటకు 170 మైళ్ల వేగంతో బెర్ముడా ట్రయాంగిల్ అలలు వీస్తుంటాయి. అంటే హరికేన్ కత్రినా సంభవించినప్పుడు వచ్చిన ఉప్పెన అంత వేగం అన్నమాట. అంటే సముద్రం నుంచి 45 అడుగుల ఎత్తువరకు ఈ అలలు ఎగసిపడుతుంటాయి. ఊహించుకుంటేనే తెలుస్తోంది.. ఎంత భయంకరమైన అలలు వస్తాయో.

మిస్టరీ

మిస్టరీ

ఇంత భారీ ఎత్తున ఎగసిపడే అలలు, తీవ్రవేగంతో మేఘాల నుంచి వచ్చే గాలుల కారణంగా.. ఈ బెర్ముడా ట్రయాంగిల్ భయానక ప్రదేశంగా మారింది. విమానాలు, ఓడలను మింగేసింది. దీనివెనక ఎలాంటి అదృశ్య శక్తులు, ఏలియన్స్ లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు.

English summary

The Bermuda Triangle Mystery Is Finally Solved!

The Bermuda Triangle Mystery Is Finally Solved! Has the mystery behind the Bermuda triangle been finally solved? Find out the facts which reveal the truth…
Desktop Bottom Promotion