రాశిని బట్టి మీ మూడ్ స్పాయిల్ అవడానికి కారణమయ్యే విషయాలు..!

మీ పార్ట్ నర్ రాశిని బట్టి వాళ్లకు అసహ్యం కలిగించే, చిరాకు తెప్పించే, మూడ్ ని స్పాయిల్ చేసే విషయాలను తెలుసుకోవడం మంచిది.

Posted By:
Subscribe to Boldsky

మగవాళ్లు లేదా ఆడవాళ్లలో వాళ్ల మూడ్ ని మార్చేసే, వాళ్లు అసహ్యించుకునేలా చేసే విషయాలేంటి అనేది గుర్తించారు. ఒక్కోసారి మీ భాగస్వామి మూడ్ ఎందుకు సడెన్ మారిపోయిందో తెలియదు. అలాగే మీ ప్రవర్తనలో వచ్చిన మార్పుని మీ పార్ట్ నర్ గుర్తించలేకపోతాడు. అసలు ఈ మూడ్ లో మార్పులను గుర్తించవచ్చా ? అంటే తేలికే అంటోంది జ్యోతిష్యం.

The Biggest Turnoffs for your Astrological Sign

మీ భాగస్వామితో రొమాన్స్ చేసేటప్పుడు సడెన్ గా మీ భార్య చేసే పని మీకు నచ్చకపోతే.. మీ మూడ్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల మీ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతారు. అలాగే కొన్నిసార్లు మీ ప్రవర్తన వల్ల మీ భార్య మూడ్ లో కూడా మార్పు వచ్చేస్తుంటుంది. అయితే.. ఎలాంటి సందర్భంలో, ఏ విషయాల్లో మీ పార్ట్ నర్ మూడ్ మారిపోతుందో తెలుసుకుంటే.. ఈ సమస్య మళ్లీ రాదు.

సెక్సువల్ యాక్టివిటీలో బ్రెయిన్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. దుర్వాసన, దుమ్ముతో నిండిన గోళ్లు వంటి అలవాట్లన్నీ మీ పార్ట్ నర్ అసహ్యించుకునేలా ఉంటాయి. కాబట్టి మీ పార్ట్ నర్ రాశిని బట్టి వాళ్లకు అసహ్యం కలిగించే, చిరాకు తెప్పించే, మూడ్ ని స్పాయిల్ చేసే విషయాలను తెలుసుకోవడం మంచిది.

మేష రాశి

మేషరాశి వాళ్లు ఎప్పుడూ అటెన్షన్ గా ఉంటారు. చాలెంజ్ లకు సిద్ధంగా ఉంటారు. అయితే మేష రాశి వాళ్లు అథారిటీని ఇష్టపడరు. వీళ్లకు తమపై ఆధిపత్యం చెలాయించేవాళ్లు అంటే అసహ్యం.

వృషభ రాశి

జీవితంలోనూ, సెక్స్ లైఫ్ లోనూ.. రెండింటిలోనూ వృషభ రాశివాళ్లు చాలా అసాధారణంగా ఉంటారు. కానీ అసభ్యకరాన్ని, చెడు రుచి, అటెన్షన్ కోరుకునేవాళ్లను ఇష్టపడరు. వీళ్లకు స్థిరత్వం, సౌకర్యం అవసరం.

మిథున రాశి

స్వార్థపూరితమైన వాళ్లంటే మిథునరాశి వాళ్లకు అసహ్యం. వీళ్లు చాలా నింపాదిగా ఉంటారు. కాబట్టి ఇతరులతో కమ్యునికేట్ అవడం చాలా అవసరం.

కర్కాటక రాశి

వీళ్లు ఇవ్వగలిగినప్పుడు సలహాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. కర్కాటక రాశి వాళ్లు తమ ఎమోషన్స్ ని పంచుకుంటారు. మిడిమిడిగా వ్యవహరించేవాళ్లంటే కర్కాటక రాశి వాళ్లకు అసహ్యం. మిడిమిడిగా వ్యవహరిస్తే.. వీళ్ల మూడ్ మారిపోతుంది.

సింహ రాశి

సింహరాశి వాళ్లకు సిగ్గు ఎక్కువ, కాన్ఫిడెన్స్ తక్కువ. నిజాయితీగా ఉంటారు. కానీ ఆప్యాయతగా, అభిరుచి కలిగి ఉండటం చాలా అవసరం. నిజాయితీ లేనివాళ్లు, మోసపూరితమైన వాళ్లంటే సింహరాశి వాళ్లకు అసహ్యం. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేయకపోతే.. మీ మూడ్ పూర్తీగా పోతుంది.

కన్యారాశి

కన్యారాశి వాళ్లు తమ ఆరోగ్యం, శరీరం గురించి పట్టించుకోని వాళ్లంటే చాలా అసహ్యం. ఆత్రుతగా బెడ్ పైకి వెళ్లాలి అనుకుంటే.. కన్యారాశి వాళ్ల మూడ్ స్పాయిల్ అవుతుంది.

తులారాశి

గౌరవించని వాళ్లంటే తులారాశి వాళ్లకు చాలా అసహ్యం. గౌరవం లేని వాళ్లతో ఏమాత్రం ఉండలేరు. వికారంగా కనిపించే వాళ్లను చూస్తే.. వీళ్లకు మూడ్ స్పాయిల్ అవుతుంది. తులారాశి వాళ్లకు లాయల్టీ చాలా ముఖ్యమైనది.

వృశ్చిక రాశి

వాళ్లకు సంబంధించిన అన్ని సీక్రెట్స్ ని అందరితో చెప్పేసేవాళ్లు అంటే.. వృశ్చికరాశి వాళ్లకు నచ్చదు. దాచుకోవడాన్ని వీళ్లు ఇష్టపడతారు. చంచలమైన బుద్ధి ఉన్నవాళ్లను ఏమాత్రం ఇష్టపడరు.

ధనస్సు రాశి

ధనస్సురాశివాళ్లకు సెక్సువాలిటీ అంటే.. ఎనర్జిటిక్ గా ఉండాలని భావిస్తారు. ఇతరులు వీళ్లకు ఏదైనా వివరిస్తే నచ్చదు.

మకర రాశి

డ్రామా చేసే వాళ్లంటే.. మకర రాశివాళ్లకు అసహ్యం. నలుగురిలో, పబ్లిక్ లో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడటం, అసహ్యంగా ప్రవర్తించే వాళ్లంటే నచ్చదు. టైం సెన్స్ ఫాలో కాని వాళ్లంటే కూడా వీళ్లకు నచ్చదు.

కుంభరాశి

మార్పులను వ్యతిరేకించే వాళ్లంటే కుంభరాశి వాళ్లకు అసహ్యం. ఎప్పటికప్పుడు మార్పులు కోరుకుంటారు. అచ్చం వీళ్లలాగే ఆలోచించేవాళ్లకు, వీళ్లకు నచ్చినవాళ్లకు మాత్రమే తమ సీక్రెట్స్ ని పంచుకుంటారు. కంట్రోల్ చేసేవాళ్లంటే కుంభరాశి వాళ్లకు నచ్చదు. ఫ్రీడం కోరుకుంటారు.

మీన రాశి

ఒకవేళ మీనరాశి వాళ్ల భాగస్వామి చాలా డిమాండ్ చేయడం, బెడ్ పై ఎప్పటికీ సాటిస్ఫై చేయకపోతే.. వీళ్ల మూడ్ మారిపోతుంది. చాలా దురుసుగా ప్రవర్తిస్తే.. వీళ్లకు సెక్స్ పై కోరిక తగ్గిపోతుంది. వీళ్లు ప్రేమ, ఆప్యాయతను కోరుకుంటారు.

English summary

The Biggest Turnoffs for your Astrological Sign

The Biggest Turnoffs for your Astrological Sign. What are the biggest turnoffs that you have ever discovered in a man or a woman?
Story first published: Wednesday, November 30, 2016, 16:15 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter