ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఉండాల్సిన, ఉండకూడని జంతువులు..!

హిందూ పురాణాల ప్రకారం కొన్ని రకాల జంతువులు అదృష్టాన్ని, సంపదను, శ్రేయస్సును తీసుకొస్తాయి. జీవితంలో మంచి భవిష్యత్ ని అందిస్తాయి. ఇలాంటి జంతువులు, వాటి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది.

Posted By:
Subscribe to Boldsky

ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు అనేదానిపై చాలా రకాల అభిప్రాయాలున్నాయి. అయితే చాలామందికి తమకు బాగా ఇష్టమైన జంతువులు, జంతువుల ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు.

pets

హిందూ పురాణాల ప్రకారం కొన్ని రకాల జంతువులు అదృష్టాన్ని, సంపదను, శ్రేయస్సును తీసుకొస్తాయి. జీవితంలో మంచి భవిష్యత్ ని అందిస్తాయి. ఇలాంటి జంతువులు, వాటి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి చాలా ఎక్కువ ఫలితాలు కలుగుతాయి.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

కానీ కొన్ని జంతువులు, జంతువుల ఫోటోలను పెంచుకోవడం కానీ, పెట్టుకోవడం కానీ చేయకూడదు. అవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీతో పాటు, దురదృష్టానికి కారణమవుతాయి. మరి ఏ జంతువులు పెంచుకోవాలి, ఎలాంటి జంతువులు, పెట్స్ ఫోటోలు కానీ, బొమ్మలు కానీ ఇంట్లో ఉండకూడదో చూద్దాం..

తాబేలు

తాబేలు సంపదకు చిహ్నం. కాబట్టి తాబేలును కానీ, తాబేలు బొమ్మను కానీ.. ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం, మీకు ధనం ఖచ్చితంగా తీసుకొస్తుంది.

కుందేలు

కుందేలుని ఇంట్లో పెంచుకోవడం వల్ల పిల్లలకు అదృష్టం తీసుకొస్తుంది. ఈ జంతువు ఇంట్లో ఉంటే.. ఇంట్లో వాళ్లకు టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్య దరిచేరదు.

పావురం

పావురం అదృష్టానికి సంకేతం. పావురం ఇంట్లో ఉంటే.. పక్షవాతంతో బాధపడేవాళ్లు త్వరగా కోలుకుంటారు.

ఆవు

ఆవు ఇంట్లో ఉంటే.. దేవతలందరూ మీ ఇంట్లో ఉన్నట్టే. అందుకే.. ఆవు ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. అలాగే ఇంట్లో నుంచి నెగటివిటీని తొలగించి.. ప్రశాంతతను తీసుకొస్తుంది.

చేప

మీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మెరుగుపరచడంలో చేప మరొక అద్భుతమైన పెట్. ఇవి నీటిలో కదులుతూ.. ఇంటికి శుభ శక్తులను తీసుకొస్తాయి.

కుక్క

కుక్కలు రక్షణను, భక్తిశ్రద్ధలకు సంకేతం. కుక్కలను పెంచుకోవడం వల్ల వాతావరణంలో ఎనర్జీని మెరుగుపరిచి.. ఇంట్లో వాళ్లు యాక్టివ్ గా, హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

కప్ప

కప్పలను ఇంట్లోకి లేదా గార్డెన్ లోకి లేదా ఏదైనా చిన్న నీటి కుంటలోకి ఆహ్వానించడం వల్ల.. మంచి భవిష్యత్, సంపద, అదృష్టాన్ని తీసుకొస్తాయి.

పిల్లి

చాలామంది పిల్లులు అంటే ఇష్టపడతారు, మరికొందరు అసహ్యించుకుంటారు. కానీ.. పిల్లులను కూడా పెంచుకునేవాళ్లు లేకపోలేదు. కానీ హిందూ పురాణాల ప్రకారం పిల్లిని పెంచుకోవడం దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు.

గుర్రం

గుర్రం పవర్ ని సూచిస్తుంది. కాబట్టి గుర్రంను పెంచుకోవడం, గుర్రం బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. కెరీర్ లో సక్సెస్ అవడానికి, ప్రమోషన్స్ పొందడానికి సహాయపడతుంది.

చిలుక

చిలుక పలుకులంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఇంట్లో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు.. చిలుక సందేశం ఇస్తుంది. కాబట్టి.. దీన్ని పెంచుకోవచ్చు.

పాము

పాములు దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అందుకే.. పాములను చాలా దురదృష్టంగా భావిస్తారు. కాబట్టి పాములు, పాముల బొమ్మలను ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది.

పంది

హిందూ పురాణాల ప్రకారం పంది సరైన పెంపుడు జంతువు కాదు. వీటిని పెంచుకోవడం వల్ల వ్యాధులను వ్యాపింపజేస్తాయి. కాబట్టి.. పందులను ఇంట్లోకి తీసుకురాకూడదు.

తేలు

తేలును దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. అలాగే ఇవి కుటుంబంలో అన్ హ్యాపీనెస్ కి కారణమవుతాయి. కాబట్టి.. ఒకవేళ ఇంట్లో వీటిని చూసినా.. వెంటనే బయటకు పడేయండి.

English summary

The Pets That Bring Good Luck and Misfortune in a house

The Pets That Bring Good Luck and Misfortune in a house. According to the Hindu Puranas, there are certain animals that bring good luck, prosperity, wealth and any kind of good fortune.
Please Wait while comments are loading...
Subscribe Newsletter