అన్ని రాశులలో కంటే ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ..!!

కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది.

Posted By:
Subscribe to Boldsky

రాశులలో కన్యరాశి ఆరోది. ఇది సరి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో పొట్ట, నడుము, నరాలను ఈ రాశి సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీరాశి, దిశ దక్షిణం. ఇందులో ఉత్తరా ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నాలుగు పాదాలూ, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. నివాస స్థానం కేరళ ప్రాంతం. ఇది భారత్, బ్రెజిల్, టర్కీ పరిసర ప్రాంతాలను సూచిస్తుంది.

కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది. గనితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది. ఇతరుల నెర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నెర్పు ఉన్నా దానిని ఋజువు చేసే ప్రయత్నము చేయలేరు.

They are More Forgiving Nature of this Horoscope..!

పెసలు, బఠాణీలు, ఆముదం, పత్తి మొదలైన ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది.

కన్యరాశి వారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు, మొహమాటస్తులు. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంలో తేనెటీగలను తలపిస్తారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంలోనే ఆనందం వెదుక్కుంటారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన ధోరణిలోనే జీవిస్తారు. ప్రణాళికాబద్ధంగా, పూర్తి అంకిత భావంతో కష్టించి పనిచేయడంలో వీరికి సాటివచ్చే వారు అరుదు. ఎంత ఒత్తిడి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండటం వీరి ప్రత్యేకత.

They are More Forgiving Nature of this Horoscope..!

మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచు అపార్థాలకు గురవుతారు. అయితే, ఇతరులు చొరవ తీసుకుని, వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల నమ్మకంగా ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా ఎక్కువే. ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమిస్తారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతం. పనిభారం ఎంత ఉన్నా తొందరగా అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా, వీరికి విలాసాలపై కూడా మక్కువ ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకుంటే తొందరగా నిర్వేదానికి లోనవుతారు.

They are More Forgiving Nature of this Horoscope..!

మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకు పాల్పడతారు. తాము ఉండే చోట అన్నీ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కోసారి సన్నిహితులకు చాదస్తంగా అనిపిస్తుంది.

సృజనాత్మకతకు ఆస్కారం ఉండే రచన, నటన, సంగీత, నృత్య కళా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అకౌంటింగ్, బ్యాంకింగ్, వైద్యం, సామాజిక సేవ, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లోనూ తమ ప్రత్యేకత చాటుకుంటారు.

They are More Forgiving Nature of this Horoscope..!

వ్యవసాయం, పండ్లతోటల పెంపకం, పశుపోషణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. బయటకు ఏదీ చెప్పుకోకుండా లోలోనే కుమిలిపోయే తత్వం వల్ల మానసిక సమస్యలతో, నాడీ సమస్యలతో బాధపడతారు.

English summary

They are More Forgiving Nature of this Horoscope..!

The perfect (or so they think) and earthy Virgos are born between August 23 and September 22. They’re known to be analytical, observant, helpful, reliable, precise, but are also known for their skeptical, picky, cold, and stubborn nature. Their best love matches are Taurus, Cancer, Scorpio, and Capricorn, but don’t mesh so well with Gemini and Sagittarius.
Please Wait while comments are loading...
Subscribe Newsletter