For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్ను దృష్టి సోకడం వల్ల కలిగే నష్టాలు, వాటి నివారించే ఉపాయాలు

By Super Admin
|

నమ్మకం ఒక బలమైన శక్తి.చాలా మందికి "దిష్టి" మీద నమ్మకం ఉండదు సరికదా అది ఒక మూఢనమ్మకమని తీసిపారెస్తుంటారు కూడా.వారికి జోహార్లు.కానీ ఇంకొంతమందికి వాటి మీద అపారమైన నమ్మకం.వారిని చూసి నవ్వడం వల్ల లాభం లేదు ఎందుకంటే వారి మటుకు మాత్రం ఇవే నిజాలు.

కనుదిష్టి మరియూ ఇతర లక్షణాలకి నివారణోపాయాలు:

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే కనుక మంచితనం,సహనశీలత్వంతో పాటు చెడూ, దురాశ కూడా కనిపిస్తాయి.చెడు అన్నది వివిధ సంస్కృతుల్లో వివిధ రకాలుగా ఉండి అనేక రకాలైన ప్రభావాలని కలుగచేసేదిగా ఉంటుంది.అన్ని సంస్కృతుల్లో సాధారణంగా కనిపించే నెగెటివ్ ఎనెర్జీ "కను దృష్టి దోషం" లేదా "దిష్టి దోషం".కపట బుద్ధితో చూసే చూపు వల్ల అనుకోని ప్రమాదాలో లేక ఇతర రకాలుగా నష్టమో జరుగవచ్చు.

ఒకరంటే శతృత్వం లేదా వారంటే పడకపోవడం వల్ల చూసే చూపుతో ఇలా జరిగే అవకాశం ఉంది.ఇంకా విపులంగా చెప్పాలి అంటే మనకి ఇష్టం లేనివారికి చెడు జరగాలి అనుకుని చూసే చూపు అన్నమాట.ఈ కనుదృష్టి నివారణకు వివిధ ప్రాంతాలో వివిధ రకాలైన నివారణోపాయాలున్నాయి.ఒక్కొక్క మతంలో కూడా ఈ కనుదృష్టి దోషం వల్ల కలిగే లక్షణాలు వాటికి తగ్గ విరుగుళ్ళూ పేర్కొనబడ్డాయి.ఇక కనుదృష్టి తగలడం వల్ల కలిగే పరిణామాలు వాటి విరుగుళ్ళేమిటో చూద్దామా:

తీవ్రమైన జబ్బు:

తీవ్రమైన జబ్బు:

ప్రక్కింటివారు లేదా చుట్టాలలో ఎవరిదైనా కనుదృష్టి తగిలితే కుటుంబంలో ఒకరికి తీవ్ర అనారోగ్యం కలుగవచ్చు.దీనికి విరుగుడుగా సముద్రపు నీటిని శుభ్రమైన తెల్లని బట్టలో వడకట్టి గోమూత్రం కలిపి సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ నీటిని అన్ని గదులలో పౌర్ణమి రోజున, పాడ్యమి రోజునా అన్ని గదుల్లో చిలకరించాలి.మంగళ మరియూ శుక్ర వారాల్లో కూడా చెయ్యవచ్చు. దీని వల్ల దృష్టి దోషం పోవడంతో పాటు తీవ్రమైన జబ్బులు కూడా తగ్గుతాయి.

పెంపుడు జంతువుల అనారోగ్యం మరియూ ఆకలి లేకపోవడం:

పెంపుడు జంతువుల అనారోగ్యం మరియూ ఆకలి లేకపోవడం:

కనుదిష్టి వల్ల పెంపుడు జంతువులకి ఆకలి తగ్గిపోవడం లేదా నిరంతరం జబ్బుపడటం లాంటివి జరుగుతాయి.మీ జంతువులని పసుపు నీటితో కడగడం వల్ల చెడు దృష్టిని దూరం చేసుకోవచ్చు.

వ్యాపారంలో నష్టాలు, కలిసిరాకపోవడం:

వ్యాపారంలో నష్టాలు, కలిసిరాకపోవడం:

పోటీదారులు లేదా శతృవుల కనుదృష్టి వల్ల వ్యాపరంలో నష్టపోవడం లేదా సజావూఅ సాగకపోవడం వంటివి జరగవచ్చు.వ్యాపారంలో దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయ వేసి ఉంచాలి.ఈ గ్లాసుని అందరూ వచ్చి వెళ్ళే చోట ఉంచి నీటిని ప్రతి రోజూ మారుస్తూ ఉండాలి. నిమ్మకాయని ప్రతి శనివారం మార్చాలి.

వస్తు నష్టం:

వస్తు నష్టం:

కను దృష్టి వల్ల ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నష్టపోవడం జరుగుతుంటుంది.ఒక తెల్లటి బౌల్లో రంగు రంగుల రాళ్ళు లేదా పూసలు వేసి ఉంచితే ఫలితం ఉంటుంది.

నవజాత శిశువులకి అనారోగ్యం:

నవజాత శిశువులకి అనారోగ్యం:

పుట్టిన పిల్లలని చూడటానికి వచ్చినవాళ్ళు వెళ్ళిన తరువాత పసి పిల్లలలో అకస్మాత్తుగా అనారోగ్యం కలుగవచ్చు.ఈ దిష్టి పోవాలంటే చేతిలో ఉప్పు వేసుకుని పిలల్ల తల చుట్టూ అటూ ఇటూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వెయ్యాలి.

పిల్లలలో తరచూ కడుపునెప్పి:

పిల్లలలో తరచూ కడుపునెప్పి:

పిల్లలలో తరచూ కడుపు నెప్పి వస్తోంటే కనుక వీధి చివరనుండి ఓ గుప్పెడు ఇసుక తీసుకుని ఆవాలు కలిపి ఆ మిశ్రమాన్ని పిల్లల పొట్ట మీద వీసి తీసేసాకా దానిని కాల్చెస్తే దృష్టి దోషం పోతుంది.

దురదృష్టం మరియూ నిరుద్యోగం:

దురదృష్టం మరియూ నిరుద్యోగం:

హాలులో పశ్చిమ దిశలో ఆక్వేరియం ఉంచితే ఇలాంటి సమస్యలు సమసిపోతాయి.

.గర్భవతులమీద దృష్టి దోషం:

.గర్భవతులమీద దృష్టి దోషం:

గర్భవతులు ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు 2-3 వేప ఆకులు వెంటపెట్టుకెళ్ళి ఇంటికి తిరిగి రాగానే ఆ ఆకులని కాల్చెస్తే చెడు దృష్టిని కూడా కాల్చెయ్యవచ్చు.

తరచూ ప్రసంగించేవారిలో గొంతు సమస్యలు:

తరచూ ప్రసంగించేవారిలో గొంతు సమస్యలు:

ప్రవచనకర్తలు లేదా తరచూ బహిరంగ సభల్లో ప్రసంగించేవారిలో కను దృష్టి వల్ల గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే రావి చెట్టు చిన్న కొమ్మ ని గుమ్మానికి వ్రేలాడదీసి అదే చెట్టు నుంది మరొక చిన్న కొమ్మ ని ముక్కలు చేసి జేబులో పెట్టుకోవాలి.ఇది ఇంటి నుండి చెడు దృష్టిని పారద్రోలడానికి చక్కటి సాధనం.

పిల్లల చదువులు మరియూ సంబంధ బాంధవ్యాల మీద చెడు దృష్టి:

పిల్లల చదువులు మరియూ సంబంధ బాంధవ్యాల మీద చెడు దృష్టి:

వీటి మీద చెడు కన్ను పడకూడదనుకుంటే కనుక వేయించిన పటిక,మిరపకాయ,నిమ్మకాయ లేదా పెద్ద సీ షెల్(గవ్వ)స్ విరుగుడుగా పనిచేస్తాయి.వీటిని వీధ రకాలుగా ఇళ్ళల్లో మరియూ పాఠశాలల్లో ఉపయోగిస్తారు.తమకి ఏది నప్పుతుందో చూసుకుని ఆ పద్ధతిని పాటిస్తే చెడు దృష్టి నుండి పిల్లల చదువులనీ మన సంబంధాలనీ కూడా కాపాడుకోవచ్చు.

కానీ ఒక్కటి గుర్తుంచుకోండి-ఇవన్నీ ప్రయత్నిచడానికి ఇచ్చే కొన్ని ఎంపికలు మాత్రమే.అనారోగ్యం చేసినప్పుడు వైద్యుడి దగ్గరకి వెళ్ళడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు కదా.జాగ్రత్త.


English summary

Top 10 Symptoms And Remedies To Get Rid of Evil Eye

Belief can be a powerful thing. Many do not believe in things like evil eye and shrug them off as superstition. More power to them. But others have deep seated belief in the supernatural. Laughing it off is no solution because for the believers, these are true facts of life.
Story first published: Friday, September 23, 2016, 18:27 [IST]
Desktop Bottom Promotion