పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి కాదు.. కుక్కలు, కప్పలు ముస్తాబయ్యాయి..!

సంప్రదాయాలు చూస్తే షాక్ అవడమే కాదు.. నవ్వు ఆపులేకపోతారు. అంత ఫన్నీగా ఉన్న వింత పెళ్లి సంప్రదాయాలు ఎక్కడివో కాదు.. మన ఇండియాలోనే జరిగాయి. మరి ఆ విశేషాలు మీకోసం..

Posted By:
Subscribe to Boldsky

పెళ్లి వేడుక సంప్రదాయాలు, మతాలు, దేశాలు, ప్రాంతాలను బట్టి వారి వారి ఆచారం ప్రకారం చేస్తారు. చాలా వరకు పెళ్లి అంటే.. పెళ్లి జంట తాళి కట్టడం, రింగ్స్ మార్చుకోవడం, పూలదండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడం వంటి సంప్రదాయాలు చూస్తుంటాం.

unusual weddings

చుట్టాలు, స్నేహితులు అందరూ వచ్చి వాళ్లను ఆశీర్వదిస్తారు. మరికొంతమంది వైట్ వెడ్డింగ్ అంటే.. క్వీన్ విక్టోరియా వెడ్డింగ్ మాదిరిగా పెళ్లికూతురు వైట్ డ్రెస్ లో ముస్తాబవడం వంటి సంప్రదాయం కూడా నడుస్తోంది. పెళ్లి అనేది యూనివర్సల్ అకేషన్. అనేక సంప్రదాయాలు, ఆచారాలు, పాత పద్ధతులు, కొత్త పద్ధతులు ఇలా ఎన్నో మ్యారేజ్ కల్చర్స్ ఉన్నాయి.

చాలా మంది ఒక కళ్యాణ మండపం బుక్ చేసి, వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేసి, చుట్టాలందరి సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అయితే ఇలాంటి సంప్రదాయాలు సాధారణం. కానీ.. ఇక్కడున్న, ఫాలో అవుతున్న సంప్రదాయాలు చూస్తే షాక్ అవడమే కాదు.. నవ్వు ఆపులేకపోతారు. అంత ఫన్నీగా ఉన్న వింత పెళ్లి సంప్రదాయాలు ఎక్కడివో కాదు.. మన ఇండియాలోనే జరిగాయి. మరి ఆ విశేషాలు మీకోసం..

కుక్క

తాను ఎంతగానో ఇష్టపడే కుక్కనే పెళ్లి చేసుకుందో ఆ యువతి. ఇక అబ్బాయితో అవసరం లేదంటూ.. కుక్కతోనే జీవితాంతం గడిపేస్తానంటోంది.

పెళ్లికూతురైన కుక్క

తన మంత్రాలు, టార్చర్ భరించడానికి ఏ అమ్మాయి దొరకలేదు కాబోలు. కుక్కను పెళ్లి చేసుకున్నాడు.

ఆవు పెళ్లి

ఆవులకు పెళ్లిళ్లు చేస్తారని మీకు తెలుసా ? ఇండియాలోని కొన్ని గ్రామాలు, ప్రాంతాల్లో ఆవులకు పెళ్లిళ్లు చేయడం ఆచారం.

గే మ్యారేజ్

ఇండియాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గేలు పెళ్లిచేసుకోవడాన్ని అంగీకరిస్తారట. అదే ఇక్కడ జరిగింది.

కప్పల పెళ్లి

మనుషుల పెళ్లిళ్లు చూసి చూసి విసిగిపోయారా ? అయితే వారణాసికి వర్షాకాలంలో వెళ్లిరండి. అక్కడ కప్పల పెళ్లి చూసిరావచ్చు.

ముసలోడి పెళ్లి

ఈ ముసలాయన పక్కన ఉన్నది మనవరాలని పొరబడకండి. ఆ అమ్మాయి పెళ్లికూతురు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి పెళ్లిళ్లు కేవలం ఇండియాలోనే జరుగుతాయి.

సూపర్ మ్యాన్ గెటప్

వావ్ ఇతనో సూపర్ మ్యాన్ ఫ్యాన్ కాబోలు. అందుకే పెళ్లి కూడా సూపర్ మ్యాన్ డ్రెస్ లో చేసుకున్నాడు. మరీ ఇంత పిచ్చి ఏంటో కదూ.

బుల్డోజర్ వెడ్డింగ్

గుర్రం లేదా ఇంకేదైనా ఖరీదైన వాహనం ఉపయోగించడం దేనికి. బుల్డోజర్ ని ఉపయోగించి.. క్రేజీగా పెళ్లి చేసుకోమని సూచిస్తున్నారు.. ఈ క్రేజీ కపుల్స్.

English summary

Unusual Indian Wedding Pictures!

Unusual Indian Wedding Pictures! Here, in this article, we are about to share some of the most unusual pictures of Indian weddings.
Please Wait while comments are loading...
Subscribe Newsletter