మీ రాశిని బట్టి మీకున్న ప్రత్యేక లక్షణాలేంటి ?

అన్ని రాశులలో ఏ రాశి అత్యంత సరసమైనది ? ఏ రాశి వాళ్లు చాలా స్నేహిపూర్వకంగా ఉంటారు ? ఏ రాశి వాళ్ల క్యారెక్టర్ ఎలా ఉంటుంది ? ఏ రాశి వాళ్లు విశిష్టమైన లక్షణాలను కలిగి ఉంటారు ?

Posted By:
Subscribe to Boldsky

అన్ని రాశులలో ఏ రాశి అత్యంత సరసమైనది ? ఏ రాశి వాళ్లు చాలా స్నేహిపూర్వకంగా ఉంటారు ? ఏ రాశి వాళ్ల క్యారెక్టర్ ఎలా ఉంటుంది ? ఏ రాశి వాళ్లు విశిష్టమైన లక్షణాలను కలిగి ఉంటారు ? ఏ రాశి వాళ్ల ప్రత్యేక లక్షణాలు ఏంటి ?

zodiac sign trait

కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది రూడ్ గా ఉంటారు, కొంతమంది చాలా నిర్మొహమాటంగా ఉంటారు. అయితే.. ఈ లక్షణాలన్నీ రాశులు, వాళ్ల రాశి ప్రకారం గ్రహాధిపతులను బట్టి ఉంటుంది. కాబట్టి.. ఏ రాశివాళ్లకు ఎలాంటి ప్రత్యేక లక్షణాలుంటాయో తెలుసుకుందాం..

మేష రాశి

కెరీర్, మనీ మీకు పెద్ద ప్రోత్సాహకాలు. లీడర్స్, వ్యాపారవేత్తలు, అథ్లెట్స్ అవుతారు. అలాగే వీళ్లు సరసమైనవాళ్లు. ప్రేమ, రొమాన్స్ వీళ్లలో ఎక్కువగా ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశిలో జన్మించిన వాళ్లు.. టచ్ అనే సెన్స్ పై ఉన్నతంగా ఉంటారు. వీళ్లు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే.. శారీరక ఆకర్షణను ఇష్టపడతారు. వీళ్లకు తగిన స్టేటస్ ఉన్నవాళ్లతోనే ఫ్రెండ్ షిప్ చేస్తారు. తమ తెలివి, ఆశయాలకు తగిన వాళ్లను లైఫ్ పార్ట్ నర్ గా ఎంచుకోవాలని భావిస్తారు.

మిధున రాశి

మిధున రాశి వాళ్లు త్వరగా మార్పులను కోరుకుంటారు. దీనివల్ల జాబ్ కూడా త్వరగా మారుతూ ఉంటారు. మిధునరాశి వాళ్లు మూడీగా ఉంటారు. బోర్ గా ఫీలవుతారు. చాలా తరచుగా మార్పు కావాలనుకుంటారు.

కర్కాటక రాశి

వీళ్లు రిలాక్సేషన్ ని ఇష్టపడతారు. హాలిడేస్ లో బీచ్ లో ఎంజాయ్ చేయడానికి ఆసక్తిచూపిస్తారు. విడాకులు, బ్రేక్ అప్ నుంచి బయటపడటం కర్కాటక రాశివాళ్లకు కష్టం. చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీళ్లు ఇష్టపడిన వాళ్లకు దూరం అవడానికి ఇష్టపడరు.

సింహరాశి

సింహరాశి వాళ్ల వ్యక్తిత్వం చాలా సహజమైనది. సింహరాశివాళ్లు ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుంది. ఏదైనా అడ్వెంజర్ ట్రిప్ లేదా రాత్రి పూట క్లబ్ కి వెళ్లడం వంటి సరదాలతో.. మూడ్ లో మార్పు తీసుకురావచ్చు.

కన్యా రాశి

కన్యారాశి వాళ్లు స్నేహితులను చేసుకోవడంలో సెలెక్టివ్ గా ఉంటారు. వీళ్లు చాలా ప్రాక్టికల్ గా, వాళ్ల నమ్మకం కుదిరిన వాళ్లతో మాత్రమే మాట్లాడతారు. చాలా త్వరగా కోపం వస్తుంది. కోపం వస్తే.. భయపెడతారు.

తులారాశి

తులారాశి వాళ్లు ఇతరుల మైండ్ ని తెలుసుకోగలుగుతారు. వీళ్లు ఎదుటివాళ్లు చెప్పేదాన్ని బాగా వింటారు. వీళ్లు కమ్యునికేషన్ స్కిల్స్ ద్వారా.. ఇతరుల్లో మంచి అభిప్రాయం కలిగిస్తారు. డిబేట్ లను ఇష్టపడతారు. వాదించి గెలవడానికి ప్రయత్నిస్తారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్ల లైఫ్ బ్లాక్ అండ్ వైట్ మిలితమై ఉంటుంది. కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయి. వీళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొన్నిసార్లు వ్యంగ్యగా ఉంటుంది.

ధనస్సు రాశి

వీళ్లు చేయగలిగిన దానికంటే.. ఎక్కువ ప్రామిస్ చేస్తారు. కొన్నిసార్లు ఓర్పు కోల్పోయి.. చాలా రూడ్ గా ప్రవర్తిస్తారు. వీళ్లు ట్రావెలింగ్ ని ఇష్టపడతారు. వీళ్లు ఆలోచనలు.. జీవితానికి అర్థాన్ని వివరిస్తాయి.

మకర రాశి

మకరరాశి వాళ్లు జీవితాన్ని చాలా సంప్రదాయంగా పోరాడటానికి ఇష్టపడతారు. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు చాలా నమ్మకమైనవాళ్లు. ఇతరులను అంతతేలికగా నమ్మరు.

కుంభరాశి

ఏరోనాటిక్స్ లో కుంభరాశి వాళ్లు రాణిస్తారు. అలాగే జ్యోతిష్యులుగా, ఆధ్యాత్మిక పాలకులుగా రాణిస్తారు. చాలా లోతుగా ఆలోచిస్తారు. చాలా రెబలిసిల్ గా వ్యవహరిస్తారు.

మీనరాశి

మీనారశి వాళ్లు తప్పించుకునే స్వభావాన్ని చూపిస్తారు. వాళ్ల సమస్యల నుంచి పారిపోతారు. సహాయం కావాల్సి వచ్చినప్పుడు వీళ్లకు ఎట్రాక్ట్ అవుతారు. వీళ్లను ఇతరులు
విచిత్రమైనవాళ్లుగా భావిస్తారు.

English summary

What is Your Trait According to Your zodiac sign

What is Your Trait According to Your zodiac sign. Which is the most flirtatious of all the zodiac signs? Which is the friendliest one?
Please Wait while comments are loading...
Subscribe Newsletter