మగవాళ్ల బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి.. వాళ్ల ఆలోచనలు పసిగట్టవచ్చా..??

మగవాళ్ల బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి.. వాళ్ల మనసులో దాగున్న ఆలోచనలను ఇట్టే పసిగట్టేయవచ్చు అంటున్నాయి స్టడీస్. మరి మీ పార్ట్ నర్ బాడీ ల్యాంగ్వేజ్ ఏం చెబుతోందో తెలుసుకోండి.

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా ఎదుటివాళ్ల ఆలోచనలు, ఫీలింగ్స్ కనిపెట్టడం చాలా కష్టం. ఏ విషయమైనా పెదాలు దాటి వచ్చినప్పుడే.. ఎదుటివాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోగలుగుతాం. పార్ట్ నర్ విషయంలో అయినా, ఫ్రెండ్ విషయంలోనైనా.. అంతర్గత ఆలోచనలు పసిగట్టడం కష్టమే.

What Male Body Language Reveals Personality

అయితే మగవాళ్ల బిహేవియర్, బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి.. వాళ్ల ఆలోచనలు ఇట్టే కనిపెట్టేయవచ్చు అంటున్నాయి స్టడీస్. కొన్ని సందర్భాల్లో పార్ట్ నర్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు ? అతని మనసులో ఏముంది అన్న సంగ్ధితంతో.. ఆడవాళ్లు పోరాడుతుంటారు. అయితే.. ఇలాంటి రిస్క్ లేకుండా.. తేలికగా.. వాళ్ల పర్సనాలిటీ కనిపెట్టే ఛాన్స్ ఇప్పుడు ఆడవాళ్లకు దొరికింది.

అతను మీకు అపద్ధం చెబుతున్నాడని, ఏదో విషయం దాచిపెడుతున్నారని.. వాళ్ల కళ్లను చూస్తే తెలుస్తుంది. కానీ.. ఆ విషయం తెలుసుకోవడం కష్టం. కాబట్టి.. మగవాళ్ల బాడీ ల్యాంగ్వేజ్ ని బట్టి.. వాళ్ల మనసులో దాగున్న ఆలోచనలను ఇట్టే పసిగట్టేయవచ్చు అంటున్నాయి స్టడీస్. మరి మీ పార్ట్ నర్ బాడీ ల్యాంగ్వేజ్ ఏం చెబుతోందో తెలుసుకోండి.

చేతులు కట్టుకుని నిలబడితే

ఒకవేళ మగవాళ్లు చేతులు రెండూ చెస్ట్ పై కట్టుకుని నిలబడితే.. అతను ఇన్ సెక్యూర్ గా ఫీలవుతున్నాడని సంకేతం. ఇలా చేతులు పెట్టుకుంటే.. తన మనసుని రక్షించుకోవడానికి శారీరకంగా ప్రయత్నిస్తున్నట్టు సూచిస్తుంది.

చేతులు పాకెట్ లో పెట్టుకుంటే

మీతో మాట్లాడేటప్పుడు మీ పార్ట్ నర్ చేతులను పాకెట్ లో పెట్టుకుంటే.. ఏదో రహస్యాన్ని మీతో దాచిపెట్టాలని చూస్తున్నారని సంకేతం. అంత కొంత ఆందోళన కలిగించే విషయమే అయి ఉండవచ్చు.

వాచ్ తో ఆడుకుంటూ ఉంటే

ఒకవేళ మీ భాగస్వామి వాచ్ తో ఆడుకుంటూ ఉంటే.. పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారని, పాత రోజులు మీరే గుర్తుచేస్తారని అతను ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు సంకేతం.

ఆవలింతలు

ఆవలిస్తూ మాట్లాడుతున్నారంటే.. అతను అలసిపోయినట్టు సంకేతమే.. కానీ.. అతను నటిస్తున్నాడని గుర్తించవచ్చు.

కాలిమీద కాలు వేసుకుని కూర్చుంటే

ఒకవేళ మీ భాగస్వామి మీ పక్కనే కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చున్నాడంటే.. తన ప్రైవేట్ పార్ట్స్ ని మీరు గాయపరుస్తారేమో అన్న ఆందోళన ఉన్నట్టు సంకేతం.

మీతో మాట్లాడేటప్పుడు తల దించుకుని ఉంటే

మీతో మాట్లాడేటప్పుడు అతను తల దించుకుని వర్క్ చేసుకుంటున్నారు అంటే.. అతను మిమ్మల్నే చూస్తున్నట్టు చెప్పాలనుకుంటున్నారు. మీకు ఏదో చెప్పాలని భావిస్తున్నారని.. ఎప్పుడైనా చెప్పేస్తారని సంకేతం.

తరచుగా ముఖాన్ని టచ్ చేస్తుంటే

మీతో ఉన్నప్పుడు.. అతను టెన్షన్ గా, చేతులను తరచుగా ముఖాన్ని ముట్టుకోవడం, ముక్కుని టచ్ చేయడం చేస్తూ.. బీప్ సౌండ్ చేస్తున్నాడంటే.. ఏదో సంతోషకరమైన విషయం చెప్పబోతున్నాడని సంకేతం.

మీ వైపు హిప్స్ చూపిస్తూ నిలబడితే

ఒకవేళ మీ ఎదురుగా మీతో మాట్లాడుతున్నప్పుడు.. అతను మీకు హిప్స్ చూపిస్తున్నాడంటే.. అతను కాన్ఫిడెన్స్ ఫీలవుతున్నాడని సంకేతం. అలాగే.. సెక్సీ ఫీలింగ్ కలిగి ఉన్నాడని తెలుపుతుంది.

English summary

What Male Body Language Reveals Personality

What Male Body Language Reveals Personality. Guide for decoding the male body language ti know his thoughts!
Please Wait while comments are loading...
Subscribe Newsletter