ఫేట్ లైన్ అక్కడక్కడ బ్రేక్ అయినట్టు ఉంటే.. దేనికి సంకేతం ?

అరచేతిలో ఉండే ఫేట్ లైన్ ఏ షేప్ లో ఉంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత వరకు సక్సెస్ అవుతారనేది తెలుపుతుంది. ఈ గీతను భాగ్యారేఖ అని కూడా పిలుస్తారు.

Posted By:
Subscribe to Boldsky

మీరు పుట్టిన సమయం నుంచి ఇప్పటి వరకు మీ చేతిలో గీతలు.. మీ యాక్షన్స్, మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్ ని బట్టి డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకే అరచేతిలో ఉండే గీతలను బట్టి పామిస్టరీ భవిష్యత్ ని వివరిస్తాయి.

fate line

హార్ట్, బ్రెయిన్, ఆఖరికి మీ వివాహ జీవితం గురించి, భవిష్యత్ గురించి కూడా.. మీ అరచేతులపై ఉండే గీతలు వివరిస్తాయి. అందుకే చేతి గీతలను బట్టి భవిష్యత్ ని అంచనా వేయడం ఒక ఆర్ట్ గా మారింది. కొన్ని బేసిక్ లైన్స్ ని బట్టి.. వాళ్ల ఫ్యూచర్ ని అంచనా వేయవచ్చు.

సాధారణంగా పామిస్టరీ ప్రకారం మూడు మెయిన్ లైన్స్ ఉంటాయి. హెడ్ లైన్, లైఫ్ లైన్, హార్ట్ లైన్. అరచేతిలో ఉండే ఫేట్ లైన్ ఏ షేప్ లో ఉంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత వరకు సక్సెస్ అవుతారనేది తెలుపుతుంది. ఈ గీతను భాగ్యారేఖ అని కూడా పిలుస్తారు. మధ్య వేలు కింది భాగాన్ని శని పర్వతం అని పిలుస్తారు. మరి.. మీ ఫేట్ లైన్ మీ జీవితంలో సక్సెస్ ని ఎలా వివరిస్తోందో తెలుసుకోండి..

సక్సెస్

ఒకవేళ మీ అరచేతిలో ఫేట్ లైన్ మణిబంధ్ (మణికట్టుపై) మొదలై.. శని పర్వతం (మధ్యవేలు కిందిభాగం) వరకు ఏర్పడి.. అది కూడా ఎక్కడా చీలిపోకుండా, స్ట్రెయిట్ గా ఏర్పడి ఉంటే.. మీరు జీవితంలో చాలా సక్సెస్ అవుతారు.

ఇతరుల సహాయంతో

ఒకవేళ మీ ఫేట్ లైన్ చంద్ర పర్వతం అంటే అరచేతిలో చిటికెన వేలుకి దిగువ భాగం చివర్లో ఎత్తుగా ఉండేది. ఇక్కడ నుంచి ఫేట్ లైన్ మొదలైందంటే.. ఇతరుల సహాయంతో మీరు సక్సెస్ అవుతారు.

బ్యాడ్ లక్

ఒకవేళ మీ ఫేట్ లైన్ మధ్యవేలుని తాకుతూ పైకి వెళ్లింది అంటే.. బ్యాడ్ లక్ కి సంకేతం.

సమస్యలు

ఒకవేళ మీ ఫేట్ లైన్ లైఫ్ లైన్ పైన దాటి వెళ్లిందంటే.. మీరు కెరీర్ లో ఎప్పుడూ.. సమస్యలను ఫేస్ చేస్తుంటారు.

సంపన్న వ్యక్తిని

ఒకవేళ ఫేట్ లైన్ చంద్రపర్వతం నుంచి మొదలై, దానికి సమానంగా మరో లైన్ ఏర్పడిందంటే.. బాగా సంపన్నుల కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది.

లక్

మీ లైఫ్ లైన్ దగ్గర నుంచి మీ ఫేట్ లైన్ స్టార్ట్ అయిందంటే.. మిమ్మల్ని లక్ వరిస్తుందని సంకేతం.

బ్యాడ్ లక్

ఒకవేళ మీ ఫేట్ లైన్ ఇతరు లైన్లతో కట్ చేసినట్టు లేదా మధ్యలో కట్ అవుతూ వస్తోంది అంటే.. అది బ్యాడ్ లక్ కి సంకేతం.

కెరీర్ కి ఆటంకం

ఒకవేళ ఫేట్ హార్ట్ లైన్ దగ్గర ఆగిపోయి ఉందంటే.. మీ లవ్ లైఫ్ మీ కెరీర్ కి ఆటంకం తీసుకొస్తుంది.

ప్రేమ వల్ల సక్సెస్

ఒకవేళ మీ చేతిలో ఫేట్ లైన్ గురు పర్వతం అంటే.. చూపుడు వేలు కింద భాగం వరకు హార్ట్ లైన్ తో కలిసి వెళ్లిందంటే.. ప్రేమ సహాయంతో సక్సెస్ పొందుతారు.

పొరపాట్లు

ఒకవేళ ఫేట్ లైన్ హెడ్ లైన్ దగ్గరే ఆగిపోయి ఉందంటే.. మీ తప్పులు, పొరపాట్ల వల్ల.. మీరు సక్సెస్ పొందలేకపోతారు.

English summary

What Your Fate Line Predicts About Your Career & Success

What Your Fate Line Predicts About Your Career & Success. To know more details read your palms.
Please Wait while comments are loading...
Subscribe Newsletter