For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నిద్రపోయే భంగిమ మీ ప్రవర్తనను డిసైడ్ చేస్తుందా ?

By Swathi
|

మనమంతా నిద్రపోయేటప్పుడు రకరకాల యాంగిల్స్ లో పడుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కో భంగిమలో గుడ్ నైట్ స్లీప్ పొందుతారు. ఒకరికి ఒకవిధంగా పడుకునే అలవాటు ఉంటే.. మరొకరికి మరో విధంగా పడుకునే అలవాటు ఉంటుంది.

రాత్రిపూట మనం నిద్రపోవడం వల్ల సౌకర్యవంతంగా, శరీరానికి రిలాక్స్ గా ఉంటుంది. అయితే నిద్రపట్టడానికి శరీరం ఎలా సౌకర్యంగా ఫీల్ అయితే ఆ పద్ధతిలో పడుకోవడం అలవాటుగా ఉంటుంది.

మీరు నిద్రపోయే భంగిమ మీ ప్రవర్తనను డిసైడ్ చేస్తుందా

అయితే ఈ పడుకునే భంగిమ మీ క్యారెక్టర్, మీ మానసిక పరిస్థితి గురించి వివరిస్తుందని ఎప్పుడైనా ఊహించారా ? నిజమే.. నిద్రపోయే విధానం మీ హెల్త్ ని కూడా డిసైడ్ చేస్తుందని చాలా అధ్యయనాలు ప్రూవ్ చేశాయి. అంతేకాదు డాక్టర్స్ ఎడమవైపు తిరిగి నిద్రపోవాలని కూడా సూచిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్ మీ క్యారెక్టర్ ని రివీల్ చేస్తుంది. మీ ప్రవర్తన, మీ వ్యక్తిత్వం, ఎంత గౌరవనీయులు మీరు, మీ స్నేహితులకు ఎంత నమ్మసక్యంగా ఉంటారు అన్న రకరకాల విషయాలను స్లీపింగ్ పొజిషన్ వివరిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

బోర్లా పడుకుంటే

బోర్లా పడుకుంటే

బోర్లా పడుకునే అలవాటు ఉన్న వాళ్లు చాలా అందంగా, ప్రేమగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్లకు తెలియకుండా.. ఇతరులను హర్ట్ చేస్తుంటారు. అలాగే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు వీళ్లు.

MOST READ:మిమ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచే శివుడి జ‌న్మ ర‌హ‌స్యం MOST READ:మిమ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచే శివుడి జ‌న్మ ర‌హ‌స్యం

దిండు పట్టుకుని పడుకుంటే

దిండు పట్టుకుని పడుకుంటే

చాలామందికి దిండుగానీ, టెడ్డీ గానీ హగ్ చేసుకునే అలవాటు ఉంటుంది. వీళ్లకు ఇతరులపై లవ్ అండ్ కేర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తమ స్నేహితులకు నమ్మసక్యమైనవాళ్లు.

వెల్లకిలా పడుకుంటే

వెల్లకిలా పడుకుంటే

వెల్లకిలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లు వాళ్లకు ఎవరైతే సౌకర్యవంతంగా ఉన్నారనిపిస్తారో వాళ్లతో మాత్రమే మాట్లాడుతారు. అందరితో మాట్లాడటానికి ఇష్టపడరు. అలాగే వీళ్లకు నమ్మకం ఎక్కువ. ఆధిపత్య ధోరణి అవలంభిస్తారు.

ఒకవైపు తిరిగి పడుకుంటే

ఒకవైపు తిరిగి పడుకుంటే

ఎవరైతే ఒకవైపు తిరిగి పడుకుంటారో వాళ్లు ప్రశాంతతను కోరుకుంటారు. వీళ్లు చాలా సెన్సిటివ్. అలాగే ఎమోషనల్. అయితే ఇతరులను నమ్మడంలో ఇబ్బంది పడతారు.

MOST READ:సముద్రంలో రాక్షసుడిలా విజృంభించే హరికేన్స్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్MOST READ:సముద్రంలో రాక్షసుడిలా విజృంభించే హరికేన్స్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్

పక్కకు తిరిగి పడుకుంటే

పక్కకు తిరిగి పడుకుంటే

చాలామంది పక్కకు తిరిగి, కాళ్లు పైకి ముదురుకుని పడుకుంటారు. ఈ పద్ధతిలో పడుకునే వాళ్లకు భయం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతూ ఉంటారు. భవిష్యత్ గురించి ఆందోళన పడుతూ ఉంటారు.

చదువుతూ నిద్రపోతే

చదువుతూ నిద్రపోతే

కొంతమందికి బుక్స్ చదువుతూ.. నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్లు వాళ్ల జీవితంలో ప్రశాంతత వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ల జీవితంలో ఉన్న అన్ని సమస్యలను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇతరుల విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు.

గురక పెట్టేవాళ్లు

గురక పెట్టేవాళ్లు

నిద్రలో గురక పెట్టేవాళ్లు.. వాళ్ల మెదడుపై ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తారు. అలాగే పని కల్పిస్తారు. ఫేమస్ అవకుండానే.. మంచి చేసే గుణం ఉంటుంది. అలాగే చాలా మేధోసంపత్తి కలిగి ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు.

English summary

What Your Sleeping Position Tells About You

What Your Sleeping Position Tells About You. We all sleep in different positions each night and find it very difficult to sleep when we sleep in a position other than our usual one.
Desktop Bottom Promotion