మీ పాస్ట్ లైఫ్ (గత జన్మ) సీక్రెట్ తెలుసుకోవడం ఎలా ?

మన పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఈ జన్మలో మనం ఎలా ఉన్నా.. గత జన్మలో రాజకీయ నాయకుడా, పారిశ్రామిక వేత్తనా, వ్యాపార వేత్తనా అనేది తెలిస్తే చాలా బావుంటుందని అనుకుంటారు.

Posted By:
Subscribe to Boldsky

మనుషుల జీవితం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ అలా.. జన్మజన్మల జీవితాన్ని అనుభవిస్తారు. అయితే మనిషి పుట్టుక ఏడు జన్మలని, మిగిలవన్నీ జంతువులు, సహచరాల రూపంలో ఉంటాయని నమ్ముతారు.

past life secret

అయితే మన పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఈ జన్మలో మనం ఎలా ఉన్నా.. గత జన్మలో రాజకీయ నాయకుడా, పారిశ్రామిక వేత్తనా, వ్యాపార వేత్తనా అనేది తెలిస్తే చాలా బావుంటుందని అనుకుంటారు. అయితే ఇలా కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని న్యూమరాలజీ చెబుతోంది.

ప్రస్తుత లైఫ్ ని బట్టి.. పాస్ట్ లైఫ్ తెలుసుకోవచ్చని, కొంత సమాచారాన్ని వివరిస్తుందని గ్రీక్ ఫిలాసఫర్ చెబుతున్నారు. ప్రతి నెంబర్ లోనూ ఎనర్జీ ఉంటుందని ఈయన వివరిస్తున్నారు. మరి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవడం ఎలాగో చూడండి..

స్టెప్ 1

ముందుగా పాత్ నెంబర్ తెలుసుకోవాలి. అందుకు బర్త్ డేట్ ని ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు 12 జూన్ 1960 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే.. (1+2)+(6)+(1+9+6+0) = 25. దీన్ని సింగిల్ డిజిట్ లోకి మార్చాలి. 25 = 2 +5 = 7.

స్టెప్ 2

ఇన్నర్ నీడ్ నెంబర్ ని తెలుసుకోవాలి. మీ పేరులోని ఓవెల్స్ ని కూడాలి. అంటే ఓవెల్స్ అయిన A=1 అని E=5 అని I=9 అని O=6 అని U=3గా గుర్తించాలి. ఉదాహరణకు మీరు పేరు ప్రియా శర్మ (Priya Sharma) అయితే.. 9+1+1+1= 12=1+2=3.

స్టెప్ 3

ఇప్పుడు పాత్ నెంబర్, ఇన్నర్ నీడ్ నెంబర్ ని కూడాలి. అంటే 7+3= 10. దీన్ని సింగిల్ డిజిట్ గా మార్చాలి. 10 = 1+ 0= 1. అంటే మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 అన్నమాట. ఇలా మీకు వచ్చిన నెంబర్ ని బట్టి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవచ్చు.

నెంబర్ 1

ఒకవేళ మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 వచ్చిందంటే.. మీరు గత జన్మలో రాజు లేదా రాణి అయ్యి ఉంటారు. మీరు గౌరవించబడి ఉంటారు. లేదా పోలీస్, పొలిటీషియన్ కూడా అయ్యి ఉండవచ్చు.

ప్రస్తుత లైఫ్

ఒకవేళ మీరు ప్రస్తుత జీవితంలో త్యాగం, ఒంటరితనంతో బాధపడుతున్నారంటే.. మీరు అనాథగా ఉండాల్సి రావచ్చు.

నెంబర్ 2

మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 2 వచ్చిందంటే.. మీరు ప్రేమ, ఎమోషన్స్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ లైఫ్ లో ఏదైనా లేదా ఎవరినైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.

గత జన్మ

చాలావరకు మీ గత జన్మ చాలా కష్టమైన నిర్ణయాలతో నిండి ఉంటుంది. గత జన్మలోని సోల్ మేట్ ని ప్రస్తుత లైఫ్ టైంలో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నెంబర్ 3

గత జన్మలో మీరు ఆర్టిస్ట్ లేదా వ్రైటర్. మీరు పూర్వ జన్మను బాగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఉంటారు. కుటుంబాన్ని, లైఫ్ ని చాలా అందంగా మలుకుని ఉంటారు. అలాగే ఈ నెంబర్ వ్యక్తులు గత జన్మలో గార్డెనర్స్, బేకర్స్, వంటవాళ్లు అయ్యి ఉండవచ్చు.

నెంబర్ 4

మీది చాలా ఆసక్తికరమైన జీవితం. కానీ అన్ని సందర్భాల్లో పాజిటివ్ గా ఉండకపోవచ్చు. ఈ నెంబర్ కి సంబంధించిన వ్యక్తులు చాలా వరకు ఆర్మీలో లేదా బానిసలుగా ఉంటారు. మరికొందరు జైల్ కీపర్స్ కూడా అయి ఉండవచ్చు.

నెంబర్ 5

నెంబర్ 5 కలిగినవాళ్లు వార్ జోన్ లో ఉండి ఉండవచ్చు. విప్లవాలు మీ జీవితంలో కీలకభాగం అయి ఉంటాయి. ప్రస్తుత జీవితంలో కూడా విరామం లేనట్టు కొన్నిసార్లు ఫీలవుతారు.

నెంబర్ 6

నెంబర్ 6ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా కలిగిన వాళ్లు.. గత జన్మలో ఆధ్మాత్మిక వేత్త, ధ్యానం, శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉంటారు. అలాగే యాక్టర్ లేదా వ్యాపారవేత్త అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుత జీవితం

ఒకవేళ మీరు ప్రస్తుత జీవితంలో సంతోషం లేకుండా ఉంటే.. ధారాళమైన ప్రేమ, క్షమాగుణంను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

నెంబర్ 8

నెంబర్ 8ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందినవాళ్లు.. మెడిసిన్ కి సంబంధించిన జీవితం గడిపి ఉంటారు. అలాగే సంపన్నమైన వ్యాపారి లేదా భూమి యజమాని అయి ఉండవచ్చు. మీ జీవితంలో డబ్బు కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రస్తుత లైఫ్

అలాగే ప్రస్తుత జీవితంలో కూడా డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఎమోషనల్ గా కంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. డబ్బు కోసం ఎంత సాహసమైనా చేస్తారు. దేన్నైనా వదులుకుంటారు.

నెంబర్ 7

ఏడు అనేది ఆధ్మాత్మిక సంఖ్య. మీరు సామాన్యులకు చేసే సేవ, మీకున్న తెలివితేటల కారణంగా.. మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. లీడర్ గా భావిస్తారు. మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదని భావిస్తారు.

నెంబర్ 9

నెంబర్ 9ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందినవాళ్లు గత జీవితంలో జ్యోతిష్యుడు, జర్నలిస్ట్ అయి ఉండవచ్చు. సన్యాసి, మూగ, మాటలు రాని వాళ్లు కూడా అయి ఉండవచ్చు. అలాగే కొంతమంది హాస్పిటల్ లో పనిచేసి ఉండవచ్చు. ఇతరులకు సహాయపడి ఉండవచ్చు.

English summary

Who Were You in Your Past Life? Check Out your Previous Birth

Who Were You in Your Past Life? Check Out your Previous Birth. Today, we reveal the steps that anyone can follow to discover who they were in their past life.
Please Wait while comments are loading...
Subscribe Newsletter