ఈ రాశి వారికి ధైర్యసాహసాలు ఎక్కువ...స్వేచ్చా ప్రియులు కూడా..

Posted By:
Subscribe to Boldsky

రాశిచక్రంలో వృశ్చికం ఎనిమిదో రాశి. ఇది సరి రాశి. జలతత్వం, శీతల స్వభావం. బ్రాహ్మణ జాతి, క్రూర రాశి. రంగు ఎరుపు. శరీరంలో రహస్యాంగాలను, హృదయాన్ని, తొడలను సూచిస్తుంది. ఇది స్థిర రాశి, స్త్రీ రాశి. దిశ ఉత్తరం. ఇందులో విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి కుజుడు. ఇనుము, చెరకు, పంచదార, బెల్లం, కందులు, దూది, వక్కలు, ఆవాలు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి నార్వే, మొరాకో, వాషింగ్టన్ పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది.

ఈ రాశి రాశ్యధిపతి కుజుడు. ఈ రాశి సమ రాశి, శుభరాశి, స్త్రీరాశి, సరి రాశి, స్త్రీరాశి, స్థిర స్వభావరాశి, జలరాశి, కీటకరాశిగాను వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం, సమయం పగటి సమయం, శబ్దం నిశ్శబ్దం, పరిమాణం దీర్ఘం, జాతి బ్రాహ్మణ, జీవులు కీటకములు, దిక్కు ఉత్తర దిక్కు, పాద జలతత్వం, సంతానం అధికం, ప్రకృతి కఫం, కాలపురుషుని శరీరాంగం మర్మ స్థానం, వర్ణం బంగారు వర్ణం. ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు. వీరి గురించి మరికొన్ని రహస్యాలు తెలుసుకుందాం...

ధైర్యసాహసాలు ఎక్కువగ

వృశ్చికరాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. పర్యవసానాలను పట్టించుకోని దూకుడు వీరి సహజ లక్షణం.

మొండితనం కూడా వీరికి ఎక్కువే!

మొండితనం కూడా వీరికి ఎక్కువే! విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు.

రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ.

ప్రథమకోపంతో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ. అతీంద్రియ శక్తులు, మార్మిక విషయాలపై అమితాసక్తి చూపుతారు.

వృశ్చికరాశి వారు రహస్య స్వభావులు.

వృశ్చికరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు.

సంప్రదాయాలను గౌరవిస్తారు.

సంప్రదాయాలను గౌరవిస్తారు. చురుకైన తెలివితేటలు వీరి సొంతం. ఆసక్తి కలిగితే ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలరు.

ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం.

ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం. దార్శనికత, వ్యూహరచనా చాతుర్యం వీరి తిరుగులేని బలాలు. గ్రహగతులు అనుకూలిస్తే ఈ లక్షణాలతోనే వీరు ఉన్నత స్థానాలను అందుకోగలరు.

స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ.

స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ. అందువల్ల స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణించగలరు. స్వతంత్ర అధికారాలు గల ఉద్యోగాల్లో సత్తా చూపగలరు. వ్యాపారాల్లోనైనా, వృత్తి ఉద్యోగాల్లోనైనా వీరు పోటీని ఇష్టపడతారు.

గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని

గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని, సత్తా చాటుకుంటారు. గ్రహగతులు ప్రతికూలిస్తే, వీరు ఇతరులపై అకారణంగా అనుమానం, ఈర్ష్య పెంచుకుని, వారికి హాని తలపెట్టేందుకైనా వెనుకాడరు.

విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు

విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు. అనుకున్నది సాధించడానికి అపమార్గాలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. ఫలితంగా మానసిక వ్యాధులకు, నాడీ సమస్యలకు, గుండెజబ్బులకు లోనవుతారు.

వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము.

వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు.

సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు.

సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము.

వైవాహిక జీవితానికి ముందుగా

వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చుపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు.

అనుకున్నది తప్పక సాధిస్తారు

బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచి పోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు.

కొన్ని సందర్భాల్లో ఎదురుచూసిన సహాయము అందదు.

ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు.

వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని

వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.

English summary

Why Are Scorpios So Successful and Freedom Lovers?

You might have noticed that so many celebrities and famous people belong to the Scorpio sun sign. It is not merely a matter of chance. It is a fact that Scorpios tend to be more successful than people belonging to other sun signs. So why are Scorpios so successful? Is is just lady luck that favours them? Or do their intrinsic attributes predispose them to reach the zenith of success.
Please Wait while comments are loading...
Subscribe Newsletter