For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పబ్లిక్ ప్లేస్ లో ఖచ్చితంగా చేయకూడని కొన్ని అసాధరణ పనులు ..!!

By Lekhaka
|

బాధ్యత గల పౌరులుగా పబ్లిక్ ప్లేసెస్ లో ప్రతి ఒక్కరూ హుందాగా ప్రవర్తించాలి. అందులో భాగంగా కొన్ని అలవాట్లను పబ్లిక్ ప్లేసెస్ లో దూరంగా ఉంచాలి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, కొన్ని అలవాట్లను పబ్లిక్ ప్లేసెస్ లో దూరంగా ఉంచాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాలు మేమిక్కడ పొందుపరచాము. కాబట్టి, ఆ అలవాట్లను గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

1. టెక్స్టింగ్ చేస్తూ డ్రైవ్ చేయడం/మాట్లాడడం/నడవడం

1. టెక్స్టింగ్ చేస్తూ డ్రైవ్ చేయడం/మాట్లాడడం/నడవడం

టెక్స్టింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు చేస్తే ఏం జరగవచ్చో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరితోనైనా మాట్లాడుతూ ఫోన్ లో టెక్స్టింగ్ చేయడాన్ని అమర్యాదగా పరిగణిస్తారు. మరింత భయంకర విషయం ఏమిటంటే, చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా టెక్స్టింగ్ లో లీనమైపోతూ నడవడమో లేదా డ్రైవింగ్ చేయడమో చేస్తే ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇటువంటి సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి కూడా. సమయపాలనను పాటించకపోవడం వల్ల అన్ని పనులనూ ఒకే సారి చేయాలన్నఆతృతతో డ్రైవ్ చేస్తూ లేదా బిజీ రోడ్డు మీద నడుస్తూ టెక్స్టింగ్ చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ అలవాటు గనక మీకు ఉన్నట్టయితే, వెంటనే అందులోంచి బయటపడనుంది. ఎదో ఒక్క పని మీద దృష్టిని కేంద్రీకరించండి.

2. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో గట్టిగా మాట్లాడడం

2. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో గట్టిగా మాట్లాడడం

మీతో ప్రయాణిస్తున్న వారిపై కాస్తంత దయ చూపండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అనే ఆతృత మీతో కాసేపు ప్రయాణం చేసే వారికి ఉండదు. ఎవరి బాధలు వారివి. శాడిస్ట్ బాసులతో ఇబ్బందులు పడే వారు కొందరైతే, అత్తగారి వేధింపులకు గురయ్యేవారు ఇంకొందరు, మరికొందరు తమ భాగస్వామితో గొడవపడిన కేటగిరీలోకి రావచ్చు. నిజానికి, మీరు గట్టిగా మాట్లాడి వారందరికీ తలనొప్పిని కలిగించడానికి కారకులవుతారు. ఈ అలవాటు గనక మీకున్నట్టయితే వెంటనే మార్చుకోవాలి.

3. అవసరమైనదానికంటే ఎక్కువ స్థలం వాడుకోవడం

3. అవసరమైనదానికంటే ఎక్కువ స్థలం వాడుకోవడం

పబ్లిక్ ప్లేసెస్ లో కూర్చున్నప్పుడు కూడా చాలా మంది ఆ స్పేస్ అంతా తమదే అన్నట్టు మొత్తం ఆక్రమించుకుంటారు. తమకి చెందిన వస్తువులన్నీ చుట్టూ పరుస్తారు. మిగతా వారు 'కాస్త జరుగుతారా' అన్నట్టు చూసినా పట్టించుకోరు. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా చేయడం అమర్యాదగా ఉంటుంది. మీకు ఎంత అవసరమో అంత మేరకే మీరు కట్టుబడి ఉండాలి. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

4. శబ్దం చేస్తూ తినడం

4. శబ్దం చేస్తూ తినడం

తినేటప్పుడు శబ్దం చేయకుండా చాలా హుందాగా ఉండాలి. తినేటప్పుడు శబ్దం చేస్తూ తినేటట్టయితే చుట్టూ ఉన్నవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా చేస్తే మీతో బయటికి రావడానికి మీకు ప్రియమైన వారు కూడా మక్కువ చూపకపోవచ్చు. ఈ హేబిట్ తో మీరు గనక డేట్ కి వెళ్లినట్టయితే రిజల్ట్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో!

5. మాటలు పొందికగా వాడండి

5. మాటలు పొందికగా వాడండి

చాలా మటుకు మన సంభాషణలలో అనవసరమైన పదాలెన్నో దొర్లుతాయి. 'నీకు తెలుసా', 'అసలేమైందంటే' వంటి పదాలు ఎక్కువసార్లు వాడే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ అలవాటు నుంచి బయటకు రావాలి. ఈ అలవాట్లనుండి తప్పించుకునేందుకు అసలు సిసలైన మార్గం మీ పదకోశాన్ని అంటే వొకాబులరీని మెరుగుపరుచుకోవడమే. అప్పుడు, మీరు ఇటువంటి ఫిల్లెర్స్ ను వాడడానికి ఆసక్తి కనబరచరు. కాన్ఫిడెంట్ గా కాన్వర్సేషన్ ను ముందుకు తీసుకెళతారు.

6. మాట్లాడే శైలిని మెరుగుపరుచుకోండి

6. మాట్లాడే శైలిని మెరుగుపరుచుకోండి

మీ భాషలో స్లాంగ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే మార్చుకోండి. లేదంటే, మీ గురించి తప్పుడు అభిప్రాయం ఇతరులలో కలిగే అవకాశం కలదు. మీరు పెరిగిన విధానం గురించి ఇతరులు తక్కువగా అంచనా వేయవచ్చు. మీకు ప్రియమైన వారు కూడా మీకు దూరం అయ్యే ప్రమాదాలుంటాయి. కాబట్టి, మీరు మీ భాషా శైలిని మార్చుకోండి. మీ మాటలతో మనుషులను దూరం చేసుకోకుండా మీ మాటలను మాగ్నెట్ గా మార్చి ఇతరులను ఏమార్చండి.

7. గోర్లు కత్తిరించడం

7. గోర్లు కత్తిరించడం

ఈ అలవాటు గనక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ అలవాటు నుంచి బయటపడనుంది. పబ్లిక్ ప్లేసెస్ లో గోర్లు కత్తిరించడం అనాగరికం.

8. మెటికలు విరవడం

8. మెటికలు విరవడం

మీరు పబ్లిక్ ప్లేసెస్ లో మెటికలు విరుస్తారా? ఈ అలవాటు మీ హుందాతనాన్ని పక్కన పెట్టేస్తుంది. కాబట్టి, వెంటనే ఈ అలవాటు నుండి బయటపడండి. లేదంటే, మీరెంత చదువుకున్నవారైనా, మీరెంత గొప్పవారైనా, ఈ అలవాటు మిమ్మల్ని అనాగరికులుగా పదిమంది ముందు నిల్చోపెడుతుంది.

9. చూయింగ్ గమ్ తో ఆటలాడడం

9. చూయింగ్ గమ్ తో ఆటలాడడం

చూయింగ్ గమ్ తో చాలా మంది బెలూన్ చేయడాన్ని ఇష్టపడతారు. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా చేయడాన్ని అమర్యాదగా పరిగణిస్తారు. కాబట్టి, చూయింగ్ గమ్ నే ఏకంగా ఎవాయిడ్ చేయండి. మీరు ఆ విధంగానైనా ఈ అలవాటు నుంచి బయటపడతారు.

10. గోళ్లు కొరకడం

10. గోళ్లు కొరకడం

గోళ్లు కొరకడమనేది ఒక అనాగరిక అలవాటు. అంతే కాకుండా, మీ ఆరోగ్యానికి కూడా ఈ అలవాటు వల్ల ముప్పుంది. గోళ్ళ నుండి హానికర బాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి అనేక రోగాలను వ్యాప్తి చేస్తుంది. ఈ అలవాటు వల్ల దీర్ఘకాలంలో మీరు అత్యంత ప్రమాదకర ఆరోగ్యసమస్యలు బారిన పడ్డా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

English summary

10 Annoying Habits You Should Avoid Doing in Public

Take a good look into the following points and you’d be embarrassed to see how many of these annoying habits you perform on daily basis. You may also like to read ‘10 Most Bizarre Things‘ we do all the time, in our daily life.
Desktop Bottom Promotion