For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీరు తప్పడు మార్గంలో వెళుతున్నారని సూచించే 14 వార్నింగ్ సంకేతాలు

కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ జరుతున్నాయంటే మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదని పంచభూతాలతో నిండి ఉన్న విశ్వం సూచిస్తుంది. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..!!

|

మంచో... చెడో... మనకి జరగాలని రాసి పెట్టుంటే అది జరగక మానదు. కొందరైతే.. అసలు మంచి, చెడు అనే తేడాలు ఉండవు.. మన జీవితంలో జరిగేది ఏదైనా జరగాలని రాసి పెట్టుంది కాబట్టే జరుగుతుంది... అని అంటారు. ఏది ఏమైనా.. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ జరుతున్నాయంటే మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదని పంచభూతాలతో నిండి ఉన్న విశ్వం సూచిస్తుంది. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..!!

1. ఆత్రుత:

1. ఆత్రుత:

జనాల మధ్య నడుస్తున్నప్పుడు పక్కవారిని గుద్దుకోవడం, ఎదురుగా వచ్చే వ్యక్తి చేతులు తాకడం లేదా మీ కాళ్ళ వెళ్ళు దేనికైనా గట్టిగా తగలటం... ఇలా తరచుగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతుంటే మీరు వెంటనే మీ వేగాన్ని తగ్గించుకోవాలి. మీరు చేసే పనిని కాస్త నెమ్మదిగా చేయడం ప్రారంభించాలని ఈ విశ్వం సూచిస్తుంది.

2 మతిమరుపు :

2 మతిమరుపు :

ఏదో ఒక ముఖ్యమైన పని మీకు అప్పగించినప్పుడు... మీరు దాని గురించి తరచుగా మర్చిపోతుంటే ఒక్కసారి ఆగి అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు చేయాల్సిన పనికి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయో ఒక్కసారి చూసుకోవాలి. ఎక్కువగా మర్చిపోతున్నారంటే.. మీ జీవితం గురించి ఆలోచించమని విశ్వం మీతో చెబుతుంది.

3. చేజారిపోవడం:

3. చేజారిపోవడం:

సాధారణ వస్తువులు చేజారిపోతున్నా.. లేదా మీ వల్ల అవి తరచుగా విరిగిపోతున్నా.... మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదని విశ్వం మీతో చెబుతుంది. అన్నిటిని కంట్రోల్ చేద్దాం అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్లే. ఈ విశ్వంలో జరుగుతున్న మార్పులతో పాటు మీరు కూడా మసులుకోవాలి.

4. సమయపాలన:

4. సమయపాలన:

అలారం వినిపించలేదని... ట్రాఫిక్ ఎక్కువగా ఉందని లేదా ఇంకేదైనా కారణాల వల్ల మీరు తరచుగా ఆలస్యం చేస్తుంటే మీరు మీ జీవితాన్ని చాలా దగ్గరగా పరీక్షించాలి. సమయంతో పోటి పడేవారు సరైన మార్గంలో వెళ్ళట్లేదని విశ్వం సూచిస్తుంది.

5. పరిశుభ్రత:

5. పరిశుభ్రత:

మీరు ఎంత శుభ్రంగా ఉందామని ప్రయత్నించినా లేదా మీ పరిసరాలు ఎంత శుభ్రంగా మార్చుకున్నా తరచుగా ఏదో ఒకటి చిందరవందరగా అనిపిస్తే ఒక్కసారి మిమ్మల్ని మీరు సరి చేసుకునే అవసరం ఉందని విశ్వం సూచిస్తుంది.

6. తరచూ జబ్బుపడటం:

6. తరచూ జబ్బుపడటం:

మాటిమాటికి దగ్గు, జలుబు లాంటివి విసిగిస్తున్నా లేదా తరచుగా జ్వరం వస్తున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఏదైనా పెద్ద సమస్య మిమ్మల్ని వెంటాడుతుందని విశ్వం హెచ్చరిస్తుంది. ఒకవేళ ఎలాంటి ప్రమాదం లేదని తెలిసినా... మీ గురించి కొంత సమయాన్ని కేటాయించి ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించండి.

7. ఆఫీస్ పాలిటిక్స్ :

7. ఆఫీస్ పాలిటిక్స్ :

ప్రతి ఒక్కరిని విసిగించే విషయాలు కొన్ని ఉంటాయి. ఆఫీస్ లో రాజకీయాలు, ఇంట్లో కొట్లాటలు, స్నేహితులతో విభేదాలు.... ఇలా దేని నుంచైనా మీరు తరచుగా తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారంటే.. మీరు సరైన మార్గంలో వెళ్ళట్లేదని.... ఇలాంటి సందర్భాలలో ఆగి ఎదుర్కోవాలని విశ్వం సూచిస్తుంది.

8 చేసే పనిలో ఆసక్తి లేకపోతే:

8 చేసే పనిలో ఆసక్తి లేకపోతే:

మీరు ఇష్టపడి ఎంచుకున్నదే అయినా... చేసే పనిలో ఆసక్తి లేకపోవడం.... లేదా ఆ పని చేస్తున్నప్పుడు విసుగ్గా అనిపిస్తున్నా మీరు మరోసారి అన్నిటిని సరిచూసుకోవాలని విశ్వం సూచిస్తుంది.

9. నిలకడ లేకపోవడం:

9. నిలకడ లేకపోవడం:

మీకు కేటాయించిన సమయంలో పనిని పూర్తి చేయలేకపోతున్నా లేదా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నా మిమ్మల్ని మీరు మరోసారి సరిచేసుకోవాలి. మీరు చేస్తున్న పనిలో ఏదో నిలకడగా లేదని విశ్వం సూచిస్తుంది. అది సరి చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

10 పని మొదలు పెట్టిన తర్వాత ఆటంకాలు :

10 పని మొదలు పెట్టిన తర్వాత ఆటంకాలు :

ఏదైనా పనికి బయలుదేరేముందు మీకు చిన్న చిన్న దుశ్శకునాలు ఎదురైతే ఆ పనిలో ఏదో లోపం ఉందని మీకు విశ్వం సూచిస్తుంది. లేదా ఆ పని మొదలు పెట్టిన తర్వాత ఆటంకాలు ఎదురవుతాయని సూచిస్తుంది. ఒకసారి అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోమని ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తుంది.

11. జీవితంలో అన్ని సులభంగా జరిగిపోవాలని కోరుకోవడం:

11. జీవితంలో అన్ని సులభంగా జరిగిపోవాలని కోరుకోవడం:

జీవితం పూల పానుపు కాదు, అన్ని సులభంగా జరిగిపోవడానికి. ఎవరైతే జీవితంలో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి తప్పకుండా విజయం సొంతమవుతుంది. వ్యక్తిగత టాలెంట్ విజయానికి సోఫానం మాత్రమే కాదు, ఇతరులను చాలా త్వరగా ఆకట్టుకుంటారు.

12. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నడం:

12. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నడం:

నువ్వు అవకాశాన్ని వెతుకుతున్నప్పుడు రాకపోగా, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలదన్నడం జితంలో చేసే అతి పెద్ద పొరపాటు. ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా పాజిటివ్ గా ఆలోచించాలి. నెగటివ్ గా ఆలోచించకూడదు . అందని దానికి ఆశపడటం కంటే ఉన్న దాంట్లో సంత్రుప్తి పడటం మంచిది.

13. కావల్సిన వారిని మర్చిపోవడం:

13. కావల్సిన వారిని మర్చిపోవడం:

ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా నిన్ను నమ్ముకున్న వారిని పట్టించుకోకుండా ఉండకూడదు. ఎంత బిజీ లైఫ్ అయినా ప్రతి ఒక్కరితోనూ కనెక్ట్ అయ్యుండటం మంచిది. సంతోకరమైన జీవితం ఎప్పుడూ బెటర్ రిలేషన్ షిప్ కు దారితీస్తుంది. ఎంత బిజీ అయినా..అకేషనల్ గా అయినా కలుసుకోవడం, నవ్వుకోవడం చేయాలి.

14. ఆలోచనల్లో నిలకడ లేకపోవడం:

14. ఆలోచనల్లో నిలకడ లేకపోవడం:

నీకోసం సమయం వెచ్చించే వారికి, నీవువారికోసం సమయం పాటించకపోవడం: చెడు జరిగినప్పుడు తప్పుగా అలోచించడం, వాటి గురించి భయపడటం.

English summary

14 Warning Signs You’re On the Wrong Track

If you feel like you’re on the wrong track with what matters most to you, here are nine warning signs to look for, and tips to get you back on track:
Desktop Bottom Promotion