For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణుక్య ప్రకారం : మీరు సక్సెస్ సాధించాలంటే ఈ విషయాల్లో సిగ్గు పడకూడదు!!

జీవితంలో విజయం సాధించడం అంత సులభమైన పని కాదు, అందుకు సాధన, ఏకాగ్రత అవసరం. ఈ మూడు లేనప్పుడు ఏ వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్ సాధించలేడు.

|

జీవితంలో విజయం సాధించడం అంత సులభమైన పని కాదు, అందుకు సాధన, ఏకాగ్రత అవసరం. ఈ మూడు లేనప్పుడు ఏ వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్ సాధించలేడు. ఒక వ్యక్తి మొదట ఏ పని చేయాలన్నా తనను తాను మూడు విషయాల్లో సమాధానం చెప్పుకోగలిగితే తప్పకుండా విజం సాధిస్తారు. అందులో ఈ పని ఎందుకు చేస్తున్నాము. దీని వల్ల ప్రయోజనం ఏంటి ? ఈ పనిచేయడం వల్ల సక్సెస్ సాధిస్తామా..?

జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ సాధిస్తే .. కొందరు మాత్రం ఫెయిల్యూర్ అవుతుంటారు. అలా జరగకుండా ప్రయత్నించిన ప్రతి ఒకరు సక్సెస్ పొందాలంటే కొన్ని విషయాల్లో సిగ్గు పడకూడదు.

అలా సక్సెస్ పొందాలంటే కొన్ని విషయాల్లో ఎలాంటి సిగ్గు లేకుండా వ్యవహరించాలని సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన.. చాణక్యుడు చెబుతున్నాడు.

ఇప్పట్లో గొప్పవారిగా ఉన్నవారంతా ఒకప్పుడు ఈ విషయాల్లో సిగ్గు లేకుండా ఉన్నవారే..! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

భూత, భవిష్యత్ కాలం గురించి బాధపడాల్సిన అవసరం లేదు :

భూత, భవిష్యత్ కాలం గురించి బాధపడాల్సిన అవసరం లేదు :

మీరు ఎక్కడనుంచి వాచ్చారనే దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి పట్టించుకోకూడదు. తెలివైన వారు వర్తమానంలో జరుగుతున్న విషయాలతోటే వ్యవహరిస్తారు.

 సాయం కోరి వచ్చిన వ్యక్తులను కించపరచకూడదు :

సాయం కోరి వచ్చిన వ్యక్తులను కించపరచకూడదు :

ఎవరిదైనా సాయం కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నచ్చినట్టే ప్రవర్తించాలి, మసులుకోవాలి. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదు...

ఆర్థిక విషయాల్లో :

ఆర్థిక విషయాల్లో :

మీ అప్పు ఉన్నవారి నుంచి డబ్బులు తిరిగి అడిగే విషయంలో మొహమాటం పనికిరాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది.. లేదా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో మీకు పూర్తిగా అర్ధమవుతుంది.

ఏవిషయం తెలుసుకోవాలనుకున్నా :

ఏవిషయం తెలుసుకోవాలనుకున్నా :

మీకు అర్ధం కానిదేదైన ఉంటె.. ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడకండి. ఇది విద్యార్థులకే కాదు... ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా విషయాలను అడిగి తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు, లేదా సిగ్గు పడుకూడదు. అప్పుడు విషయాలను పూర్తిగా తెలుసుకోగలుగుతారు.

ఆకలిగా ఉన్నప్పుడు తిండి విషయంలో సిగ్గు పడకూడదు:

ఆకలిగా ఉన్నప్పుడు తిండి విషయంలో సిగ్గు పడకూడదు:

ఆకలితో ఉన్నప్పుడు తిండి విషయంలో సిగ్గు పడకండి. నలుగురిలో ఉన్నప్పుడు తింటే ఏమైనా అనుకుంటారేమో అని తినకుండా ఉంటె తర్వాత కడుపులో గ్యాస్ నిండి, నీరసం వచ్చి... మీరే ఇబ్బందుల్లో పడతారు.

సిగ్గు పడితే పోటి పడలేం:

సిగ్గు పడితే పోటి పడలేం:

సిగ్గు పడితే జీవితంలో పోటి పడలేం. ఎందులోనూలో గెలవలేమన్న విషయం గుర్తుంచుకోవాలి.

కర్తవ్యం నిర్వర్థించలేరు:

కర్తవ్యం నిర్వర్థించలేరు:

ఉద్యోగస్తులు సిగ్గు పడితే ఉద్యోగం సరిగా చేయాలేరు. దాంతో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.

పూర్తి బాధ్యతలు నిర్వర్థించకుండా ఇతరులను మోసగించడం .

పూర్తి బాధ్యతలు నిర్వర్థించకుండా ఇతరులను మోసగించడం .

ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలను ఇతరు మీద రుద్దకపోవడం మంచిది. అది ఉద్యోగంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు. లేదా ఫ్యామిలీ విషయంలో కావచ్చు. ఎక్కడైనా సరే నిజాయితీగా కరెక్ట్ గా ఉన్నప్పుడు , సిగ్గు పడకుండా బాధ్యతలు నిర్వర్థించగలిగినప్పుడు జీవితంలో సక్సెస్ అనేది సులభం అవుతుంది.

English summary

If you want success, don't be shy: Chanakya

If you want success, don't be shy: Chanakya,Well, there is no perfect moment. What you’re actually doing is making excuses not to do the work immediately. The truth is very successful people got to where they wanted to because they understood this simple concept: You create your own success now, working on so
Desktop Bottom Promotion