For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : వెండితెరపై ‘అమ్మ’ ప్రేమ కురిపించిన నటీమణులకు జోహార్లు..!!

‘‘ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం..ఎవరు పాడగలరు అమ్మ అను పాట కన్న తియ్యని రాగం.."అన్నాడో సినీ కవి..నిజమే అమ్మ ప్రేమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకు తల్లి ప్రేమ, బిడ్డల కోసం

|

''ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం..ఎవరు పాడగలరు అమ్మ అను పాట కన్న తియ్యని రాగం.."అన్నాడో సినీ కవి..నిజమే అమ్మ ప్రేమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకు తల్లి ప్రేమ, బిడ్డల కోసం తల్లి చేసే త్యాగాల నేపథ్యంలో వెండితెరపై అద్భుత కనబడేట్లు చేస్తుంటారు ..

తెలుగు సినిమాల్లో అమ్మ కేరక్టర్లు అంటే ఇన్నేళ్లూ ఓ ట్రెండ్ లో ఉండిపోయారు. సెంటిమెంట్ - ఏడుపులు - అప్పుడప్పుడూ బాధ్యతలు.. ఇలాంటి మూస రోల్స్ నుంచి టాలీవుడ్ అమ్మలు బైటకి వచ్చేస్తున్నారు. కొత్త తరం దర్శకులు.. మదర్ కేరక్టర్ ని వైవిధ్యంగా చూపించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం.

అమ్మ లాలన గురించి అందంగా వర్ణించారు. అయితే, అమ్మగా ఆ పాత్రలో ఒదిగిపోయి వెండితెరపై చిరస్మరణీయంగా నిలిచిపోయేలా నటించారు కొందరు నటీమణులు. సినిమా చూసే సగటు తెలుగు ప్రేక్షకుడికి తన తల్లే గుర్తుకు వచ్చేంత సహజంగా ఆ పాత్రలో లీనమయ్యారు. అలాంటి కొంత మంది వెండితెర మాతృమూర్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నదియా:

నదియా:

వెండితెరపై మోడ్రన్ మదర్ గా చక్కగా ఒదిగిపోయింది నటి నదియా. తమిళ మలయాల భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ..‘మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన వూర్లో జరగుతున్న గొడవులు, ఫ్యాక్షనిజం వంటి వాటికి దూరంగా కొడుకును పెంచే తీరు, పంచే అప్యాయత వంటివన్నీ మనసుకు బాగా హత్తుకుంటాయి. ఆ తర్వాత ‘అ..ఆ' చిత్రంలో కూతురే తన సర్వస్వంగా భావించే అమ్మంగా అద్భుతమైన నటన కనబరిచింది నదియా..ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్' సినిమా ద్వారా మళ్లీ మన ముందుకు రాబోతోంది, అందాల అమ్మ.

జయసుధ:

జయసుధ:

మేటి నటి జయసుధ కూడా తల్లిపాత్రల్లో తనదైన ముద్రవేశారు. హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న జయసుధ తన సెకండ్ ఇన్సింగ్స్ ని తల్లి పాత్రలతో మొదలుపెట్టారు. ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి' , ‘బొమ్మరిల్లు' కొత్తబంగారు లోకం' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' ‘ఎవడు' ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో అమ్మ ప్రేమ కురిపించారు.

పవిత్ర లోకేశ్:

పవిత్ర లోకేశ్:

ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్‌ పవిత్ర లోకేశ్‌ కూడా టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆరిస్టుగా మారింది. ఆంటీ, మదర్ పాత్రల కోసం చాలామంది దర్శకనిర్మాతలు.. పవిత్ర లోకేశ్‌‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట, అంతకు ముందు చాలా క్యారెక్టర్‌ రోల్స్‌ చేసిన పవిత్ర లోకేశ్‌ గతేడాది వచ్చిన రేసుగుర్రం సినిమాతో మంచి పాపులారిటీ సాధించింది . ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు తల్లిగా నటించిన ఈ సీనియర్ నటి ఆ తరువాత వచ్చిన లక్ష్మీ రావే మా ఇంటికి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆకట్టుకుంది. (‘సన్నాఫ్ సత్యమూర్తి, ప్రస్థానం, రేసుగుర్రం'లో హీరోల తల్లి

రమ్యకృష్ణ:

రమ్యకృష్ణ:

ఓ దశలో టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్‌. హీరోయిన్‌గా విభిన్న పాత్రలు పోషించిన వారిలో రమ్యకృష్ణ పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ‘కంటే కూతుర్నే కను’, ‘ఆవిడే శ్యామల’, ‘నరసింహ’ లాంటి సినిమాలు రమ్యకృష్ణలోని నట ప్రతిభకు మచ్చుతునకలు. దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా అత్త పాత్రలు చేసినా, పెద్దగా గుర్తింపురాలేదు. రాజమౌళి ‘బాహుబలి’ మాత్రం రమ్యకృష్ణకు ఎనలేని పేరు తీసుకొచ్చింది.

 రోహిణి

రోహిణి

తెలుగులో రోహిణి హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే అని చెప్పుకోవాలి. నటిగా కన్నా కూడా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రోహిణి బాగా పాపులర్‌ అయింది. చాలా మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువు ఇచ్చే రోహిణి అమ్మ, అక్కా, ఆంటీ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మద్యకాలంలో బహుబలిలో ప్రభాస్ కు అమ్మగా మంచి మార్కులే కొట్టేసింది. ఇదే కాకుండా రోహిణిలో మరో యాంగిల్‌ కూడా ఉంది. అదే మేకప్‌ ఆర్టిస్ట్‌. డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణిదే.

సుహాసిని :

సుహాసిని :

సుహాసిని నాటి తరం నుంచి నేటి తరం వరకు ఎంతో మంది ప్రముఖ హీరోలతో నటించి పేరు పొందారు. పెదబాబు, గబ్బర్ సింగ్, లీడర్, వరుడు వంటి సినిమాల్లో తల్లి పాత్రలతో తనదైన ముద్రవేశారు.

రేవతి

రేవతి

వెండతెర మీదున్న టాలెంటెడ్‌ నటీమణులలో రేవతి పేరు చెప్పుకుని తీరవలసిందే! హీరోయిన్‌గా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి హీరోయిన్‌ అని పేరు తెచ్చుకుంది. రేవతి టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అమ్మ పాత్రలకు రేవతి మంచి ఛాయిస్‌ అని చెబుతారు.

తులసి

తులసి

సంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన తులసి ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘శంకరాభరణం'లో నటించింది. ఆ సినిమాతో తులసి పేరు మారుమ్రోగిపోయింది. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా మారి పలు సినిమాల్లో నటించినా అనుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. పెళ్లి చేసుకున్న తరువాత చాలా సంవత్సరాలకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది తులసి. అమ్మ, అక్క పాత్రలు చేస్తోంది.

శారద:

శారద:

అమ్మ రాజీనామా, యోగి పేర్లు చెప్పగానే తల్లిగా ఊర్వశి (శారద)కనబరిచిన నటనే గుర్తొకొస్తుంది. అమ్మ ఏం చేసినా పిల్లల మంచి కోసమే అనేది కాదనలేని నిజం . కానీ ఆ ఆపేక్షను, ఆప్యాయతను కొడుకులు పట్టించుకోకపోతే...నువ్వులేకపోతే మేం తకలమేా అని ప్రశ్నిస్తే..వీటన్నింకికీ తల్లడిల్లిన అమ్మగా అమ్మ రాజీనామా' సినిమాలో అద్భుతంగా నటించారు.

శరణ్య

శరణ్య

కోలీవుడ్‌లో ఫేమస్‌ అమ్మ శరణ్య. తెలుగులో తక్కువ సినిమాల్లో తల్లి పాత్రలు పోషించింది శరణ్య. శరణ్య ‘కొమరం పులి’, ‘మనం’ ‘ఇంద్రుడు’, ‘రఘువరన్‌ బిటెక్‌’ సినిమాలతో బాగా పేరు తెచ్చుకుంది శరణ్య. సినిమా కుటుంబం నుంచే వచ్చినా హీరోయిన్‌గా కన్నా కూడా తల్లి పాత్రల ద్వారానే శరణ్య బాగా పేరు తెచ్చుకుంది

మాధవి:

మాధవి:

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ' ‘రాలీపోయే పువ్వా నీకు రాగాలెందుకే ' ఈ పాటలు వింటుంటే చాలు ఎంతటి రాతి గుండైనా కరిగిపోవాల్సిందే..కళ్లు చెమ్మగిల్లక మానవు. అటువంటి పాత్రను ప్రేక్షకుల గుండెల్లో నిలిచే చేసింది మాధవి.

అన్న పూర్ణ :

అన్న పూర్ణ :

అంజలీ దేవి తర్వాత తల్లి పాత్రలతో తనకుంటూ ఓ గుర్తింపు పొందిన నటీమణి అన్నపూర్ణ, హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. దాదాపు సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లందరికీ తల్లిగా, బామ్మగా , అత్తగా నటించారు. అంతే కాదు, ఆమె అలనాటి మేటి నటుల సరసన హీరోయిన్ గా చేసి తిరిగి వారికి తల్లిగా నటించడం విశేషం.

వీళ్లు మాత్రమే కాదు

వీళ్లు మాత్రమే కాదు

వీళ్లు మాత్రమే కాదు ఈతరం రాధిక, భానుప్రియ, రోజా, నగ్మా, దేవయాని, అమల, సుధ, ప్రగతి , మధుబాల తదితర సిల్వర్ స్క్రీన్ మదర్స్ గా గుర్తింపు పొందినవారే..

మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పరిమెంట్స్

మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పరిమెంట్స్

విచిత్రం ఏమిటంటే, ప్రస్తుతం హీరోయిన్‌గా గిరాకీ ఉన్నవాళ్ళు సైతం కథ నచ్చితే, రొటీన్ పాత్రలకు భిన్నంగా అమ్మ పాత్రల ప్రయోగానికీ సిద్ధమవుతున్నారు. క్రేజ్ ఉన్న ఈ ఏజ్‌లోనే యంగ్ మదర్స్‌గా తెరపై కనిపించడానికీ వెనకాడడం లేదు. ఇవాళ్టి టాప్ హీరోయిన్లయిన సమంత, నిత్యా మీనన్‌లే అందుకు ఉదాహరణ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోని ‘మనం'లో సమంత ఏకంగా నాగచైతన్య భార్యగా, నాగా ర్జునకు తల్లిగా కాసేపు కనిపిస్తారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలోని ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'లో నిత్యామీనన్ ఏకంగా యంగ్ మదర్‌గా, వర్ధమాన హీరోయిన్ తేజస్వికి తల్లి పాత్రలో హుందాగా కనిపించారు.

English summary

Mother'sday Special: Top 10 Onscreen Moms of Tollywood

Most of the Telugu movies have always been filled with commercial elements. Also, several movies have the mother-child sentiment that makes us reminisce about our own mothers. Well, here we bring a list of the top ten onscreen mothers of Tollywood.
Desktop Bottom Promotion