For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలంటే వారంలో ఒక్కో రోజు పాటించాల్సిన నియమాలు..!

పురాతన గ్రంథాల ప్రకారం: కీర్తి ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలంటే వారంలో 7 రోజులు పాటించాల్సిన నియమాలు..

|

సహజంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆశిస్తుంటారు. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే మీకు ఇష్టమైన సెలబ్రిటీ లేదా రాజకీయ నేతలు లేదా ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు వలె మీరు కూడా ఉండాలను కోవడం దురాశే అవుతుంది. అందుకు తగిన అర్హత, శక్తి సామర్థ్యాలు ఉండాలి. కాబట్టి ఎప్పుడూ వాస్తవంలో జీవించడానికి ప్రయత్నించాలి. అలాగని పూర్తిగా నిర్వీర్యంగా ఉండాలని కాదు. జీవితంలో నేరువేర్చుకోగలిగిన చిన్న చిన్న కోరికలను, కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అందుకు ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 Seven tips to boost fame and wealth

మొదట పుట్టుక గురించి అవగాహన చేసుకోవడం చాలా అవసరం. ఎందకంటే అందరూ ఓకే విధంగా పుట్టరు, పుట్టిన వారందరికి ఒకే విధమైన లక్షణాలుండవు. జన్మనక్షత్రాలు, రాశుల ప్రభావంతో పుట్టిన తేది, సమయం, జన్మ రాశి, కర్మ సిద్ధాంత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇతరుల కంటే విభిన్నంగా ఉండటానికి కృషి చేయాలి.

జీవితంలో సంపదతో పాటు, కీర్తప్రతిష్టలు, అదృష్టం కలిసి రావాలంటే ఈ క్రింద సూచించిన కొన్ని సాధారణ నియమాలను పాటించాలని పురాతన హిందు గ్రంథాల్లో పేర్కొన్నారు. భారతీయ పండితులు పేర్కొన్న ఏడు రహస్యాలను వారంలో ఓక్కో రోజు ఒక్కో విధంగా చేస్తే మీరు కోరుకున్న కలలు నెరవేర్చుకోవడంతో పాటు కీర్తి, సంపదలు జీవితాంతం వెన్నంటి ఉంటాయంటున్నారు. మరి ఆ నియమాలేంటో వెంటనే మనం తెలుసుకుందాం..

 ఆదివారం:

ఆదివారం:

ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని సూచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఆదివారం ఇలా చేస్తే మంచిది.

సోమవారం:

సోమవారం:

వారంలో మొదటి రోజైన సోమవరం సానుకూలమైన ఫలితాలను అందిస్తాయి. కాబట్టి, మొదటిరోజైన సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక సారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

మంగళవారం:

మంగళవారం:

మంగళ వారం అంటే ఆంజనేయుడికి ప్రత్యేకమైన రోజని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.

బుదవారం:

బుదవారం:

ఏదైనా ముఖ్యమైన పనిమీద బుదవారం వెళ్లాల్సి వస్తే తప్పకుండా పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే మతపరంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది.

గురువారం:

గురువారం:

గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్రను లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

శుక్రవారం:

శుక్రవారం:

పవిత్రమైన లేదా ముఖ్యమైన కార్యం గురించి శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మం భోధిస్తున్నది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ఇందులో ఉప్పు లేదా పంచదార కలపకుండా ఉండాలి.

శనివారం

శనివారం

అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ దీని వల్ల మీ దశ తిరిగి అద్రుష్టం యోగం కూడా ఉంటుందని తెలుసుకోండి. ప్రతి శనివారం కొద్దిగా అ్లలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరుతాయి.

English summary

Seven tips to boost fame and wealth

From Monday to Sunday, do these 7 things each day for name, fame and wealth!
Desktop Bottom Promotion