For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్మార్గులు: ఒకడేమో కడుపు చేశాడు, మరొకడు మోసగించి వ్యభిచార గృహానికి అమ్మేశాడు..!

ఇది కేవలం15 సంవత్సరాల వయసు గల టీనా కథ. ప్రపంచంలోని మానవుల యొక్క నిజజీవితంలో ఎదుర్కొనే కొన్ని భయంకరమైన సంఘటనల్లో ఇది ఒకటి.టీనా అనే 15 ఏళ్ళ అమ్మాయి ఒక వ్యక్తి ద్వారా మోసగించబడింది. ఆమెని వ్యభిచారకూపంలో.

|

ఒక పోలీసు చేతిలో మానభంగానికి గురై, వ్యభిచార గృహంలోకి నెట్టబడి మోసపోయిన, ఈ యువ మహిళ గురించి ఎంత చెప్పిన తక్కువే. గుండె బద్దలయ్యే ఆమె కథ గురించి చదివి తెలుసుకోండి.

ఉద్యోగం పేరుతో మోసపోయి వ్యభిచారంలోకి నెట్టబడిన ఒక భారతీయ మహిళ యొక్క వాస్తవ కథ. అప్పటినుండి ఆమె జీవితం లో సంతరించుకున్న పోరాటాలు మరియు బాధలను గురించి చదివి తెలుసుకోండి.

ఇది కేవలం15 సంవత్సరాల వయసు గల టీనా కథ. ప్రపంచంలోని మానవుల యొక్క కఠినమైన రియాలిటీని ఎదుర్కోవడానికే ఆమె
తన ఇంటినుండి పారిపోయంది.

The Girl Who Was Tricked Into Prostitution

Image Courtesy

ఆమె ఒక వ్యక్తి ద్వారా మోసంచేయబడింది మరియు ఆమెని ఎలా వ్యభిచార గృహానికి విక్రయించారో మేరే చదవండి! మరియు ఆమె చేసిన పోరాటం గురించి తెలిస్తే తప్పనిసరిగా మీ గుండె బద్దలు అవుతుంది. మీ గుండె ని పిండేస్తున్నట్లు వున్నఈ కథ గురించి మరింత తెలుసుకోండి.

ఆమె 15 సంవత్సరాల వయస్సులో.....

ఆమె 15 సంవత్సరాల వయస్సులో.....

ఆమెకు చదవాలనే ఆసక్తి లేదు మరియు ఆమెకు బొమ్మలతో మరియు ఇరుగు పొరుగు వారితో ఆడుకోవడం ఇష్టం. ఆమె తరగతిలో ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవి కాదు. ఒక రోజు ఆమె తల్లి ఆమె పని పూర్తి చేయలేదని ఘోరంగా తిట్టింది. లిటిల్ టీనా ఆమెకు నచ్చినట్లు ఉండాలని ఇంటి నుండి పారిపోవడానికి నిర్ణయించుకుంది.

ఆమె అక్కడి నుండి వేరే నగరానికి పారిపోయింది...

ఆమె అక్కడి నుండి వేరే నగరానికి పారిపోయింది...

ఆమె జేబులో వున్న కొంత డబ్బుతో వేరే నగరానికి ప్రయాణించింది మరియు కాలిబాటన మరియు రోడ్లపక్కన నివసించింది. ఒక రోజు, ఒక పోలీస్ అధికారి ఆమెకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

తనకి సహాయం చేస్తున్నట్లుగా నటించాడు.

తనకి సహాయం చేస్తున్నట్లుగా నటించాడు.

అతను ఆమెని స్టేషన్ దగ్గరకి తీసుకువచ్చి తనకి సహాయం చేస్తున్నట్లుగా నటించాడు. తన ఉద్దేశం మంచిదికాదు. అతను ఒక రాత్రి మొత్తం ఆమెని సెల్ లో ఉంచి మానభంగం చేసాడు. ఆమె గర్భం దాల్చింది.

అతనే ఆమెని గర్భవతిని చేసాడు

అతనే ఆమెని గర్భవతిని చేసాడు

ఆమెకి కేవలం 15 సంవత్సరాలు మరియు ఎవరైతే రక్షించి సహాయం చేస్తానని నమ్మబలికాడో అతనే ఆమెని గర్భవతిని చేసాడు, ఆమె ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పరిస్థితిలో ఆమె అత్యంత సౌకర్యవంతమైన మరియు సురక్షిత స్థానంగా భావించిన దేవాలయ గేట్లు వద్ద నివసించడం ప్రారంభించారు.

ఆమెకి పని ఇప్పిస్తానని మరొకడు మోసగించిన వైనం..

ఆమెకి పని ఇప్పిస్తానని మరొకడు మోసగించిన వైనం..

ఆలయానికి రెగ్యులర్ ఒక వచ్చే వాడొకడు ఆమెకి సహాయం చేస్తానంటూ నమ్మబలికాడు. వేరే ఊర్లో (ముంబాయ్) పట్టణంలో తన సోదరి ఇంట్లో పనిచేయడానికి పని ఇప్పిస్తాను అక్కడ నీకు ఎలాంటి భయం ఉండదని నమ్మించాడు. ఆమె ఆలయంలో అతనిని తరచుగా చేస్తుండేది. ఆ కారణంతోనే ఆమెకు అతని మీద నమ్మకము ఉండటం వలన ఆమె అతనితో పాటు వెళ్ళడానికి నిర్ణయించుకుంది.

అతను ఆమెని అమ్మేశాడు....

అతను ఆమెని అమ్మేశాడు....

అతను రెడ్ లైట్ ఏరియాలో కేవలం 1 లక్ష రూపాయలకు ఆమెని విక్రయించాడు. ఆ పరిస్థితిలో ఆమెక ఏం చేయాలో తెలియలేదు, అక్కడి వారు ఆమెను చిత్రహింసలకు గురిచేసి, వేశ్య వృత్తి చేయమన్నారు. తాను ఉన్నప్రదేశంలో అత్యంత ప్రమాదకరమైందని, అక్కడ మానవ మ్రుగాలున్నాయని నిధానంగా గ్రహించింది, అక్కడి నుండి తప్పించుకోవడం సాధ్యం కాలేదు.

ఇష్టం లేకపోయినా వేశ్య వృత్తి చేయాల్సి వచ్చింది:

ఇష్టం లేకపోయినా వేశ్య వృత్తి చేయాల్సి వచ్చింది:

ఆ రోజునుండి, ఆమె పై ప్రతి ఒక్కసారి అత్యాచారం జరిగేది. తనకు ఇష్టం లేకపోయినా డ్రగ్స్ ఇచ్చి బలవంతగా లొంగతీసుకునేవాళ్ళు. తనకు STD (సెక్సువల్ ట్రాన్స్ డిసీజ్) మరియు హెచ్ ఐవి ఉన్నపటికీ కొంత మంది ఆమెను వదిలే వారు కారు. ఆమెను బాగా వాడుకున్నారు.

ఆమెకి సాధ్యమైనంతవరకు వారిపై ప్రతీకారం తీసుకుంటోంది..

ఆమెకి సాధ్యమైనంతవరకు వారిపై ప్రతీకారం తీసుకుంటోంది..

ఆమెకి జరిగిన మోసం మరియు ఆమె ఈ వ్యభిచారంలోకి రావడానికి కారణమైన పురుషుల మీద ప్రతీకారం తేర్చుకోవాలనుకుంది. తను HIV పాజిటివ్ ఐనప్పటికి నిజాన్ని దాచి అబద్దం చెబుతూ పురుషులతో వేశ్య వృత్తిని కొనసాగించింది.

కూతిరి భవిష్యత్ కోసమే ఇలా చేయాల్సి వచ్చిందంటోంది..

కూతిరి భవిష్యత్ కోసమే ఇలా చేయాల్సి వచ్చిందంటోంది..

తెలిసిన ఓ మహిళ దగ్గర కూతుర్ని ఉంచి నెలకు రూ.4,000 పంపేది. దురదృష్టకర విషయం ఏంటంటే ఆమెకు టీబీ, హెచ్ఐవీ సోకిన తర్వాత తాగుడుకు బానిసగా మారిన టీనా దాన్ని నుంచి బయటపడటానికి తీవ్రంగా పోరాడి విజయం సాధించింది. తన కూతురి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆమె మంచి రోజులు వస్తాయని కలలు కంటోంది.

తనకు తానే ప్రేరణగా నిలిచింది..

తనకు తానే ప్రేరణగా నిలిచింది..

ప్రస్తుతం ఆమె కుమార్తె హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. నా జీవితం దుర్బరంగా ఉన్నా, ఆమె భవిష్యత్తు కోసం బలాన్ని కూడదూసుకుని నాకు నేనుగా ప్రేరణ పొందానని అంటోంది. నా బలం...తనే లేకపోతే నేను ఒక తల్లిగా ఇన్నేళ్లు పోరాటం చేసాదాన్ని కాదని పేర్కొంది.

ఆమె చేసింది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారా?

ఆమె చేసింది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారా?

ఆమె చేసింది కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారా? దీనిపై గల మీ ఆలోచనలను ,అభిప్రాయాలను క్రింది బాక్స్ లో షేర్ చేయండి.

English summary

The Girl Who Was Tricked Into Prostitution

This is a true story of an Indian woman who was forced into prostitution, after she was tricked about getting a job. Read on to find about the struggle and pain she has been through ever since. This is the story of Tina who was just 15 years old when she ran away from her home to only face the harsh reality of humans in the outside world.
Story first published: Thursday, April 6, 2017, 13:17 [IST]
Desktop Bottom Promotion