అన్నప్రాసం తర్వాత పసిపిల్లలకు ఎటువంటి ఆహారానందించాలి..

Posted By:

అమ్మపాల నుంచి... అన్న ప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లులని తికమక పెడతాయి. ముఖ్యంగా ఏడాదిలోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు..

అమ్మపాలు: తొలినాళ్లలో అంటే ఆరు నెలల వరకూ బిడ్డకు కావాల్సిన సమస్త పోషకాలు అమ్మ పాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల భారిన పడకుండా చేస్తాయి. ఇక ఆర్నెల్ల తర్వాత నుంచీ ఎదిగే చిన్నారులకు వారి అవసరాలరిత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగ్గా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు మూడు కేజీల వరకు బరువుండాలి. ఐదు నెలలకి అది రెట్టింపు అవ్వాలి.

తొలి ఘనాహారం: సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజ ధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి.

శుభ్రం చేసిన కిలో పెసలని పదిహేను గంటలపాటు నానబెట్టి వాటిని తడి వస్త్రలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత దోరగా వేయించి, చల్లార్చి పిండి పట్టించుకొని పిల్లలకు ప్రతి రోజూ తినిపించాలి.

అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగులని పదిహేను గంట పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో మూడు రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ, మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించి, పిండి పట్టించుకొని గాలిచోరని డబ్బాలో భద్రపరచుకొని ప్రతి రోజూ తినిపించాలి.

ఏడు, ఎనిమిది నెలల్లో ఈ పిండితో పాటు ఆహారానికి తోడుగా బాగా ఉడికించిన మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డలోని పచ్చసొన, అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు. అధిక శక్తికోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థఆలని కలపడం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది.

పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలని, పొట్టు ఉన్నవాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అజీర్తి చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చెయ్యాలి....

Read more about: baby, parenting tips, బేబీ, తల్లితండ్రులకు చిట్కాలు
English summary

Types of first food to offer baby.. | సంవత్సరంలోపు పిల్లలకు పౌష్టికాహార ఎలా అందించాలి...

Some foods are better than others for introducing baby to solids. If cooked at home, foods containing milk and milk products cannot be eaten as first foods.
Please Wait while comments are loading...
Subscribe Newsletter