For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లల్లో డయోరియా(విరేచనాలు) నివారించే వంటింటి చిట్కాలు

|

అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. చిన్న పిల్లల్లో సాధారణంగా వేసవి కాలంలో వచ్చే వ్యాధులలో "డయేరియా" (నీళ్ల విరేచనాలు) ఒకటి. డయేరియా ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరిగే అవకాశాలున్నాయి. అందుకే డయేరియాను నివారించేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల్ని ఈ సమస్య నుంచి సునాయాసంగా బయట పడవేయవచ్చు.

వ్యాధి లక్షణాలు: వాంతులు, విరోచనాలు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, డీసెంట్రి ఐతే రక్త విరోచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మాములుగా ఈ జబ్బు 2-3 రోజులలో తగ్గిపోతుంది. ఈ వ్యాధి లక్షణాలు నీళ్ళు ఎంత తాగినా దాహంగా ఉండడం. ఏడ్చినా కళ్ళలో నుండి నీళ్ళు రాకపోవడం. నాలుక ఎండిపోవడం, కళ్ళు లోపలికిపోవడం, నీరసంగా అవడం వంటివి. ఈ వ్యాధి డీహైడ్రేషన్‌ వల్ల వస్తుంది.

నివారణ: డయేరియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ఎక్కువగా విరేచనాలు కావటంతో, వారి శరీరంలోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. దీంతో వారి శరీరం డీ హైడ్రేషన్‌కు గురై, ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లలు కోల్పోయిన నీటిని, లవణాలకు వెంటనే వారి శరీరానికి అందించినట్లయితే డయేరియాను ఆపవచ్చు.

ద్రవాహారాలు: పిల్లలు విరేచనాలతో కోల్పోయిన నీటిని, లవణాలను తిరిగీ శరీరానికి అందించాలంటే.. పాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి పదార్థాలను క్రమం తప్పకుండా అందించాలి. విరేచనాలు ఎక్కువగా అవుతున్నాయని పిల్లలకు ఆహారం ఇవ్వకుండా మానివేయకూడదు. ఇలా చేస్తే పిల్లలు నీరసించిపోతారు. కాబట్టి ద్రవాహారాలను ఎక్కువగా ఇవ్వడం వల్ల వారి శరీరం హైడ్రేషన్ లో ఉండి వారి శక్తిని అందిస్తుంది.

Home Remedies To Cure Diarrhoea In Babies

ఉప్పు-పంచదార: పిల్లలకు విరేచనాలు ఎక్కువగా అవుతున్న సమయంలో ఓఆర్ఎస్ ద్రవాన్ని తప్పకుండా త్రాగించాలి. ఈ ద్రవాన్ని విరేచనం అయిన ప్రతిసారీ పిల్లలకు తాగిస్తూ ఉంటే సమస్య రెండు లేదా మూడు రోజులలో అదుపులోకి వస్తుంది. అలాగే కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, తగినంత పంచదార వేసి బాగా కలిపి పిల్లలకు ఇస్తుండాలి. ఇలా ఇవ్వటంవల్ల విరేచనాలతో బాధపడినా పిల్లలు బలహీనం అవకుండా ఉంటారు.

అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వాలి: డీహైడ్రేషన్‌ థెరపీ అనగా నీరు మొత్తంగా ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా స్పూన్‌తో తాగించడం.చిన్న పిల్లల్లో ఎక్కువగా అశుభ్రత, కలుషితమైన నీరు తాగడం, మట్టిలో ఆడడం, బయటచేసే అశుభ్రమైన ఆహారం తీనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా లాక్టోజ్‌, పరమాన్నం లేక అన్నం+పాలు+ చెరుకురసంలో ఉండే షుగర్‌ మంచిది. లాక్టోజ్‌ వద్దు. కిచిడీ లేక అన్నం+ పెసరపప్పు. ఇందులో అరస్పూన్‌ నెయ్యి లేక పంచదార వేయొచ్చు.

అన్నం, పప్పు, ఇడ్లీ, ఉడకబెట్టిన గుడ్డు తెల్లసొన, కీమా సూప్‌.

పాలు మితంగా ఇవ్వాలి. లేక అరగనపుడు కొన్నాళ్లుపాలు లేకుండా కిచిడి, కీమా సూప్‌ ఇస్తూ మెల్లగా ఆహారం చిన్ని చిన్ని మార్పులతో పెంచుతూ పోవాలి. మార్కెట్లో లాక్టోజ్‌ షుగర్‌ లేని పాలపొడి దొరుకుతుంది. 2-3 వారాలు ఈ మిల్క్‌ పౌడర్‌ (డాక్టర్‌ సలహాతో) ఉపయోగించి తరువాత మళ్లీ మామూలు పాలు ఇవ్వొచ్చు.

మైక్రో నూట్రియన్ట్స్‌ అంటే విరోచనాలున్నపుడు త్వరగా కోలుకోడానికి జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి. మన దేశంలో ఆహారలోపం ఎక్కువ కనుక మల్టీవైట్‌ సిరప్‌(ఇందులో ఫోలిక్‌యాసిడ్‌, జింక్‌, కాపర్‌, విటమిన్‌ ఎ) పిల్లలకు మంచిది. పిల్లలకోసం ఏమిచ్చినా వైద్యసలహా తప్పనిసరి. తల్లిదండ్రులకు వైద్యం, సరైన ఆహారం గురించి తెలిసుండాలి.

English summary

Home Remedies To Cure Diarrhoea In Babies | పిల్లల్లో విరేచనాల నివారణకు వంటింటి చిట్కాలు...

If you are a well-informed mother, then you must know that diarrhoea in babies can be life threatening. Unfortunately, it is also one of the most common health problems for babies. Every year, hundreds of babies die of diarrhoea in India because they are not treated properly. This child mortality rate is shameful and alarming because diarrhoea among babies is a very easily curable disease.
Story first published: Friday, April 5, 2013, 16:42 [IST]
Desktop Bottom Promotion