For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండవ బిడ్డ కోసం సిద్ధం కావటానికి చిట్కాలు

By Lakshmi Perumalla
|

మీ కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు రావటం అనేది మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని కలగజేస్తుంది. మీరు ఆశతో,సంతోషం మరియు ఆనందంతో మీ మొదటి బిడ్డను ఇంటికి తీసుకువచ్చి ఉండవచ్చు. అలాగే అదే మార్గంలో మీరు మీ రెండవ బిడ్డను మరింత ఉత్సాహంగా తీసుకురావాలి. నిజానికి మీకు గర్భం కొత్త కాదు. మీరు ఇంటికి మీ రెండో బిడ్డకు స్వాగతం చెప్పేటప్పుడు కొన్ని జోడించాల్సిన బాధ్యతలు ఉన్నాయి.

పిల్లవాడు పుట్టిన సమయంలో ఆసక్తికరమైన సన్నాహాలు మరియు ఎంపికలు ఉంటాయి. ఇంట్లో ప్రతిదీ మార్పులకు లోనవుతుంది. అంతేకాక మీ మొదటి బిడ్డ తన సోదరి/సోదరుడు రాక గురించి అడగటం మొదలవుతుంది. ఇంటిలో ఇద్దరు పిల్లలను మేనేజ్ చేయటం కొంచెం కష్టం అవుతుంది. అయితే రెండో బిడ్డ ప్రణాళిక అనేది మంచి ఆలోచన అవుతుంది.

మీ రెండవ గర్భధారణ సమయంలో మీరు తొందరగా అలసిపోతారు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండటం మరియు మీ మొదటి బిడ్డను చూడటం వంటి రెండు పనులను నిర్వహించవలసి ఉంటుంది. మీ మొదటి బిడ్డ భావోద్వేగాలు మరియు డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధ వహించాలి. మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడానికి డెలివరీ తర్వాత 6 నుంచి 8 వారాల వరకు కఠినముగా ఉంటుంది. ఇక్కడ రెండవ బిడ్డ కోసం సిద్ధం చెయ్యడానికి అనుసరించవలసిన కొన్ని పేరెంటింగ్ చిట్కాలు ఉన్నాయి.

Tips to get ready for second baby

1. మళ్ళీ తిరిగి ఉపయోగించేవి

మీ మొదటి బిడ్డ వస్తువులను అంటే ముఖ్యంగా బట్టలను తిరిగి ఉపయోగించవచ్చు. మీరు ఇంటి నుంచి శిశువును బయటకు తీసుకువెళ్ళి నప్పుడు ఎటువంటి బట్టలైన పర్వాలేదు. అయితే,లింగ నిర్దిష్ట బట్టలు అనేవి ఇంటి లోపల ముఖ్యం కాదు. ఇదే విధంగా మీరు మీ మొదటి బిడ్డ ఫీడింగ్ సీసాలను ఉపయోగించవచ్చు. మీరు రెండవ బిడ్డ కొరకు ప్రణాళిక ఈ విధంగా చేయవచ్చు.

2. ఉత్తమ డీల్స్

పిల్లలు జన్మించినప్పుడు ఎప్పుడు ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు చూసి డైపర్స్ కొనుగోలు చేయండి. మీ శిశువుకు ఉపయోగించటానికి సైజు1 డైపర్స్ ఎక్కువగా నిల్వ చేయండి. రెండవ బిడ్డ ప్రణాళిక కొరకు కొద్దిగా తయారీ అవసరం మరియు వాటిలో ఇది ఒకటి.

3. శీఘ్ర ఆహారాలు

మీ రెండో బిడ్డ కోసం సిద్ధం కావటానికి ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైన విషయం. మీ ఇంట్లో ఘనీభవించిన మరియు పొడి ఆహారాలను ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచండి. మీ రెండో బిడ్డ వచ్చినప్పుడు మీకు వంట సమయం ఆదా అవుతుంది. ఈ చిట్కా మీ శిశువు ఉత్తమ సంరక్షణకు మరియు మీ శిశువుతో ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేస్తుంది.

4. టాయ్ డబ్బాలు

మీ బెడ్ రూమ్ లేదా లాండ్రీ గది లో సిద్ధంగా కొన్ని బొమ్మ డబ్బాలు ఉంచండి. మీ శిశువుకు ఆహారం లేదా కొన్ని పనులను చేస్తున్న సమయంలో మీ మొదటి బిడ్డను బిజీగా ఉంచటానికి సహాయపడుతుంది. దంపతులకు రెండవ బిడ్డ గురించి అనుసరించాల్సిన పేరెంటింగ్ చిట్కాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. కానీ మీరు తగినంత తయారీలో ఉండుట వలన మంచి మార్గంలో నడపటానికి సహాయం చేస్తుంది.

5. శుభ్రంగా

మీరు శిశువు రాక ముందు మీ శిశువు గది మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచటం అత్యవసరం.ఇది జెర్మ్స్ మరియు ఇతర అంటురోగాలు నుండి పిల్లవాడిని రక్షించడానికి సహాయం చేస్తుంది.మీరు రెండవ బిడ్డ వచ్చిన వెంటనే మరియు తరచుగా చెయ్యాల్సిన పని అని చెప్పవచ్చు.

6. ఆహ్వానించండి

మీ కుటుంబ సభ్యులు సహాయంను పొందండి. మీ గర్భం మరియు డెలివరీ సమయంలో మీ దగ్గర ఉండడానికి వారిని ఆహ్వానించండి.ఇది మీ మొదటి బిడ్డకు సహాయం మరియు జాగ్రత్తగా చూసుకోవటానికి సులభంగా ఉంటుంది.

7. మీ మొదటి బిడ్డను సిద్ధం చేయుట

ఇది దంపతులు అనుసరించవలసిన పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి. మీ మొదటి బిడ్డ యొక్క భావోద్వేగాల పట్ల శ్రద్ధ వహించడం అనేది ముఖ్యమైన విషయం. ఒక తోబుట్టువు రాక గురించి చెప్పి వారిని సిద్ధం చేయాలి. దాని గురించి ఉత్తేజిత అనుభూతి కలిగేలా చెప్పాలి. ఆమె తోబుట్టువులు ఆమెకు ఉత్తమ కంపానియన్ అని చెప్పండి.

English summary

Tips to get ready for second baby

A new member in your family is always a pleasure! When you are still relishing the joy and happiness of your first baby and the fortune she brought home, you may be even more excited to know your second baby is on the way!
Story first published: Friday, November 29, 2013, 17:56 [IST]
Desktop Bottom Promotion