For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంటిపిల్లలు ఎందుకు ఏడుస్తారు..?తెలుసుకుంటే మీకే మంచిది!

|

సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆక్రమంలోనే వారు కొన్ని చిన్నచిన్న లేదా పెద్ద పెద్ద శబ్దాలకు కెవ్వు మంటుంటారు. అయితే కొత్త తల్లికి మాత్రం శిశువు ఎందుకు ఏడుస్తున్నారో కనుగొనడం కష్టం అవుతుంది. తల్లి చంటి పిల్లలతో ఎక్కువగా గడపగలిగినప్పుడు వారికి ఏం కావాలో తెలుసుకోవచ్చు. మీరు అనుకొన్న విధంగా పిల్లలకు కావల్సిన పనులు మీరు చేస్తున్నట్లైతే వారి ముఖాల్లో చిరు నవ్వులు చిగురిస్తాయి. అంతే కాదు వారు హ్యాపీ మూడ్ తో కనబడుతారు. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మాత్రమే పనిచేస్తాయి. తీక్షణంగా పరీక్షించినట్లైతే వారు వివిధ కారణాల వల్ల వివిధ రకాలుగా ఏడుస్తారని తెలుసుకోవచ్చు.

సాధారణంగా చంటి పిల్లలు ఆకలి వలనే ఏడుస్తారని కొంతమంది అనుకుంటారు. కాని శిశువుల ఏడుపులలో చాలా రకా లున్నాయి. రెండు వారాల వయసులో బిడ్డ ఏడుపు క్రమబద్ధంగా మారుతుంది. చాలా మంది సాయంత్రం అయ్యేటప్పటికి ఏడవడం ప్రారంభిస్తారు. ఈ ఏడుపు ఆగిఆగి అలాగే రాత్రివరకు కొనసాగుతుంది. ఈ రకం ఏడుపులో శిశువుల కడుపు ఉబ్బరించి ఉంటే 'కొలిక్‌ అని, లేకపోతే 'పీరియాడిక్‌ ఇరిటబుల్‌ క్రయింగ్‌ అని అంటారు. కొంతమంది శిశువులు చిన్న చిన్న శబ్దాలకే బెదిరి పోయి బాగా ఏడుస్తారు. వీరిని హైపర్‌ టానిక్‌ బేబీస్‌ అంటారు. మూడు నెలల వయసు వచ్చే వరకు శిశువులలో జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇవి అభివృద్ధి చెందే వరకు శిశువులు ఏడుస్తూనే ఉంటారు. ఇవేకాక ఇంకొన్ని కారణాలున్నాయి అవేంటో ఒకసారి పరిశీలించండి...

వారికి పాలు పట్టడం కోసం సమయాన్ని గుర్తుచేస్తారు: కొంత మంది పిల్లలు ఆకలి వేసినప్పుడు ఏడవడం జరుగుతుంది. అప్పుడు తల్లి తెలుసుకొని ఫీడ్ చేస్తుంది. వారికి ధరించే న్యాపిలు పొడిగా ఉన్నా...కొత్తవి ధరించిన తర్వతా కూడా వారు ఏడుస్తున్నట్లైతే వారు ఆకలి కోసమే ఏడుస్తున్నట్లు గమనించాలి. అప్పుడు శిశువులకు ఫీడింగ్ చేసి, సౌకర్యవంతంగా ఉంచడం వల్ల వారు ఏడవడం నిలిపేస్తారు.

వీరి ఏడుపుకు సాధారణమైన కారణం ఆకలికావడమే. పాలు పట్టి చాలా సేపయినా, పట్టిన పాలు సరిపడకపోయినా ఏడుస్తారు. శిశువు ఏడ్చినప్పుడల్లా పాలుపట్టించడం మంచి పద్ధతి దీన్నే డిమాండ్‌ ఫీడింగ్‌ అంటారు. పిల్లలు బొద్దుగా కనిపించాలనే ఉద్దేశంతో అతిగా పాలు పడతారు కొంతమంది తల్లులు. ఈ విధంగా చేయడం మంచిది కాదు.

మీ శిశువు అనారోగ్యంతో ఉన్నప్పుడు: పాలు పట్టిన తర్వాత కూడా మీ పిల్లలకు ఏడవడం ఆపకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా లేదా పాలు త్రాగకుండా మారాం చేస్తున్నా, అప్పుడు మీరు ఖచ్చితంగా వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలి. వారి హై టెంపరేచర్ ను పరిశీలించాలి, వాపులు, దద్దుర్లు, రక్తం, శ్వాససంబంధిత ఇలా మొత్తం ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం చాలా అవసరం.

డైపర్ మార్చడానికి సమయం: పిల్లలు ఏడుపు మొదలు పెట్టగానే ముందుగా మీరు గమనించాల్సిందే వారి న్యాపినీ. న్యాప్కిన్లు ఏమాత్రం కొంచెం తడి అయినా లేదా డర్టీగా మరినా వారికి చిరాకు కలుగుతుంది. అందుకు వారు ఏడవడం తప్ప మరేం చేయలేరు. ఒక వేళ మీరు క్లాత్ డైపర్ ను ఉపయోగిస్తుంటే కనుక వాటిని టైంకు మార్పు చేయడానికి నిర్ధారించుకోవాలి.

పిల్లలకు ఫీడింగ్ చేసిన తర్వాత కూడా ఏడుస్తున్నట్లైతే, వారి ప్రేగుల్లో గ్యాస్ ఉత్పత్తి వల్ల కావచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా వారిని మీ మోకాళ్ల మీద లేదా భుజాల మీద వారి పొట్ట ఆన్చేవిధంగా పడుకోబెట్టుకోవాలి. పిల్లలకు పాలు పట్టిన ప్రతి సారి ఇలా చేయడం చాలా అవసరం. మంచిది కూడా..

చెవిలో ఇన్ఫెక్షన్: మీ శిశువు అధికంగా ఏడుస్తుంటే కనుక, వారు ఏడుస్తూనే చేతులు కదల్చడం లేదా రుద్దడం వంటివి చేస్తూ మనకు సూచనలిస్తారు. వాటిని కనుక మనం గమనించినట్లైతే సమస్య పరిష్కరించడం చాలా సులభం. పాలు పట్టేటప్పుడు వారు చెవులను లాగడం లేదా చెవుల పట్టుకొని ఏడవడం వంటివి చేస్తున్నట్లేతే..చెవులకు ఇన్ఫెక్షన్ అయిందేమోనని గమనించాలి . ఇంకా ఫీడింగ్ సమయంలో మీ బేబీ సరిగా మింగుతున్నారా లేదా గమనించాలి. వారికి సౌకర్యవంతంగా పడుకోబెట్టుకొని ఫీడ్ చేయాలి.

ఏమీ అవసరం లేదు, కానీ మీరు కావాలి: కొన్ని సార్లు మీ శిశువు ఏడవడం మొదలుపెడుతారు. వారికి ఏమి అవసరం ఉండదు. కానీ వారి ఎత్తుకోవడం కోసం ఏడుస్తుంటారు. అది వారిని సురక్షితంగా మరియు సురక్షిత అనుభూతి చెందేట్లు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మంచి ఫీడింగ్ తో పాటు మంచి న్యాపీలను ఉపయోగించినా కూడా చిన్నగా ఏడుస్తున్నట్లైతే వారికి మీ చేత స్పర్శను కలిగించండి.

అసౌకర్యంతో: పక్కబట్టలు, శిశువుకు తొడిగిన బట్టలు అసౌక ర్యంగా ఉన్నా, పడుకోబెట్టిన పరుపు గట్టిగా ఉన్నా, చలివలన, ఉక్కపోతవలన, బట్టల్లో యూరిన్‌ పాస్‌ చేయటం వలన పిల్లలు ఏడుస్తారు. దీనిని ఎప్పటి కప్పుడు గమనించి సరిచేస్తే ఏడుపు మానేస్తారు.

సాయంత్రం: ఒక నెల నుండి ఆరునెలల వయస్సున్న శిశు వులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తారు. సాయంత్రం కాగానే వాతావరణంలో మార్పు వల్ల, చీకటిపడటం వల్ల, చల్లబడటం వల్ల పిల్లలు ఏడు స్తారు. పొద్దున్న నుంచి చెమటతో చికాకుగా ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట కూడా గోరు వెచ్చని నీటితో స్నానం చేయించి, పౌడర్‌ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిదురపోతారు.

రాత్రి: శిశువు తల్లిగర్భంలో ఉన్నపుడు వారికి పగలు, రాత్రికి, వెలుతురుకూ, చీకటికి తేడా తెలియదు. కాబట్టి జన్మించగానే బయట వాతావరణానికి అలవాటు పడలేక ఏడుస్తారు.
ప్రతి తల్లీ ఈ విషయంలో చిరాకు పడకుండా సహనంతో వ్యవహరిస్తూ శిశువును రాత్రివేళల్లో జాగ్రత్తగా చూసుకోవాలి.
శిశువు ఏడుపును తల్లి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే సమస్యలేమీ ఉండవు.

English summary

What Baby Cries Indicate?

As your baby becomes familiar with the new sounds, sights and stimulus; they will start responding to this world. But it is difficult for a new mother to identify the gestures of a baby. But, as you spend more time with your baby, you will understand clearly what your baby wants to communicate with you.
Desktop Bottom Promotion