For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల పెంకితనం నిర్వహించటానికి 10 సమర్థవంతమైన మార్గాలు

|

మన జీవితానికి ఒక వరంలాంటివాడు 'బిడ్డ'; మనం వారితో అధిక సమయాన్నిగడపాలనుకుంటాం, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని అనుకుంటాం, వారిని ప్రానంకన్నా ఎక్కువగా ప్రేమిస్తాం మరియు వారిని గారాబం చేస్తాం. కానీ కొన్నిసార్లు వారిని అతిగా గారాబం చేయటంతో వారు, తనదైన తీరును మరియు కుయుక్తులను మనమీద ప్రదర్శిస్తుంటారు. తద్వారా చాలా మొండిగా తయారయి వారు ఏది కోరుకున్నా అది జరగాలన్న పెంకితనం మొదలువుతుంది మరియు తల్లితండ్రులు కొన్ని సమయాల్లో ఇటువంటి పెంకితనం మరియు మొండితనం చాలా తీవ్రంగా ఎదుర్కుంటున్నారు.

పెంకితం మరియు మొండితనం ఉన్న చిన్నపిల్లలను నిర్వహించటం చాలా కష్టమైన పని. వారు కోరుకున్నది ఇవ్వకపోతే లేదా వారంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అని గమనించినప్పుడు, వారు కోరుకున్నది జరగాలని పేచి మొదలుపెడతారు. వారు కోరుకున్నది పొందకపోతే, వారి చిరాకు,నిరాశను గట్టిగా అరవటం లేదా ఏడవటం ద్వారా చూపిస్తారు.

చిన్నపిల్లలు పెంకితనంతో వ్యవహరిస్తున్నట్లయితే మనం కొన్ని భావోద్వేగాలను అణచివేసుకోవాలి మరియు ఇటువంటి సమయాల్లో మన భావాలను బయట పెట్టకూడదు. ఇటువంటి చిన్నపిల్లలను నిర్వహించడానికి కొన్ని సమర్థవంతమైన మార్గాలు ఉన్నాయి.

ఇటువంటి చెడు అలవాటు ఉన్న చిన్నపిల్లలను నిర్వహించటానికి అపారమైన సహనం మరియు ప్రేమ అవసరం . ఇక్కడ మీ పిల్లలకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇస్తున్నాము. చూడండి.

మీరు ప్రశాంతంగా ఉండండి

మీరు ప్రశాంతంగా ఉండండి

మీ బిడ్డ మీ నుండే నేర్చుకుంటాడు. చిన్న పిల్లలు పెంకిగా వ్యవహరిస్తున్నప్పుడు, మీరు ప్రశాంతంగా ఉండాలి. మనం చేసే వెధవపని ఏమిటంటే కోపం తెచ్చుకోవటం. మనం ప్రశాంతతతో మరియు వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వారు కూడా అదే ప్రశాంతతతో ఉంటారు.

కారణాలు వేరు

కారణాలు వేరు

చిన్న పిల్లలలో పెంకితనం అన్నది వివిధ సమయాల్లో వివిధరకాలుగా ఉంటుంది. అది ఏదైనా శారీరక నొప్పి, చిరాకు వలన కావొచ్చు. వారికి మీ ధ్యాసగాని, ఆకలి లేదా నిద్ర అవసరం అయిఉండవొచ్చు.

యుక్తులను ప్రదర్శించండి

యుక్తులను ప్రదర్శించండి

పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు వారికి ఆప్షన్ ఇవ్వండి. పిల్లలు వివిధ రకాలుగా ఉంటారు మరియు మీరు మీ పిల్లల కోసం ఒక మంచి ఆలోచనను ఆలోచించండి. మీరు వారిని నిశ్శబ్దంగా ఉండమని బ్రతిమాలండి మరియు వారు నిశ్శబ్దంగా ఉంటే వారిని అభినందించండి.

మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి

మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి

పెంకితనంతో వ్యవహరించే పిల్లలను నిర్వహించే తల్లిదండ్రులకు రక్తపోటు మరియు ఒత్తిడి స్థాయిలు పెరుగుతుంటాయి. నిశ్శబ్దంగా ఉండండి మరియు కొన్ని క్షణాలు మీ బిడ్డకు దగ్గరగా ఉండండి. ఇలా చేయటం వలన మీ పిల్లల పెంకితనం తగ్గుతుంది.

కారణం కనుక్కోండి

కారణం కనుక్కోండి

చిన్న పిల్లలు ఎందువల్ల ఇలా ప్రవర్తిస్తున్నారో, కారణమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. . కారణమేమిటో తెస్లుసుకొని మీరు స్పందించండి. బిడ్డ ఆకలితో ఉన్నాడా లేదా నాప్ అవసరమా అని తెలుసుకొని తన అవసరాలను తీర్చండి. బిడ్డ, తనను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తే, అతనితో కొంత సమయం గడపండి.

పిల్లల ప్రకోపాన్ని ప్రోత్సహించవొద్దు

పిల్లల ప్రకోపాన్ని ప్రోత్సహించవొద్దు

పిల్లల్లు అనుకున్నది పొందడానికి ఈ పెంకితన మార్గం వారికి బాగున్నది అనుకుంటే, వారు ఎప్పుడు అదే మార్గం అవలంబిస్తారు. మీరు వారిని ఇదే మార్గంలో ప్రోత్సహిస్తుంటే వారు ఇంకా మొండివైఖరిని నేర్చుకుంటారు. ప్రారంభంలోనే ఈ పెంకితనాన్ని అదుపులో ఉంచగలగాలి.

గాయాలు కాకుండా అడ్డుకోండి

గాయాలు కాకుండా అడ్డుకోండి

కొంతమంది చిన్నపిల్లలు తాము అనుకున్నది సాధించటానికి చేసే పెంకితనం చాలా నాటకీయంగా ఉంటుంది. ఈ సందర్భంలో, వారి నుండి అన్ని ప్రమాదకరమైన వస్తువులను దూరంగా ఉంచండి. పిల్లలు పెంకితనం చేస్తున్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ మాట్లాడండి.

పిల్లలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడండి

పిల్లలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడండి

పిల్లలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడటం అవసరం. వారి మొండివైఖరి ఆమోదనీయం కాదని అర్థం చేసుకుంటారు మరియు మీరు ఇప్పటికీ వారిని ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు.

కారణం కొరకు ప్రయత్నించవద్దు

కారణం కొరకు ప్రయత్నించవద్దు

పిల్లలు పెంకితనం చేస్తున్నప్పుడు మధ్యలో వారిని కారణం కొరకు ప్రశ్నించకండి. ఇలా చేయటం వలన వారు నిరాశకు లోనవుతారు. తమ భావోద్వేగాలను పిల్లలను వ్యక్తపరచనివ్వండి. మీరు వారి భావాలను తెలుసుకోవటంలో సహాయపడేలా చేస్తుంది.

దెబ్బలు వేయవొద్దు

దెబ్బలు వేయవొద్దు

బిడ్డ పెంకితనం మాన్పించటానికి ఇదేమీ వ్యవహరించే పధ్ధతి కాదు. కొట్టటం వలన మీరంటే ఇష్టపడకపోవటం వంటిది జరుగుతుంది. మీ నియంత్రణలో లేనప్పుడు మాత్రమే కొట్టటం అనేది ఆమోదయోగ్యం.

Desktop Bottom Promotion