For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిశువులకు డైపర్ రాష్ లు పడకుండా నివారణకు చిట్కాలు

By Super
|

ఒక పేరెంట్ గా, మీ పిల్లలు డైపర్ వల్ల ఏర్పడ్డ దద్దుర్లతో ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం చూసి మీ మనసు బాధపడుతుంది. మీ పిల్లలకు ఎక్కువసేపు అరిగిపోయిన డైపర్లు వేసి ఉంచడం వల్ల డైపర్ రాష్ లు వస్తాయి లేదా మీరు డైపర్ ని బాగా బిగుతుగా కట్టడం వల్ల గాలి చొరబడక రాష్ లు వస్తాయి. పిల్లలకు డైపర్ వేసే ప్రదేశ౦లో బొబ్బలు, చికాకుగా ఉండి, కింద భాగం ఎర్రగా అయి, జననేంద్రియ భాగంలో కొన్ని డైపర్ దద్దుర్ల లక్షణాలు ఏర్పడతాయి. మీరు కొన్ని గృహ వైద్యం ద్వారా వీటికి చికిత్స చేసి, పిల్లలలో సంతోషాన్ని తీసుకు రావచ్చు.

ఇక్కడ డైపర్ రాష్ లకు కొన్ని గృహ వైద్యాలు ఇవ్వబడ్డాయి.

కలబంద

కలబంద

ఒక కలబంద ఆకు తీసుకోండి. దాన్ని రెండు భాగాలుగా విభజించండి. ఒక కత్తితో దానిలోని జెల్ ని బైటికి తీయండి. డైపర్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి, పొడిగా ఉండేట్టు చూడండి. ఇప్పుడు, బేబీ చర్మంపై కలబంద జెల్ ని అప్లై చేయండి. ఇది పుండ్లు పడ్డ ప్రదేశాన్ని మృదువుగా ఉంచి, చర్మం త్వరగా నయమయ్యేట్లు చేస్తుంది.

జొన్న పిండి గంజి

జొన్న పిండి గంజి

బేబీ చర్మం కింది భాగంలో జొన్న పిండి గంజిని చల్లండి. తరువాత, మీ చిన్నారి డైపర్ కి ఎటువంటి హాని కలుగదు. డైపర్ రాష్ లను నివారించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

కొబ్బరి నూనె/ఆలివ్ నూనె

కొబ్బరి నూనె/ఆలివ్ నూనె

మీ బేబీకి దద్దుర్లు వచ్చిన ప్రాంతంలో కొబ్బరి నూనె రాయండి. మీరు మీ బేబీ కింది భాగాన్ని మసాజ్ చేయడానికి కొబ్బరినూనె కు బదులుగా ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ ని కొద్ది నీరు కలిపి పలుచగా చేయండి. దీనిని పిల్లలకు దద్దుర్లు ఏర్పడ్డ ప్రదేశంలో ఉపయోగించండి.

వాసలైన్ పెట్రోలియం జెల్లీ

వాసలైన్ పెట్రోలియం జెల్లీ

పిల్లలకు దద్దుర్లు ఉన్న చోట వాసలైన్ పెట్రోలియం జేల్లీని సున్నితంగా రాయండి. ఇది దద్దుర్లను నయంచేసి, బాధను కూడా తగ్గిస్తుంది.

బేకింగ్ షోడ

బేకింగ్ షోడ

గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఈ నీటిని ఉపయోగించడం వల్ల మీ పిల్లల డైపర్ దద్దుర్ల వల్ల వచ్చిన నొప్పిని తగ్గించవచ్చు.

పెరుగు

పెరుగు

దద్దుర్లకు ఏదైనా వ్యాధి లేదా ఈస్ట్ కారణమైతే (పిల్ల/పిల్లాడికి, అలర్జీలు లేకపోతే) మీ బిడ్డకు పెరుగు తినిపించండి. ఈ పెరుగును పిల్లవాడికి దద్దుర్ల భాగంలో పూయడానికి ఒక రాష్ క్రీంగా కూడా ఉపయోగించవచ్చు.

చమోమిల్ టీ

చమోమిల్ టీ

మీ పిల్లవాడు స్నానం చేసే నీటిలో అనేక చమోమిల్ టీ సంచులను నానపెట్టండి. మీ పిల్లవాడికి ఈ నీటితో స్నానం చేయించండి. వొళ్ళు తుడవండి. బేకింగ్ సోడా లేదా కార్న్ స్టార్చ్ రాయండి. దీనికి ప్రత్యామ్నాయంగా, మీ శిశువు డైపర్ లో 2 చమోమిల్ టీ బాగ్ లను ఉంచండి. డైపర్ రాష్ తీవ్రంగా ఉన్నవారికి ఈ గృహ వైద్యం ఎంతో అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుంది.

ఓట్మీల్ తో స్నానం

ఓట్మీల్ తో స్నానం

స్నానం చేసే నీటిలో ఒక కప్పు ఓట్మీల్ ని కలపండి. ఈ నీటితో మీ శిశువుకు స్నానం చేయించండి. దీనివల్ల డైపర్ రాష్ వల్ల మీ పిల్లదిపై ఏర్పడిన దద్దుర్లు నయమవుతాయి.

ద్రాక్షపండు గింజల సారం

ద్రాక్షపండు గింజల సారం

డైపర్ రాష్ లకు ఇది మంచి గృహ వైద్యం. దీనిని దద్దుర్లపై నేరుగా అప్లై చేయాలి.

పాలు

పాలు

ఒక శుభ్రమైన గుడ్డను పాలలో నానపెట్టండి. పిల్లల కింది భాగంలో అద్దండి. డైపర్ వల్ల వచ్చిన దద్దుర్ల మంటను నయం చేస్తుంది.

పిండి

పిండి

ఒక పాన్ లో కొంత పిండిని తీసుకోండి. అది బ్రౌన్ రంగు వచ్చే వరకు, తక్కువ మంట మీద దాన్ని వేడిచేయండి. తరువాత చల్లర్చండి. దీనిని మీ పిల్లల కింది భాగంలో అప్లై చేయండి.

ముఖ్యమైన చిట్కాలు:

మీ పిల్లలకు దద్దుర్లు వచ్చిన ప్రాంతంలో సున్నితమైన సబ్బులను ఉపయోగించండి.

డైపర్ రాష్ నివారణకు సహజమైన వెలుగు, గాలి సహాయపడతాయి. అందువల్ల, మీ పిల్లలకు డైపర్ లు వేయకండి.

ప్రత్యేకంగా మీరు క్లాత్ డైపర్ లు వాడేటట్లయితే, విషపూరితం కాని లాండ్రీ డిటర్జెంట్ ను వాడండి.

దద్దుర్లు ఏర్పడ్డ ప్రాంతాన్ని సున్నితంగా శుభ్రం చేయండి. రుద్దకండి.

డైపర్ పాడైపోతే, వెంటనే దాన్ని మార్చండి.

English summary

12 Home Remedies for Clearing Diaper Rash

As a parent, it’s heartbreaking to see your baby crying due to inflammation caused by diaper rashes. Diaper rashes can occur when the baby is left with a soiled diaper for a very long time, or when you diaper your tot very tightly, which hinders the air flow.
Desktop Bottom Promotion