For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిశువులలో ఎదుర్కునే 8 సాధారణ చర్మ సమస్యలు

By Super
|

ఒక శిశువు చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన చర్మం మీద స్వల్పమైన గోకిన పుండ్లు లేదా దద్దుర్లుగాని ఏర్పడటంవలన చాలా చికాకు చెందుతుంటారు.

నవజాత శిశువుల చర్మమ మీద దద్దుర్లు రావటమన్నది సర్వసాధారణం మరియు వీటిలో చాలా రకాలు హానిచేయనివి అని గుర్తుంచుకోండి మరియు ఇవి వాటంతట అవే కొన్ని రోజుల లోపల అదృశ్యమవుతాయి. ఇక్కడ శిశువులలో వొచ్చే సాధారణమైన చర్మ సమస్యల గురించి చూద్దాం.

డైపర్ రాష్

డైపర్ రాష్

ఈ అనివార్య దద్దుర్ల వలన మీ శిశువు (మరియు మీరు ) రాత్రి అంతా మెలుకువగా ఉండవలసిరావొచ్చు. తరచుగా మీ శిశువు డైపర్ ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండండి.. ఎరుపు మచ్చలుగాని మరియు పుండ్లు పడడం వంటి వాటిని డైపర్ ప్రాంతంలో గుర్తించినట్లయితే,వెంటనే డైపర్ రాష్ క్రీమ్ పూయండి మరియు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాన్ని ఓపెన్ గా ఉంచండి. డైపర్ చాలా బిగుతుగా లేదా చాలా ప్రాంతం కప్పిఉంచలేదు అని నిర్ధారించుకోండి. డైపర్ ను తరచుగా మారుస్తుండండి మరియు అవసరమయినప్పుడు వెంటనే డైపర్ రాష్ క్రీమ్ ఉపయోగించండి.

బేబీ మొటిమలు

బేబీ మొటిమలు

మీ బిడ్డ మొహం మీద చిన్న మొటిమలు రావటం అన్నది సాధారణమైన ఉత్పాతము

మరియు సాధారణంగా కొన్ని రోజులలోనే ఇవి మాయమవుతాయి. వీటిమీద ఎటువంటి క్రీములు పూయవొద్దు.

పుట్టిన గుర్తులు

పుట్టిన గుర్తులు

ఇవి పిల్లలలో సర్వసాధారణం. ఇవి బిడ్డ పుట్టిన వెంతనేగాని లేదా కొన్ని వారాలు లేదా నెలల తరువాత కనిపిస్తుంటాయి.

తామర

తామర

ఉబ్బసం లేదా అలెర్జీలు యొక్క కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే ఈ .ఎర్ర దద్దుర్లు మరియు దురద ఉన్నతామర పిల్లలలో రావటం సర్వసాధారణం ఇది సాధారణంగా ముఖంప పైన కనిపిస్తుంటుంది కానీ మోచేతులు, ఛాతీ లేదా చేతులపైన కూడా కనిపిస్తుందన్న విషయం అందరికి తెలిసిందే మరియు క్రమంగా ఇది ఉన్న ప్రాంతమంతా పొడిబారి, పొలుసులుగా మారుతుంది. ఈ రకమైన ప్రతిచర్య సబ్బులు, లోషన్లు లేదా మీరు మీ బిడ్డ యొక్క బట్టలు శుభ్రపరచటానికి ఉపయోగిస్తున్నడిటర్జెంట్ వలన సంభవిస్తుంది.

పొడి చర్మం

పొడి చర్మం

చాలామంది నవజాత శిశువులు పొడి చర్మంతో జన్మిస్తారు. పొడిచర్మం ఉండటంవలన చర్మం పోట్టులాగా రాలిపోతుంది. ఈ లక్షణం సర్వసాధారణంగా కొద్దిరోజుల్లోనే ఆగిపోతుంది. కాని అలా ఆగకపోతే ఏదైనా మందు కొరకు చిన్నపిల్లలా వైద్యుడిని సంప్రదించండి.

చెమటకాయల దద్దుర్లు

చెమటకాయల దద్దుర్లు

ఈ చిన్న గులాబీ ఎరుపు మచ్చలు చెమట పట్టడం వలన ఏర్పడతాయి మరియు ఇవి ఎక్కువగా మెడ, డైపర్ ప్రాంతం మరియు చంకలలో కనిపిస్తాయి.. మీ శిశువుని చల్లగా మరియు సాధ్యమైనంత పొడిగా ఉంచండి మరియు అతని / ఆమెకు వదులుగా ఉన్న మెత్తని నూలు దుస్తులు వేయండి. మీ శిశువు యొక్క చర్మంపై పౌడర్ ఎక్కువగా వేయకండి - పౌడర్ లో ఉన్న చిన్నచిన్న రేణువులు శిశువులు పీల్చటం వలన వారికి అసౌకర్యం కలుగవచ్చు. బేబీ కనీసం నాలుగు నుంచి ఆరు నెలల వయస్సు వొచ్చే వరకు పౌడర్ వేయటం నివారించండి.

వైట్ బొప్పులు

వైట్ బొప్పులు

వీటిని మిలియా అని కూడా పిలుస్తారు, ఈ చిన్న తెల్లని మచ్చలు ముక్కు మీద చూడవొచ్చు మరియు ఇవి ముక్కు మీద చర్మం పొరల మీద ఉన్న నూనె గ్రంధులు మూసేఉండటంవలన ఏర్పడతాయి. ఈ గ్రంధులు తెరుచుకోవటం వలన ఈ మచ్చలు సాధారణంగా కొన్ని రోజుల తరువాత అదృశ్యం అవుతాయి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్లు

ఈస్ట్ ఇన్ఫెక్షన్లు

శిశువుకు యాంటీబయాటిక్స్ వాడినట్లయితే ఆ శిశువు ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది. పిట్ట నాలుక మరియు నోటిపై ఏర్పడిన పుండులాగా, ఈ ఈస్ట్ డైపర్ రాష్, టమోటా ఎరుపురంగులో ఉండి, అంచుల వద్ద చిన్న ఎరుపు మొటిమలతో ఉంటుంది. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడండి.

ఏమి గుర్తుంచుకోవాలంటే

ఏమి గుర్తుంచుకోవాలంటే

మీ శిశువు లాండ్రీ అన్నిటిని శుభ్రపరచటానికి చాలా తేలికపాటి డిటర్జెంట్-ఉపయోగించండి. దిండు కవర్లు, కదా, దుప్పట్లు మరియు తువ్వాళ్లు విడివిడిగా శుభ్రపరచండి. రంగులు, సువాసనలు, ఫ్తలతెస్ మరియు పరబెన్స్ ఉన్న శిశువు చర్మసంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయవొద్దు - శిశువుకు సున్నితమైన చర్మానికి ఇవి చికాకు కలిగించవచ్చు. బేబీ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిని స్నానికి ఉపయోగించండి. బేబీ స్నానం తర్వాత.తన చర్మం పొడిబారకుండ చర్మానికి లోషన్ రాయండి.

దద్దుర్లు నిరోధించడానికి రోజులో అనేక సార్లు డైపర్ మార్చటం అవసరం. అలాగే దద్దుర్లు.నిరోధించడానికి రాత్రి సమయంలో ఒకసారి లేదా రెండుసార్లు డైపర్ మార్చండి. ఒక ఇటీవల అధ్యయనం-ప్రకారం, శరీరం మసాజ్ చేయటం శిశువులకు చాలా మంచిది అని తేలింది. సున్నితంగా నూనెతో మీ శిశువు చర్మం మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన మీ శిశువు రిలాక్సేషన్ పొందటమే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మరియు మంచి నిద్రకు కూడా ఉపక్రమిస్తారు.

English summary

8 Common skin problems in babies

A baby's skin is so delicate that even a slight scratch or rash is known to
 make them very irritable.
Story first published: Saturday, June 28, 2014, 12:40 [IST]
Desktop Bottom Promotion