For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లలకు ఎలా స్నానం చేయించాలి: ఈజీ టిప్స్

|

చిన్నతనంలో పిల్లలకి తల్లులే స్నానం చేయిస్తారు. చాలా మంది తల్లులు ప్రతి రోజూ తాము నిర్వహించే విధులతోబాటు ఇది కూడా ఒక డ్యూటీ అన్నట్లుగా గబగబా ఈ కార్యక్రమం ముగిస్తుంటారు. కొంత మంది తల్లులు మాత్రం డ్యూటీ మైండెడ్‌గా కాకుండా తమపిల్లలతో ఆడుతూ, పాడుతూ మురిపెంగా కొద్దిసేపు గడపడానికి స్నానం చేయించే సమయాన్ని ఎంచుకుంటారు.

బాత్‌టైమ్‌ని ఫన్‌టైమ్‌గా ఎలా మార్చు కోవాలి

బబుల్స్‌

బబుల్స్‌

పిల్లలకి బబుల్‌బాత్‌ (నురగ స్నానం) ఎంతో బాగుంటుంది. స్నానం చేయించేటప్పుడు బాత్‌టబ్‌ లేకపోతే పిల్లలు కూర్చోవడానికి అనువుగా వుండేటబ్‌ని తీసుకోవాలి. దీన్ని నురగ నీటితో నింపాలి. పిల్లల చర్మానికి హాని కలిగించని సబ్బులు, ఆయిల్‌లనే ఉపయోగించాలి. అసాధారణ మైన, వాసన, రంగులేనివి చూసిఉపయోగిం చాలి.పిల్లలను ఎనర్జిటిక్‌, స్పోర్టివ్‌గా తయారుచేయడానికి బబుల్‌బాత్‌కి థెరెప్యూ టిక్‌ బాత్‌ని కలపాలి. బబుల్‌ బాత్‌కి సంబం ధించినన్ని రకాల సీసాలున్నాయో వాటిన న్నిటినీ టబ్‌కి అందుబాటులో ఉంచు కోవాలి. పిల్లలను అడిగి వాళ్ళుచూపిం చిన దానితోనే స్నానం చేయించాలి. ఆ తర్వాత నుండి టబ్‌ దగ్గర చేసే ఏర్పాట్లలో వాళ్ళు మీకు సహాయపడతారు.

ఎసెన్షియల్‌ ఆయిల్‌

ఎసెన్షియల్‌ ఆయిల్‌

లవెండర్‌ లేదా క్యామోమైల్‌ ఎసెన్షియల్‌ తీసుకుని రెండు చుక్కల ఆయిల్‌ పిల్లలకి స్నానం చేయించే నీళ్ళలో వేస్తే అలసట దూరమై రోజంతా వారు తాజాగా వుంటారు. వాసనలేని తేలిక బబుల్‌టబ్‌ బాత్‌లో కొన్ని చుక్కల ఎసెన్షి యల్‌ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు.

వెచ్చని దుస్తులు

వెచ్చని దుస్తులు

చలికాలంలో పిల్లలు వేడి నీటితో స్నానంచేసి బయటకురాగానే వెచ్చటి టవల్‌, వెచ్చగాఉన్న దుస్తులు తొడిగితే వారిలోకలిగే ఆనందం అంతా ఇంతాకాదు.

ఇష్టమైనపాట

ఇష్టమైనపాట

పిల్లలు బాత్‌టబ్బులో కూర్చునినీళ్ళనుచేతితో కొడుతూ ఆట మొదలుపెట్టగానే వాళ్ళకి ఇష్టమైనపాట పాడాలి. అదివాళ్ళకి మంచిహుషారు నిస్తుంది. వాతావరణం ఎంతో సరదాగా వుంటుంది.

బాత్‌ టాయిస్‌

బాత్‌ టాయిస్‌

ఇంట్లో బాత్‌ టాయిస్‌ని తప్పనిసరిగాకొని పెట్టండి. కొంతమంది పిల్లలు వంట ఇంటి సామాన్లతో ఆడుకుంటారు. పిల్లలకి వంటింటి సామాన్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే బొమ్మలు కొనిపెట్టండి.

బ్లోయింగ్‌ బబుల్స్‌

బ్లోయింగ్‌ బబుల్స్‌

బాత్‌రూమ్‌లో బబుల్‌ బ్లోయింగ్‌ మిక్చర్‌తో బబుల్స్‌ బ్లో చేయాలి. అప్పుడు మీ చిన్నారి కళ్ళలోని మెరుపును చూసి తీరాల్సిందే.

లాంగ్వేజ్‌ బాత్‌

లాంగ్వేజ్‌ బాత్‌

వారానికి ఒకసారి బాత్‌ టైమ్‌ ని లాంగ్వేజ్‌బాత్‌గా మార్చు కోవాలి. పిల్లలతో ఆడుతూ స్నానంచేయిస్తూనే వారికి కొత్తకొత్త మాటలు నేర్పించాలి. పిల్లలు పెద్ద వాళ్ళవుతే బాత్‌రూమ్‌ తలుపులు ముసుకుని వారికిష్టమైనట్లుగా స్నానం చేస్తారు. కాబట్టి వాళ్ళకి స్నానంచేయించే వయస్సులో వారి తో ఆనందంగాగడిపి దానిని మధురస్మృతి గా మలచుకోండి. పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత ఈ విషయాలు చెపుతుంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు.

English summary

Giving A Baby A Bath:Tips For New Parents

The main concern for new parents is to keep their little one clean and smelling sweet. No doubt, babies do not sweat for them to smell bad, but a regular sponge bath is necessary. Giving a baby a bath early in the morning is better than later during the day. While giving a newborn a bath, parents are worried as to how to prevent their child from crying when giving them a bath.
Story first published: Tuesday, September 9, 2014, 17:25 [IST]
Desktop Bottom Promotion