For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శిశువుకు పూర్తి బాడీ మసాజ్ చేయటానికి 10 దశలు

By Super
|

మసాజ్ అనేది మీ బిడ్డ సంరక్షణకు వెచ్చగా మరియు ప్రేమను అందించటానికి మనోహరమైన మార్గం అని చెప్పవచ్చు. ఇది సౌకర్యవంతంగా ఉండి శిశువు నిద్రకు సహాయపడుతుంది. ఈ సున్నితమైన మసాజ్ యొక్క లయబద్ధమైన మరియు ఉపశమనం కలిగించే స్ట్రోకులు మీ శిశువులో 'మంచి ఫీల్' హార్మోన్ ఉత్పత్తి ఉద్దీపనకు సహాయపడతాయి. పిల్లలకు ఈ మసాజ్ ఒక ప్రశాంతమైన స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శిశువును రిలాక్స్ చేస్తుంది. అలాగే మీకు మరియు మీ శిశువు మధ్య పెరుగుతున్న బంధాన్ని బలోపేతం చేస్తుంది.

How to Give Your Baby a Complete Body Massage in 10 Steps

1. కాళ్ళు
అతడు/ఆమె కాళ్ళ నుండి బిడ్డ మర్దన ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇతర శరీర భాగాలతో పోల్చితే కాళ్ళు తక్కువ సున్నితంగా ఉంటాయి. మీ రెండు చేతులలో నూనెను తీసుకోని తొడల చుట్టూ మసాజ్ చేయాలి. బిడ్డ కాలును మీ చేతులతో నొక్కడంతో పాటు సున్నితంగా లాగాలి. ఒక కాలు నుండి మరొక కాలుకి మారండి. అలాగే రుద్దడం పునరావృతం చేయండి.

2. పాదాలు
చేతిలోకి ఒక పాదం తీసుకొని 4-5 సార్లు ప్రతి దిశలో సున్నితంగా రొటేట్ చేయాలి. తరువాత కాలి క్రింద చీలమండ నుండి స్ట్రోక్ ఇవ్వాలి. తర్వాత రెండో పాదమును కూడా అదే విధంగా చేయాలి.

3. అరికాళ్ళు
మీ బ్రొటనవేళ్లను ఉపయోగించి అరికాళ్ళ మీద వృత్తాలుగా మసాజ్ చేయాలి.

4. కాలివేళ్ళు
శిశువు యొక్క బ్రొటనవ్రేలు మరియు మిగతా నాలుగు వ్రేళ్ళు కలిపి మొత్తం అన్ని వ్రేళ్ళను సున్నితంగా మీ వ్రేళ్ళతో లాగండి. రెండో కాలివేళ్ల కోసం రిపీట్ చేయండి.

5. భుజం
మీ చేతుల్లోకి బిడ్డ చేయి ఒకటి తీసుకోని చంక నుండి మణికట్టు వరకు పాలు పితికే కదలికతో మసాజ్ చేయండి. ఆ తర్వాత సున్నితంగా ప్రతి దిశలో చేతి యొక్క మణికట్టును 4-5 సార్లు రొటేట్ చేయండి. చేతిని మార్చి పునరావృతం చేయండి.

6. చేతులు
మీ అరచేతులు మరియు మీ బ్రొటనవేళ్లను వృత్తాలుగా మసాజ్ చేయటానికి ఉపయోగించండి.

7. చేతి వేళ్లు
మీ రెండు చేతులతో బిడ్డ యొక్క చేతి నాలుగు వ్రేళ్ళు మరియు బ్రొటనవ్రేలును పట్టుకొని క్రిందికి లాగాలి.

8. ముఖం మరియు తల
మీ చేతులలో శిశువు తల వెనుక భాగంలో పట్టుకోండి. తరువాత నెత్తిమీద చర్మం మీద మృదువుగా మరియు శాంతముగా మీ చేతివేళ్లతో స్ట్రోక్ ఇవ్వండి. ఆమె/అతని కనుబొమ్మలు,మూసుకున్న కళ్ళు మరియు దాని బుగ్గలు గుండా నాసిక వరకు స్ట్రోక్ ఇవ్వండి. తరువాత శిశువు యొక్క చెవి భాగంలో రుద్దాలి. దవడల క్రింద సున్నితంగా చిన్న సర్కిల్ల్లో మసాజ్ చేయాలి.

9. ఛాతీ
శిశువు గుండె మీద ప్రార్థన స్థితిలో మీ చేతులను ఉంచండి. ఇప్పుడు మీరు మూసి ఉన్న చేతులను తెరిచి నెమ్మదిగా బయట మరియు బిడ్డ యొక్క ఛాతీ మీద తేలికగా అరచేతులతో స్ట్రోక్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ అనేక సార్లు పునరావృతం చేయాలి.

10. వీపు
వీపు మీద మసాజ్ కోసం శిశువుని బోర్లా పడుకోబెట్టాలి. మెడ నుండి క్రిందికి వెన్నెముక ఇరువైపులా శిశువు పిరుదు వరకు మీ వేళ్లతో వృత్తాలుగా మసాజ్ చేయండి.

English summary

How to Give Your Baby a Complete Body Massage in 10 Steps

Massage is warm and lovely way to convey your love and care to your baby. It comforts and helps the baby to sleep. Not just baby, you too will find it relaxing. The gentle, rhythmic and soothing strokes of massage stimulate the production of ‘feel-good’ hormone in your baby, in you, and also in your partner if he is watching.
Story first published: Saturday, May 10, 2014, 10:33 [IST]
Desktop Bottom Promotion