For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీస్ కోసం సాధారణ ఆహార షెడ్యూల్

By Super
|

బేబీస్ ముఖ్యంగా మొదటి కొన్ని నెలల్లో తినడం మరియు నిద్ర వంటివి యాంత్రికంగా కనిపిస్తాయి. మీ శిశువుకు ఫీడింగ్ బలవంతంగా కాకుండా అవసరం అయినప్పుడు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ లేదా సీసా ఫీడ్ చేయటం ఉత్తమ మార్గం. ఒక సంభావ్య సమస్య ఉంటే మీ బిడ్డ యొక్క ఆహారపు అలవాట్లు సాధారణంగా ఉంటే లేదా ప్రతి ఫీడింగ్ సహాయం కోసం ఫ్రీక్వెన్సీ మరియు సాదారణ మార్గదర్శకాలను నిర్ణయించుకోవాలి.

ఆకలి వేసినప్పుడే పాలు ఇవ్వాలి
తింటే చాలు....ఎదుగుదల సూపర్!:క్లిక్ చేయండి
మీ బిడ్డ ఆకలి వేసినప్పుడు సూచించే ఆకలి సంకేతాలను అర్థం చేసుకోవాలి. ఆకలి వేస్తుందని మీ శిశువు యొక్క ముఖ కవళికల ద్వారా అనుసరించి దృఢ షెడ్యూల్ వేసుకోవాలి. మీరు అతి ఆకలి అయ్యే దాక మీ శిశువుకి ఆహారం ఇవ్వకుండా వేచి ఉండకూడదు. అంతేకాక ఆకలితో లేనప్పుడు అతనికి ఆహారం ఇవ్వటానికి ప్రయత్నించకూడదు. మీ బిడ్డ ఆకలితో ఉన్నాడని అతను పీల్చటం ద్వారా వచ్చే కదలికలు లేదా నోటి నుండి వచ్చే కదలికలు ద్వారా తెలుసుకోవచ్చు. అతను రొమ్ము లేదా సీసాను కనుగొనేందుకు చుట్టూ వెతకటం ప్రారంభం కావచ్చు. చివరికి ఏడుపు ఆకలికి సంజ్ఞ అవుతుంది. అతని ఏడుపు నిరాశ దశలోకి చేరక ముందే మీ బేబీ ఫీడింగ్ ను సులభంగా పరిష్కరించాలి.

normal eating schedule for babies

ఫ్రీక్వెన్సీ

మీ శిశువు వయస్సు తరచుగా ఆమె తినే ఆహారం మీద ప్రభావం చూపుతుంది. ఇది పాత పిల్లల కంటే జన్మించిన శిశువుల్లో తరచుగా ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి అంటే 24 గంటల కాలంలో 8 నుంచి 12 సార్లు ఆహారం ఇవ్వాలి. ఫార్ములా ఆధారిత పుట్టిన పిల్లల కోసం ఫీడింగ్ మధ్య సమయం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రొమ్ము పాలు కంటే ఫార్ములా పాలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. మీ శిశువు పెద్దగా అయ్యే కొద్ది ఫీడింగ్ మధ్య సమయం క్రమంగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత ఎక్కువ మంది పిల్లలు రోజుకు నాలుగు నుంచి ఆరు సార్లు ఆహారం పెడితే సరిపోతుంది. ఎందుకంటే వారు కొంత ఘన ఆహారాల మీద ఆధారపడతారు.
పిల్లలు తినే ఆహారం ఎలా వుండాలి?:క్లిక్ చేయండి
మొత్తం పరిమాణం
సాదారణంగా అప్పుడే జన్మించిన శిశువుల్లో ఫీడింగ్ 2 నుంచి 3 ఔన్సుల వద్ద మొదలుపెట్టాలి. అప్పుడే జన్మించిన శిశువు యొక్క కడుపు చిన్న పరిమాణంలో ఉండుట వలన తరచుగా చిన్న మొత్తంలో ఫీడ్ చేయాలి. అతనికి 1నెల వయస్సు వచ్చాక 4 నుంచి 6 ఔన్సుల ఫీడింగ్ ఎక్కువ సార్లు అవసరం అవుతుంది. 6 నెలల వయస్సు వచ్చాక 24 నుంచి 30 ఔన్సుల ఫీడింగ్ తరచుగా నాలుగు నుండి ఆరు సార్లు అవసరం అవుతుంది. తల్లి పాలు త్రాగే పిల్లలు ఎన్ని పాలు త్రాగేరో చెప్పటం కష్టం. అప్పుడే జన్మించిన శిశువుకు తల్లి పాలు త్రాగటానికి 20 నిమిషాల సమయం పట్టవచ్చు.

చిట్కాలు

సహజ ఫీడింగ్ షెడ్యూల్ను స్ఫూర్తిని పొందడానికి మీ శిశువు యొక్క కవళికలను అనుసరించండి. ఈ షెడ్యూల్ మొదటి సంవత్సరం పలు సార్లు మారవచ్చని గుర్తుంచుకోండి. శిశువు ఆహారం అడిగినప్పుడు సరైన ఆహారం ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. మీ శిశువుకు ఆకలి అకస్మాత్తుగా తగ్గుట,బరువు పెరుగుట తగ్గుట,డైపర్ తక్కువ తడి ఉండుట వంటివి పెద్ద వైద్య సమస్యలు కావని నిర్ధారించడానికి ఒక శిశువైద్యుడుని సంప్రదించండి.

English summary

normal eating schedule for babies

Babies seem like eating and sleeping machines, especially in the first few months. Feeding your baby on demand is often the best way to ensure she gets the amount of food she needs, whether you breastfeed or bottle feed.
Desktop Bottom Promotion