For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ యొక్క చెవులు సేఫ్ గా శుభ్రం చేయడానికి చిట్కాలు

By Mallikarjuna
|

సురక్షితంగా మీ బేబీ యొక్క చెవులు శుభ్రం చేయడానికి చిట్కాలు

కొన్ని సందర్భాల్లో చాలా సాధారణ విషయాలు కూడా క్లిష్ట సమస్యగా ఏర్పడుతుంది. అటువంటి వాటిలో చిన్న పిల్లకు చెవులు శుభ్రం చేయడం. చిన్నపిల్లల్లో చేవులు శుభ్ర చేయడం వల్ల చెవిలో గుబిలి తొలగించడం మాత్రమే కాదు, కానీ చెవిలో ముడుతలు ఏర్పకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం చాలా ముఖ్యమైన విషయం. ఇయర్ వాక్స్ చెవులు ఇన్ఫెక్షన్స్ కాకుండా మరియు చెవులకు ఎటువంటి వినికిడికి ప్రభావం కాకుండా ఇయర్ వాక్స్ వాడటం మనకు అర్ధ అవుతుంది. అయితే, ఇయర్ వాక్స్ సాధారణంగా చెవిలోపల క్రిములను మరియు ఫారిన్ బాడీస్ ను చెవిలోప నుండి బయటకు నెట్టివేస్తుంది . అయితే, శిశువు చెవిలో మరింత గుబిలి చెవిలో ఏర్పడుతుంటే, వైద్యుడని తప్పకుండా సంప్రదించడం ఉత్తమం.

బాగా అనుభం ఉన్న వైద్యుని కలిసి, ఇయర్ వ్యాక్స్ ను తొలగించాలి మరియు బేబీ యొక్క చెవులను మరింత శుభ్రపరచాలి . బేబీ చెవులను శుభ్రం చేయడానికి మీరు క్యూ టిప్స్ ఉపయోగించకూడదు, ఇది బేబి చెవులకు మరింత రిస్కీగా మారుతుంది. బేబీ చెవులను శుభ్రం చేసేటప్పుడు తీవ్రమైన సమస్యకు దారితీయవచ్చు. బేబీ చెవులను శుభ్రం చేయడానికి అక్రమ పద్ధతిని ఉపయోగించడం వల్ల వినికిడి కర్ణబేరి బ్రేకేజ్ అవ్వడం మరియు చెవులు వినపడకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి , బేబి యొక్క చెవులను శుభ్రపరచడానికి ఒక అదనపు సంరక్షణ మరియు సహనం కలిగి ఉండటం చాలా అవసరం. బేబి యొక్క చెవులను శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి . ఈ చిట్కాలు బేబీ చెవులను మరింత శుభ్రపరిచేందుకు సహాయపడుతాయి.

Tips To Clean Your Baby's Ears Safely

స్నానం చేయించే సమయంలో చెవులను శుభ్రపరచడం: బేబీ చెవులను శుభ్రపరచడానికి స్నానం చేయించే సమయం చాలా మంచిది. బేబీ యొక్క చెవులు తేమగా ఉన్నప్పుడు చెవులను శుభ్రం చేయడం మరింత సులభం అవుతుంది. ఒక తడి వస్త్రాన్ని తీసుకొని చెవి భాహ్యభాగంను శుభ్రం చేయండి . తర్వాత చెవిలోపలి వైపు, ఒక పొడి వస్త్రంతో శుభ్రం చేయండి.

గోరువెచ్చని వస్త్రంతో తుడవడం: మీ శిశువుకు స్నానం చేయించే సమయంలో, వారి చిట్టి చెవులను గోరువెచ్చని వస్త్రంతో తుడవాలి . ఇలా రెగ్యురల్ గా చేయాలి, బేబీ యొక్క చెవులను శుభ్రపరచడానికి ఇంత మాత్రం చేస్తే చాలు . ఇది చెవిలోపల చేరిన అన్ని డెడ్ సెల్స్ మరియు గుబిలిని తొలగిస్తుంది .

ఏదూదిని ఉపయోగించికూడదు: మీరు శిశువు చెవులను శుభ్రపరచడానికి చెవులను పత్తితోశుభ్రం చేయకూడదు. బేబీ చెవుల శుభ్రపరచడానికి చిట్కాలు నిర్దిష్ట ఉన్నాయి , మీరు శిశువు చెవులు లోతుగా ఏదైనా లోపలికి జొప్పించి శుభ్రం చేయకూడదు. ఇది కర్ణబేరిని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఇది మరింత సమస్యకు గురిచేస్తుంది.

ఇయర్ డ్రాప్స్ : కొన్ని సార్లు, బేబీ చెవులను శుభ్రం చేయడం పనిచేయకపోవచ్చు , మీ బేబీ చెవుల్లో గుబిలి పేరుకుపోయినప్పుడు,అటువంటి పరిస్థితుల్లో ఇయర్ డ్రాప్స్ ను ఉపయోగించాలి . బేబీ చెవుల్లో ఎటువంటి ఇయర్ డ్రాప్స్ ను ఉపయోగించే ముందు మీ డాక్టర్ ను సంప్రధించి సలహా కోరుడం చాలా ముఖ్యం .

స్వయంగా మందులు వేయడానికి ప్రయత్నించకండి: సామాన్య ప్రజలు బేబీ యొక్క చెవులను శుభ్రం చేయడానికి ఎటువంటి వైద్య పద్దతులను అనుసరించకుండా కొన్ని సాధారణ టెక్నిక్స్ ను ఉపయోగిస్తారు . అటువంటి వైద్య పద్దతులు పాటించకపోతే మీ బేబీ యొక్క చెవులకు హాని కలుగుతుంది . అది ఇతర ఇన్ఫెక్షన్స్ కు కారణం కావచ్చు . మీరు ఏవైన ఇబ్బందులు కనుగొన్న వెంటనే వైద్యుడుని సంప్రదించడం చాలా అవసరం.

పొడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయకండి: బేబీ చెవులు పొడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయడానికి ప్రయత్నించకండి. అది స్కిన్ ఇరిటేషన్ మరియు స్ర్కాచెస్ కు కారణం కావచ్చు. వెట్ క్లోత్ ను ఉపయోగించి మీ బేబీ యొక్క చెవులను శుభ్రపరచండి. బేబీ ఇయర్స్ శుభ్రం చేయడానికి ఒక మోస్ట్ ఎఫెక్టివ్ టిప్ ఏంటంటే, స్నానం చేయించే సమయంలో శుభ్రపరచడం.

జాగ్రత్తగా ఉండాలి: బేబీ చెవులను శుభ్రపరచడానికి వారు పూర్తిగా మీకు సహకరించకపోవచ్చు, తర్వాత ప్రయత్నించండి . ఏమైనా సరే బేబీ చెవులను శుభ్రపరచడానికి కాస్త జాగ్రత్తగా ఉండాలి . మీరు శుభ్రం చేసే సమయంలో ఏ సెకెండ్లో అయినా వారు తలను ఇటు అటు కదిలించవచ్చు. కాబట్టి కాస్త అదనపు జాగ్రత్త అవసరం. అలాంటప్పుడు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు.

Story first published: Monday, January 6, 2014, 20:03 [IST]
Desktop Bottom Promotion