For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిపిల్లల్లో కడుపునొప్పి కారణాలు-లక్షణాలు: నివారణ చర్యలు

|

కడుపునొప్పి వస్తే పెద్దవారే తట్టుకోలేరు. అలాంటిది ఇంకా మాట్లాడటం రానీ ఏడాది పిల్లలకు కడుపునొప్పి వస్తే ఎలా?పిల్లలకు కడుపునొప్పి రావటానికి గల కారణాలు ఏంటి? నొప్పి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి? ఇలాంటి సందేహాలు పసిపిల్లలున్న ఇంట్లో చాలా మందికి వస్తుంటాయి.

పసిపిల్లల్లో కడుపునొప్పి రావడానికి చాలా కారణాలుంటాయి. ఆహారపు అలవాట్లు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆహారపు అలవాట్లు వలనే మూత్రపిండాల్లో రాళ్ళు తయారవడం, ఇన్ఫెక్షన్లు ఏర్పడటం, నులిపురుగులు తయారవడం జరుగుతుంటాయి. కాబట్టి, పిల్లలకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆహారం తీసుకోవడంలాంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పిల్లలకు కడుపు నొప్పి పదే పదే వస్తున్నా, రాత్రిళ్ళు వచ్చిన నొప్పి ఎక్కువ సేపు ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి.

కారణాలు: కలుషిత ఆహారం తీసుకోవడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, నులిపురుగులు తయారవడం, ఇన్ఫెక్షన్లు కలగడం, అపెండిసైటిస్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, పిత్తాశయంలో రాళ్లు తయారవడం, హెర్నియా, ట్రాన్సిల్స్ ఇన్ ఫెక్షన్స్,జాండిస్ రావడానికి ముందు, టైఫాయిడ్, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్, అమీబియాసిస్, జియాడియాసిస్, హైపర్ ఎసిడిటి, ఐబ్యూఫ్రొఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం వంటివి కడుపునొప్పి రావటానికి ప్రధాన కారణాలు. కొందరు పిల్లలు స్కూలుకు వెళ్ళవలిసి వస్తుందనే నెపంతో కడుపునొప్పి వస్తున్నట్లుగా చెబుతుంటారు. దీన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గా తీసుకోవాల్సి ఉంటుంది.

Tips To Cure Stomach Pain In Babies

కడుపునొప్పి లక్షణాలు: సాధారణంగా పిల్లల్లో కడుపునొప్పి వచ్చిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నొప్పి ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా రాత్రిళ్ళు కడుపు నొప్పి వస్తుండటం, నొప్పితో పాటు వాంతులు అవుతుండటం, మూత్రంలో మంట విరేచనాలు ఉంటే ఏమాత్రం అజాగ్రత పనికిరాదు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని డాక్టర్ ను కలవాలి. కడుపు నొప్పి కుడి పక్కన కింది భాగంలో, బొడ్డు చుట్టూ వచ్చి కిందకి పాకినా, నడుంభాగంలో ముందుగా మొదలై ముందుకు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అపెండిసైటిస్, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా ఈ రకమైన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

తీసుకోవల్సిన జాగ్రత్తలు:

1. భోజంన చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
2. చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోవాలి.
3. బాగా ఉడకబెట్టిన ఆహారంను మాత్రమే తీసుకోవాలి.
4. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
5. ప్రతి రోజూ 6-8గ్లాసుల నీరు తీసుకోవాలి.
6. వేడి వేడి ఆహారాన్ని మాత్రమే భుజించాలి.
7. టైఫాయిడ్, జాండిస్ నిరోధక వ్యాక్సిన్లను పిల్లలకు తప్పకుండా వేయించాలి.
8. 1-5సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి 6నెలలకొకసారి డివార్మింగ్ మెడిసిన్ ఇవ్వాలి.
9. నొప్పి నివారణకు మాత్రలను వాడటం తగ్గించాలి.
10. ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మల, మూత్ర విసర్జన అనంతరం శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.

English summary

Tips To Cure Stomach Pain In Babies


 As a baby can't speak to you, it becomes really difficult to understand if the child is in pain. Very often, a baby suffers from stomach pain. You only come to know when the baby cries a lot or when you visit a doctor to check what happened.
Story first published: Wednesday, July 23, 2014, 17:13 [IST]
Desktop Bottom Promotion