For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కవలల గురించి మీకు తెలియని 5 విషయాలు

By Super
|

కవల పిల్లలెప్పుడూ ఆశ్చర్యకరమే.వారు అలా ఎలా ఒకేలా ఉంటారు అని చాలా మందికి కుతూహలం మరియు అంతుచిక్కని మిస్టరీ కూడా. కవల పిల్లల జననం వెనక ఉన్న మిస్టరీ, వారి గురించి ఉన్న అపోహల గురించి చూద్దాము

 kids

1)ఒక అబ్బాయి అమ్మాయి ఐడెంటికల్ ట్విన్స్(ఏకరూప కవలలు) అవుతారా??

ఒక్క ముక్కలో చెప్పాలంటే "కాదు". సాధారణ ప్రజానీకానికి ఏక రూప కవలలు అనే పదం గురించి సరైన అవగాహన లేదు."ఏక రూప" అంటే కవలలు ఎలా ఆక్రుతి దాలుస్తారు అనే కానీ వాళ్ళు ఎలా కనపడతారు అని కాదు. ఏక రూప కవలలెప్పుడూ ఇద్దరూ ఆడ లేదా ఇద్దరూ మగ అయ్యి ఉంటారు తప్ప ఒక ఆడ ఒక మగ ఉండరు. రెండు వేరు వేరు అండాలు రెండు వీర్య కణాలతో ఫలదీకరణం చెందితే ఫ్రాటర్నల్ ట్విన్స్(సోదర భావ కవలలు) రూపుదాలుస్తారు.

2)కవలల జనన తేదీలు వేరు గా ఉండే అవకాశం

కవలలంటే ఒకే గర్భం నుండి ఒకే సమయం లో వచ్చిన వాళ్ళని అర్ధం. అలా అని ఇద్దరూ ఒకే రోజు అవ్వాలని లేదు. కొద్ది నిమిషాల తేడాతో ఇద్దరి జననం ఉంటుంది ఒక్కోసారి.

3)కవలలు ఏర్పడటానికి జన్యుపరమైన కారణాలు లేదా కుటుంబ చరిత్ర కి సంబంధం

కవలలు పుట్టడానికి జన్యుపరమైన సంబంధం ఉంది. తల్లి కనుక రెండు అండాలు విడుదలయ్యే చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్లయితే "ఫ్రేటర్నల్ ట్విన్స్(సోదరభావ కవలలు)" పుట్టే అవకాశం ఉంది.ఏక రూప కవలల జననం యాద్రిచ్చికమే తప్ప దానికి ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు

4)కవలల రహస్య భాష

కవలలౌ ఒక రహస్య భాష ని కలిగిఉంటారు అన్నది అపోహ మాత్రమే. "క్రిప్టో ఫేషియా","ఇడియోగ్లోషియా" అనే పదాలు కవలల భాష యొక్క భావాన్ని వర్ణిస్తాయి. ఇది కవలలు ఒకళ్ళని ఒకళ్ళు అనుకరించడం లేదా మిగతా పసిపిల్లలు ముద్దు మాటల్లాంటిదే. వీటి వల్ల కవలలు తమ మధ్య బంధాన్ని ఏర్పరచుకుని భావ వ్యక్తీకరణని మెరుగుపరచుకోవడమే.

5)ఇద్దరి వేలిముద్రలు

ఏకరూప కవలల వేలి ముద్రలు ఒకేలా ఉండవు కానీ ఇద్దరి జన్యు నిర్మాణం ఒకలాగే ఉంటుంది. ఒక బఠాణీకాయ లోని రెండు గింజలవలే ఉన్న వారి డీ ఎన్ యే ని విడదీయలేము.

English summary

5 Facts about Twins You might not Know: Pregnancy Tips in Telugu

Twin babies are intriguing. They have been a source of curiosity and mystery to many. People carry many myths regarding twins. Let’s know, and discover these mysteries and misconceptions about twin babies and answer them-
Desktop Bottom Promotion