For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపాయికి డైపర్ వాడుతున్నారా.?రాషెస్ రాకుండా ఈ జాగ్రత్తలు

|

అనేక మంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం డిస్పోజబుల్ డైపర్ లను సులభంగా ఉపయోగించటం చూస్తున్నాము. అత్యధిక శోషణ గుణం గల డైపర్స్ ఉపయోగించడం వలన బయటకు వెళ్ళిన సమయంలో మరియు రాత్రి సమయంలో చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ ఈ డైపర్స్ తో ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అత్యధిక శోషణ గుణం గల డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించే పిల్లలకు డైపర్ రాష్ అనేది చాలా సాధారణ సమస్యగా ఉన్నది. సాధారణంగా డైపర్ ఉపయోగించే పిల్లలకు తరచుగా డైపర్ దద్దుర్లు ఏర్పడతాయి.

డైపర్ రాష్ మంటను తగ్గించటానికి సహజ నివారణలను ఉపయోగించి ఉత్తమ చికిత్సలను ఎంపిక చేసుకోవాలి. డైపర్ రాష్ చికిత్స ప్రారంభంలోనే నిరోధించటం చాలా ముఖ్యం. ఎందుకంటే అంటువ్యాధులు మరియు వాపుల వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మూత్రం మరియు మలం స్థిరంగా లేక అధ్వాన్నంగా మారుతుంది. ఇక్కడ ఈ చర్మం తక్కువ రక్షణ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. అందువలన ఇన్ఫెక్షన్ల వంటి వాటి మీద తక్కువ ప్రభావవంతమైన అవరోధం కలిగిస్తుంది. మీ శిశువు డైపర్ రాష్ పొందినప్పుడు,ఆ ప్రాంతంలో పొడిగా ఉంచుకోవడం అనేది మీరు గుర్తుంచుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.

డైపర్ రాష్ మంట మరియు మీ శిశువు యొక్క సున్నితమైన చర్మం కొరకు సహజ నివారణలు ఉత్తమ ఎంపికలుగా ఉన్నాయి. కృత్రిమ ఉత్పత్తులు మీ శిశువు చర్మంను చికాకుపరచవచ్చు. ఇక్కడ డైపర్ రాష్ మంట కోసం కొన్ని సమర్థవంతంగా పనిచేసే సహజ నివారణలు ఉన్నాయి. నాపి రాష్ తగ్గటానికి మరియు పుండ్లు ఉపశమనానికి సహాయం చేయడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి.

1. కార్న్ స్ట్రార్చ్:

1. కార్న్ స్ట్రార్చ్:

డైపర్ రాషెస్ ను నివారించడానికి ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. ఇది మాయిశ్చరైజర్ ను షోషింపబడుతుంది. చర్మాన్ని డ్రై గా ఉంచి, బేబీలో రాషెస్ ఏర్పడకుండా సహాయపడుతుంది. క్లీన్ డైపర్ ను తొడగడానికి ముందు బేబీ సిస్టింగ్ పోచ్చర్ మీద గోరువెచ్చని నీటిని చిలకరించి కొద్దిగా కార్న్ స్టార్చ్ చిలకరించాలి .

డైపర్ రాషెస్ నివారణకు కొబ్బరి నూనెలో యాంటీ ఫంగర్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఒక సమర్థవంతమైన హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు.కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని డైపర్ ఏరియాలో అప్లై చేయాలి. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయవచ్చు.

2. వెనిగర్ :

2. వెనిగర్ :

వెనిగర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ మరియు డైపర్ రాషెస్ ను నివారించే ఒక ఉత్తమ హోం రెమెడీ. ఒక కప్పు వాటర్ లో ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి, డైపర్ మార్చిన ప్రతి సారి ఈ మిశ్రమంతో బేబీ బాటమ్ ప్లేస్ ను శుభ్రంగా తుడుస్తుండాలి.

3. పెట్రోలియం జెల్లీ:

3. పెట్రోలియం జెల్లీ:

ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా పనిచేస్తుంది. యూరిన్ ప్రభావం వల్ల బేబీ చర్మం దద్దుర్లుకు గురి అవుతుంది. తేమగా ఉన్న డైపర్ ను తొలగించి బాటమ్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి . తర్వాత ఎండలో వేసి బాగా ఎండనివ్వాలి . ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి.

4. షీ బట్టర్:

4. షీ బట్టర్:

యాంటీఇన్ఫ్లమేటరీ, ఈస్ట్ ను నాశనం చేసే మరియు యాంటీ ఫంగల్ లక్షనాలు షీ బట్టర్ లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, దీన్ని డైపర్ రాషెస్ కు విరుగుడుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. షీబటర్ ను కొద్దిగా తీసుకొని, రాషెస్ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్ధన చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచిది తర్వాత కొత్త డైపర్ ను తొడగాలి.

5. ఫ్రెంచ్ గ్రీన్ క్లే:

5. ఫ్రెంచ్ గ్రీన్ క్లే:

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా డైపర్ రాషెస్ కు గురైనప్పుడు కొద్దిగా ఫ్రెంచ్ గ్రీన్ క్లేనె చిలకరించి రాషెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఇన్ఫెక్షన్ మరియు దురదను తగ్గిస్తుంది. స్కిన్ కు స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

6. ఓట్ మీల్:

6. ఓట్ మీల్:

డైపర్ రాషెస్ నివారించడంలో చాలా గ్రేట్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఎందుకంటే ఇందులో ‘సపోనిన్' అనే కెమికల్ కాంపౌండ్ ఉన్నది. ఇది బేబీ స్కిన్ మీద అనవసరైన మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. బేబీస్నానానికి ఉపయోగించే నీళ్ళలో ఒక చెంచా ఓట్ మీల్ వేసి రోజుకు రెండు సార్లు స్నానం చేయించాలి.

7. బ్రెస్ట్ మిల్క్:

7. బ్రెస్ట్ మిల్క్:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. మరియు దురద కలిగించే చర్మంకు ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీ. ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది మరియు దురద కలిగించే చర్మంను స్మూత్ గా ప్రశాంతంగా మార్చుతుంది.

8. ఆలివ్ ఆయిల్:

8. ఆలివ్ ఆయిల్:

డైపర్ రాష్ ప్రభావిత భాగంలో ఆలివ్ నూనె రాయటం వలన నయం చేయుటలో సహాయపడుతుంది. అలాగే ఆలివ్ నూనె చర్మంను తేమగా ఉంచుతుంది. పొడి ప్రాంతంలో ఆలివ్ నూనెను రాయాలి. నూనెను రాయటం వలన చర్మం మీదకు వచ్చే నీటిని నిరోధిస్తుంది.

English summary

8 Home Remedies For Diaper Rashes

The most important reason of diaper rash is extended exposure to an unclean diaper. Sometimes due to negligence the baby remains filthy with stool or damp with urine for long hours. This leads to diaper rashes. You can follow few home remedies for diaper rash to keep your baby safe from infections. Some other causes of diaper rashes include- food allergies, yeast infections, digestive problems, babies with sensitive skin, and badly cleaned diapers.
Story first published: Friday, February 20, 2015, 18:44 [IST]
Desktop Bottom Promotion