For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణంలో బేబీ కోసం తీసుకువెళ్ళాల్సిన హోం మేడ్ ఫుడ్స్

By Super
|

పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు పాపాయి కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారమే మంచిది. అయితే, ప్రీ ప్లానింగ్ తో మాత్రమే ఎటువంటి కంగారూ లేకుండా ఎరేంజ్ మెంట్స్ చేసుకోగలుగుతాము. మీరు వెళ్ళే ప్రదేశాన్ని బట్టీ, అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారో దాన్ని బట్టీ తగినన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ ఉండే సౌకర్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని వల్ల, బయట దొరికే బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్ పై ఆధారపడడం తగ్గుతుంది. మేమిచ్చే టిప్స్ మీకు క్యాంపింగ్, ఎయిర్ ట్రావెల్, డే ట్రిప్స్, రెస్టారెంట్ ఔటింగ్స్ కు ఉపయోగపడతాయి.

పాపాయితో ప్రయాణాన్ని సుఖంగా మారుస్తాయి. హోమ్ మేడ్ ఫుడ్ ఉన్నా లేకపోయినా కూడా కొన్ని సార్లు సర్దుబాటు చేసుకోవచ్చు. రూం టెంపరేచర్ లో బేబీకి ఆహారాన్ని తినిపిస్తే బేబీ ఆహారాన్ని తిరస్కరించాడు. వేడిగా లేకపోయినా రూం టెంపరేచర్ లో ఫుడ్ తీసుకోవడానికి బేబీ అలవాటు పడుతుంది. పాపాయి తినడానికి మొరాయిస్తుందన్న భయం ఉండదు.

Homemade Food To Carry While Traveling With Baby

హోమ్ మేడ్ బేబీ ఫుడ్
చాలా మంది తల్లిదండ్రులకు ఒక అపోహ ఉంది. ఇంట్లో తయారు చేసిన ఆహారం ప్రయాణాలకు సరిపడదని, బేబీకి నప్పదేమోననే భయం వారిలో ఉంది. ప్రయాణం కష్టమవుతుందేమోనన్న ఆలోచనలతో ప్రయాణాన్ని వాయిదా కూడా వేసుకుంటారు కూడా. అయితే, సులభ పద్దతుల ద్వారా హొమ్ మేడ్ ఫుడ్స్ ని ప్రయాణాలలో తీసుకెళ్ళవచ్చు. ఉదాహరణకు అరటిపండు, ఒక కంటైనర్, ఒక ఫోర్క్ ఇలా సులభతరంగా బేబీ కోసం ఫుడ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.

ఒక బనానా, ఫోర్క్, లిడ్ ఉన్న కంటైనర్ వీటిని తీసుకెళితే బేబీకి ఫ్రెష్ గా ఆహారాన్ని పెట్టవచ్చు. పాపాయికి తినిపించాల్సి వచ్చినప్పుడు బనానాని పీల్ చేసి కంటైనర్ లో ఫోర్క్ తో మ్యాష్ చేస్తే భోజనం తయార్. ఫ్రెష్ గా పాపాయికి తినిపించవచ్చు. అవేకాడోను కూడా తీసుకెళ్ళవచ్చు. అలాగే ముందుగా ఉడకపెట్టిన స్వీట్ పొటాటోను కూడా మ్యాష్ చేసి బేబీకి మీల్ ని ఏర్పాటు చేయవచ్చు.

Homemade Food To Carry While Traveling With Baby

అలాగే బేబీ కోసం మరికొన్ని రకాల ఫుడ్స్
సెరెల్స్: సెరేల్స్ ని ప్రయాణాలలో బేబీ ఫుడ్ గా వాడవచ్చు. అవసరాన్ని బట్టి కొన్ని ధాన్యం గింజలను కూడా వండుకుని పాపాయికి పెట్టవచ్చు. ఐస్ ట్రేస్ లో గడ్డకట్టిన సెరల్ ను యధావిధిగా వండవచ్చు.

పళ్ళు : వెకేషన్ లో మనతో పాటు పళ్ళను తీసుకెళ్లడం కొంచెం కష్టమైన విషయమే. క్యూబ్స్ గా గడ్డకడితే తప్ప పళ్ళను తీసుకెళ్లలేము. దాదాపు పండిన ఫ్రూట్స్ నే ప్రిఫర్ చేయాలి. పూర్తిగా పండిన ఫ్రూట్స్ ను తీసుకెళితే అవి పాడయిపోయే ప్రమాదం కలదు.

Homemade Food To Carry While Traveling With Baby

వెజిటబుల్స్ : మీరు నివాసముంటున్న ప్లేస్ లో వండుకునే సౌకర్యం ఉంటే మీతో పాటు కూరగాయాలను తీసుకుని వెళ్ళవచ్చు. అయితే కుదిరితే వాటిని పీల్ చేసి, కట్ చేసి మీతో తీసుకెళితే మంచిది. అవకాశముంటే ఎయిర్ టైట్ ఫ్రీజర్ బ్యాగ్ లో వాటిని భద్రపరచండి. తాజాదనం ఎక్కువసేపు ఉండేందుకు ఆ బ్యాగ్ లో కొంచెం నీటిని పోయండి. క్యాంపింగ్ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. స్టే చేసే చోటే తాజా వెజిటబుల్స్ ని కొనుక్కోవడం మరొక ఆప్షన్.

డైరీ/ఎగ్స్ : ఇవి పొడిగా పౌడర్ లా ఉండేవే ప్రిఫర్ చేయాలి. రెఫ్రిజెరేటర్ సౌకర్యం లేనప్పుడు కచ్చితంగా ఈ విధానాన్నే పాటించడం మంచిది. రిఫ్రిజెరేషన్ ఆప్షన్ ఉన్నప్పుడు మీకు అవసరానికి అనుగుణంగా స్టే ఉన్న చోటే డైరీ ప్రాడక్ట్స్ ను ఎగ్స్ ను తెచ్చుకుంటే మరింత సౌలభ్యం.

ఈ టిప్స్ మీకు ఉపయోగకరంగా లేనప్పుడు, మార్కెట్ లో దొరికే కమర్షియల్ ప్రొడక్ట్స్ ను ఎంచుకోవడానికి వెనుకాడకండి. ఇదే విధానాన్ని పాటించాలి అనుకుంటే, ప్రయాణానికి కనీసం వారం ముందే బేబీకి కావలసిన కమర్షియల్ బేబీ ఫుడ్స్ ని ఏర్పాటు చేసుంటే మంచిది.

కొంత మంది చిన్నారులు కమర్షియల్ బేబీ ఫుడ్స్ ని తినడాన్ని ఇష్టపడరు. ఇంట్లో దొరికే ఆహారానికి అలవాటు పడిన వారు ఇటువంటి ఇబ్బందులకు గురిచేస్తారు. అటువంటపుడు కనీసం ఒక మీల్ లోనైనా వారికి పండును గాని, కూరగాయలు గాని ఇస్తే వారు ఆనందంగా ఉంటారు.

అందుకే పిల్లలకి మరీ వేడిగా ఉండే ఫుడ్ కి అలవాటు కాకుండా చూసుకుంటే వారు రూం టెంపరేచర్ లో ఉన్న ఫుడ్ తినడానికి ఇబ్బంది పెట్టరు.

English summary

Homemade Food To Carry While Traveling With Baby

Traveling with Homemade Baby Food is easier than you may think. At the same time, it does take some pre-planning and calculation. Depending on where you are going, how long you are staying and what types of "creature comforts" will be available, you may not have to rely on a single ounce of commercial baby .
Story first published: Friday, January 16, 2015, 17:20 [IST]
Desktop Bottom Promotion