For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బేబీ స్కిన్ ను మరింత ఫెయిర్ గా..సాఫ్ట్ గా మార్చే నేచురల్ హోం రెమెడీస్

|

కొంత మంది పిల్లలను చూస్తే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. అందుకు కారణం వారి లేత చర్మం, కాంతివంతంగా కనబడుతుంది. మరి అలా మీ పాపాయి కూడా ముద్దొచ్చాలే ఫెయిర్ స్కిన్ కలిగి ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నారా? పసిపిల్లలు ఇంట్లో ఉంటే వారి సంరక్షణలో తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అందం విషయంలో కూడా బేబీలకు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి చర్మం సాఫ్ట్ గా మరియు సున్నితంగా ఉంటుంది. వారి చర్మ సంరక్షణ, మరియు చర్మ సౌందర్యం కోసం మీరు చేసే వాటిలో ఏదైనా పొరపాటు జరిగిందంటే మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. నిజానికి అలా ఏదైనా పసిపిల్ల కోసం ప్రయోగాలు చేసే ముందు ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించి ఎలాంటి పొరపాట్లు జరకుండా సలహాలు తీసుకోవాలి.

కాబట్టి, మీ బేబీ స్కిన్ కోసం మీరు ఏదైనా చేయాలనుకొన్నప్పడు, మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలన్ని సలహా. మరి చిన్న వయస్సులో ఇలాంటి రసాయనిక ప్రొడక్ట్స్ పిల్లల యొక్క సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, వాటికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండటం మంచిది.

పాపాయి బాడీ మసాజ్ కోసం టాప్ 10 ఆరోమా ఆయిల్స్

మరి ఇలా మార్కెట్లో అందుబాటులో ఉండే అలాంటి బేబి స్కిన్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా బేబీ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా మార్చాలంటే ఏం చేయాలి? క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

చిట్కా # 1

చిట్కా # 1

గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తో బేబీ స్కిన్ అప్లై చేసి మసాజ్ చేయాలి. అప్పుడు బేబీ స్కిన్ సాప్ట్ గా మరియు మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది . కాబట్టి రెగ్యులర్ గా బేబీకి ఆయిల్ మసాజ్ చేయండి.

చిట్కా # 2

చిట్కా # 2

ఆరెంజ్ జ్యూస్, ఆపిల్ జ్యూస్ మరియు ద్రాక్ష రసం వంటి పిల్లలకు అందివ్వాలి . ఇలాంటి జ్యూస్ లు పిల్లలకు చాలా ఆరోగ్యకరం మరియు చర్మకాంతిని మెరుగుపరుస్తాయి.

చిట్కా # 3

చిట్కా # 3

రోజ్ వాటర్, పాలు మరియు శెనగపిండిని మిక్స్ చేసి, బీబే స్కిన్ కు పట్టించి స్ర్కబ్ చేస్తే చర్మం నునుపుగా కాంతివంతంగా మారుతుంది.

ఇలా వారానికొకసారి చేస్తే చాలు.

చిట్కా # 4

చిట్కా # 4

అప్పుడప్పుడు పిల్లల్లో ఉదయం పడే ఎండలో ఆడుకోనివ్వండి. శరీరంకు డి విటమిన్ అందడంతో పాటు, చర్మానికి చాలా మేలు జరుగుతుంది. అయితే పిల్లలు సూర్య రశ్మిలో ఎలాంటి సమయంలో, ఎంతసేపు గడపాలో డెర్మటాలజిస్ట్ ను అడిగి తెలుసుకోండి . లేదంటే పిల్లల యొక్క సున్నితమైన చర్మం డ్యామేజ్ అవుతుంది.

చిట్కా # 5

చిట్కా # 5

పిల్లలందరూ సోపుతో లేదా సోపు వాటర్ తో ఆడుకోవడం సహజం . రోజ్ వాటర్ లేదా పాలును కూడా ఉపయోగించుకోవచ్చు . మీరు మన్నికైన సోపును ఉపయోగించాలనుకున్నప్పుడు డాక్టర్ ను కలిసి మంచి సలహాను తీసుకోగలరు.

చిట్కా # 6

చిట్కా # 6

సాండిల్ ఉడ్ పౌడర్ ను ఒక చెంచా తీసుకొని అందులో కొద్దిగా పాలు, ఒక చెంచా పసుపు మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి బేబీ బాడీకి పట్టించి 10 నిముషాల తర్వాత స్నానం చేయించడం మంచిది. పసుపు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది . పాలు మరియు గంధం బేబీ స్కిన్ సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది.

చిట్కా # 7

చిట్కా # 7

పిల్లల స్నానానికి మరీ వేడిగా ఉన్ననీటిని ఉపయోగించకూడదు. అలా చేయడం వల్ల చర్మం త్వరగా డ్రై అవుతుంది. కాబట్టి మీ బేబీ స్కిన్ డ్రై అవుతుంది. కాబట్టి, గోరువెచ్చని నీరు ఉపయోగించాలి.

English summary

How To Make Baby Skin Fair Naturally

How to make your baby skin fair? Mothers need to take every step carefully when dealing with babies.This applies to beauty routines as the skin of a baby tends to be soft and delicate. Any mistake done can form a scar. In fact, it is advisable to closely follow every instruction of your family doctor with utmost precision to avoid any mistakes.
Story first published: Wednesday, September 23, 2015, 17:09 [IST]
Desktop Bottom Promotion