For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏకరూప కవల పిల్లలను గుర్తించడం ఎలా?

By Super
|

స్త్రీ గర్భంతో ఉన్నపుడు, అది ఆమె జీవితంలో సంతోషకరమైన సమయం, ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుంది అని తెలుసుకున్నపుడు ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అయితే, ఏకరూప కవలల ను గుర్తించడానికి సంతోషంతో పాటు, విచారం కూడా ఉంటుంది. తల్లితండ్రులు వారి పిల్లల మధ్య బేధాలను తెలుసుకునే పద్ధతులను నిర్ణయించుకోవాలి. ఏకరూప కవలలను గుర్తించడం ఒక పెద్ద విషయం.

READ MORE: కవలల గురించి మీకు తెలియని 5 విషయాలు
మీరు మీ చిన్నారి కవలలను గుర్తించడానికి ఉపయోగించే కొన్ని చిట్కాలను ఇక్కడ నేను చెప్తాను. కవలలు శిశువులుగా ఉన్న సమయంలో గుర్తించడం చాలా కష్టం. ప్రారంభం నుండే, మీరు ఏకరూప కవలలను సమర్ధించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

హాస్పిటల్ బాండ్ లు:

హాస్పిటల్ బాండ్ లు:

హాస్పిటల్ లో, పిల్లలు పుట్టిన వెంటనే, నర్సులు నంబర్లు లేదా కోడ్స్ కు సంబంధించిన హాస్పిటల్ బ్యాండ్లను పిల్లలకు తొడుగుతారు. పిల్లలకు ఆ బ్యాండ్లు ఉంటే, వారి అలవాట్లను, ప్రవర్తనను ఎటువంటి సంకోచం లేకుండా వారిని గుర్తించవచ్చు.

గోళ్ళ రంగు:

గోళ్ళ రంగు:

ఒక పిల్లాడికి, బొటనవేలి గోటికి గోళ్ళరంగు వేయండి. మీకు ఇష్టమైన రంగును ఎంచుకుని, ఒక పిల్లాడి కాలి వేలికి గోళ్ళరంగు వేయండి. అంతేకాకుండా ఆ రంగు పోకుండా జాగ్రత్త పడండి, లేకపోతే వారిని గుర్తించడం చాలా కష్టమౌతుంది. గోళ్ళకు రంగు వేసేటపుడు చాలా జాగ్రత్తగా వేయండి.

 పుట్టుమచ్చలు:

పుట్టుమచ్చలు:

ఏకరూప కవలలు ఒకేరకంగా కనిపిస్తారు, కానీ వారి వంటిపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా పిల్లల మధ్య తేడాను తల్లిదండ్రులు తేలికగా గుర్తించవచ్చు. అయితే, అలాంటి గుర్తులను గుర్తించడం చాలా కష్టం. పుట్టుమచ్చ, పుట్టుకతో వచ్చిన మచ్చలు లేదా వారి శరీరంపై ఏదన్న గుర్తుపెట్టడం వంటి ప్రత్యేకమైన గుర్తుల ద్వారా వారిని గుర్తించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ, వారి మచ్చలు కూడా పెరిగి, వారి రంగులో కూడా కొద్దిపాటి తేడా కనిపిస్తుంది.

దుస్తులు

దుస్తులు

వారికి వేరువేరు రంగులు, వేరువేరు నమూనాలు గల బట్టలు ఉండేట్లు చూడండి. వారి ఒకేవిధమైన బట్టలు కొన్నట్లితే, వారి బట్టలపై ఏదైనా గుర్తు పెట్టండి, అలాచేస్తే మీరు, ఇతరులు వారిని గుర్తించడం తేలిక. ఉదాహరణకు, బేబీ A బేబీ B అని మార్క్ చేయండి లేదా వారు డ్రస్సుల వెనుక వైపు వారి పేర్లను ముద్రించండి.

పేర్ల టాగ్ లు:

పేర్ల టాగ్ లు:

క్రమేణా, ఎటువంటి గుర్తులు లేకుండా తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తుపడతారు, కానీ స్కూల్ లో తోటివారు, టీచర్ల సంగతి ఏమిటి? వారు స్కూలుకు వెళ్ళాల్సిన సమయం వచ్చినపుడు, తల్లిదండ్రులు వారికి వారి పేర్లతో కూడిన బ్రేస్లేట్లు ఇవ్వడం లేదా వారి బాక్ పాక్స్ కి పేర్లు ఉన్న టాగ్ లను అంటించడం చేయాలి. ప్రత్యామ్నాయంగా, మీరు వారి స్కూలు యూనిఫాం మీద తేలికగా గుర్తించే విధంగా వారి పేరుతో కూడిన టాగ్ ను పిన్ చేయాలి.

లక్షణాలు:

లక్షణాలు:

వయసు పెరిగేకొద్దీ వారిలో వచ్చే శారీరిక మార్పులను బట్టి ఏకరూప కవలలను తేలికగా గుర్తించవచ్చు. ఒకరు పరిణత్వం చెంది, మరొకరు పరినత్వం చెందక పోవచ్చు. వారి గొంతులో మార్పులు, వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు, వారి వస్త్రధారణ, హెయిర్ స్టైల్, జీవన శైలి, అన్నీ మారుతాయి. ఇలాంటి తేడాల వల్ల తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు వీరిని గుర్తించడం చాలా తేలిక.

English summary

How to Identify Identical Twins: Pregnancy Articles in Telugu

How to Identify Identical Twins: Pregnancy Articles in Telugu.When a woman gets pregnant, it is the happiest phase of her life, and when she gets to know that she will be soon becoming a mother of twin children, her happiness reaches it’s peak. However, with happiness, comes the worry, to identify identical twin.
Desktop Bottom Promotion