For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపాయి బాడీ మసాజ్ కోసం టాప్ 10 ఆరోమా ఆయిల్స్

By Super
|

భారత్ లో పాపాయికి మర్దనా చేసే ప్రొసీజర్ ఎంతో ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా, పాపాయికి మర్దనా చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ పై, పాపాయి ఆరోగ్యంగా మర్దనా చూపించే ప్రభావంపై హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అలాగే డాక్టర్స్ అభిప్రాయ బేధాలున్నాయి.

పాపాయికి నూనెతో మసాజ్ చేయడం వల్ల పాపాయి ఉపశమనం పొందుతుంది. పాపాయి చర్మం మృదువుగా, కోమలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. తరచూ పాపాయికి మర్దనా చేయడం ఎంతో ముఖ్యం.

ఆయిల్ మసాజ్ బెనిఫిట్స్

చాలా ఇళ్ళల్లో ప్రత్యేకించి భారతీయ ఇళ్ళల్లో పాపాయికి స్నానానికి ముందు గాని స్నానం తరువాత గాని మసాజ్ చేయడమనేది సాధారణ అంశం. పాపాయికి మసాజ్ చేయడం ద్వారా వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం.

అలసిపోయిన పాపాయి అవయవాలకు, కండరాలకు మసాజ్ ద్వారా ఉపశమనం కలుగుతుంది.

పాపాయి చర్మం నిగారింపుకై మసాజ్ తోడ్పడుతుంది

మీకు మీ చిన్నారికి మసాజ్ ద్వారా బాండింగ్ ఏర్పడుతుంది. మీ చిన్నారికై మీరు సమయం కేటాయించేందుకు ఇదొక ముఖ్య సందర్భం.

పాపాయి మసాజ్ కు బెస్ట్ బేబీ ఆయిల్ - టాప్ 10

మీ పాపాయికి మసాజ్ చేసే విధానం ఎంత ముఖ్యమో, మసాజ్ కు వాడే ఆయిల్ కూడా అంతే ముఖ్యం. ఏదో ఒక నూనె లేదా క్రీమ్ తో పాపాయికి మసాజ్ చేయకూడదు. పాపాయి చర్మం సున్నితమైనది కాబట్టి ఎంచుకునే నూనె గురించి బాగా స్టడీ చేయాలి. పాపాయి మసాజ్ కి వాడే నూనె పాపాయికి ఆనందాన్ని కలిగించాలి గాని అసౌకర్యాన్ని కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

చంటిపిల్లల చర్మం చాలా పొడిగా ఉంటుంది. చాలా సున్నితంగా ఉంటుంది. చర్మంపై పొడితనం పెరుగుతూ ఉంటే దాని వల్ల కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలుంటాయి. ర్యాషేస్, గజ్జి, తామర వంటి స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పాపాయి చర్మానికి నాణ్యమైన నూనెని వాడితే వారి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పాపాయి చర్మానికి ఏ నూనె మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? పాపాయి చర్మానికి సరిపడే టాప్ 10 ఆయిల్స్ లిస్టుని మీకు తెలియజేస్తున్నాము. వీటితో పాపాయికి మర్దనా చేస్తే ఎన్నో లాభాలుంటాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

పాపాయి చర్మానికి చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేసే నూనె ఇది. వెచ్చని అలాగే తేమ వాతావరణాలలో కూడా కొబ్బరి నూనెని వాడవచ్చు. ఇది లైట్ గా ఉంటుంది. పాపాయి చర్మంలో త్వరగా ఇంకిపోతుంది. సున్నితమైన చర్మం కలిగిన వారికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా కోకోనట్ ఆయిల్ ని వాడవచ్చు. గజ్జి, తామర, ర్యాషేస్, పగిలిన చర్మం, డెర్మాటైటిస్, క్రాడిల్ క్యాప్ వంటి వాటికి కొబ్బరి నూనె చికిత్స కూడా మంచిది. స్నానం తరువాత కొద్దిగా కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల పాపాయి చర్మానికి తగినంత తేమ అందుతుంది. పాపాయి చర్మం మృదువుగా మారుతుంది. కోకోనట్ ఆయిల్ లో యాంటి-ఆక్సిడెంట్స్, లారిక్, కాప్రిలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. అలాగే, కొబ్బరి నూనెలోనున్న యాంటి బ్యాక్టీరియల్ అలాగే యాంటి ఫంగల్ లక్షణాలు పాపాయి చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

పాపాయి మసాజ్ కు ఆలివ్ ఆయిల్ ను వాడడం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలివ్ ఆయిల్ ను ప్రధాన ఇంగ్రీడియెంట్ గా పేర్కొన్న మసాజ్ ఆయిల్ బ్రాండ్స్ ఎన్నో ఉన్నాయి. ర్యాషెస్, కట్స్, ఎక్క్షిమా లేదా మిగతా స్కిన్ అలర్జీలు లేనప్పుడు ఆలివ్ ఆయిల్ ను వాడడం సురక్షితమే. సున్నితమైన చర్మం కలవారు ఆలివ్ ఆయిల్ ను వాడడం మానేస్తే మంచిది. ఆలివ్ ఆయిల్ లో ఉన్న లక్షణాల వల్ల స్కిన్ లోని తేమ త్వరగా ఆరిపోయి స్కిన్ డ్రై గా మారుతుంది. అందువల్ల, స్కిన్ ఎలర్జీల వంటివి మళ్ళీ స్వైర విహారం చేస్తాయి. కాబట్టి, స్కిన్ ప్రొబ్లెమ్స్ ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ ను నిషేదిస్తే మంచిది.

మస్టర్డ్ ఆయిల్

మస్టర్డ్ ఆయిల్

పసిపిల్లలకైనా, కొంచెం పెద్ద పిల్లలకైనా మసాజ్ చేసేందుకు సురక్షితమైన ఆయిల్ గా మస్టర్డ్ ఆయిల్ ను పేర్కొనవచ్చు. శీతాకాలంలోనే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించడం ఉత్తమం. ఇందులో వెచ్చదనం కలిగించే లక్షణం ఉండటం వలన వాతావరణం వేడిగా ఉన్నప్పుడు స్కిన్ ఇరిటేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. వెచ్చని మస్టర్డ్ ఆయిల్ ను మాత్రం బేబీకి అప్లై చేయకూడదన్న సంగతి గుర్తుంచుకోండి.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

ఇండియాలో నువ్వుల నూనె అత్యంత ప్రఖ్యాతమైనది. పిల్లలకు మసాజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నువ్వుల నూనెతో చేసే మసాజే. శీతాకాలంలో, అలాగే వాతావరణం చల్లగా, పొడిగా ఉన్నప్పుడు నువ్వుల నూనెను మసాజ్ కి వాడాలి. ఈ ఆయిల్ హెవీగా, వెచ్చగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో దీని వాడకాన్ని నివారించాలి. నల్ల నువ్వుల గింజల నుంచి తయారు చేయబడిన ఆయిల్ ను వాడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్ గా కూడా ఇది ప్రాచుర్యం చెందింది.

ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్

వివిధ మసాజ్ ఆయిల్స్ లో ఆల్మండ్ ఆయిల్ ను ప్రధాన ఇంగ్రీడియెంట్ గా వాడతారు. విటమిన్ ఈ ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. సువాసనభరితమైన ఆయిల్ బదులు స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ ను ఎంచుకోవాలి.

సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్ ను ముఖ్యంగా వంటలలో వాడతారు. చర్మానికి సురక్షితమైన ఆయిల్ గా దీనిని పేర్కొంటారు. ఇందులో విటమిన్ ఈ తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం నిగారింపుతో ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. మీ పాపాయి చర్మం అతి సున్నితమైనది, త్వరగా ర్యాషెస్ కలిగేదీ అయితే ఈ ఆయిల్ ను వాడటం నివారించండి.

చామంతి నూనె

చామంతి నూనె

ఇది సుగంధ తైలం. అప్పుడే పుట్టిన శిశువుల చర్మం అతి సున్నితంగా ఉంటుంది కాబట్టి వారికి ఈ ఆయిల్ ను రికమెండ్ చేస్తారు. ర్యాషెస్, చర్మపు పగుళ్ళని ట్రీట్ చేయడానికి ఈ ఆయిల్ ను వాడతారు. కొలిక్ తో బాధపడే పిల్లలకు దీనిని రికమెండ్ చేస్తారు. వారు నొప్పిని మరిచి హాయిగా నిద్రపోతారు.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

ఈ ఆయిల్ ను వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేస్తారు. సహజసిద్ధమైన ఆయిల్ కాబట్టి ఇందులో ఎక్కువ యాంటి సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. వివిధ రకాల స్కిన్ ఎలర్జీలను ఈ ఆయిల్ ట్రీట్ చేస్తుంది. పాపాయికి ఉపశమనం కలిగిస్తుంది.

క్యాలెండులా ఆయిల్

క్యాలెండులా ఆయిల్

పాపాయి మసాజ్ కు సజెస్ట్ చేయబడిన మరొక సుగంధ తైలమిది. పాపాయికి స్నానం చేయించిన తరువాత ఈ నూనెతో మర్దనా చేస్తే చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. ఈ నూనెలో సహజ సిద్ధమైన సువాసన పాపాయికి ఇబ్బంది కలిగించదు.

ఆముదము నూనె

ఆముదము నూనె

పాపాయికి స్నానం చేయించే ముందు ఈ నూనెను వాడాలి. పొడి చర్మం సమస్యను ట్రీట్ చేయడానికి అలాగే పాపాయి జుట్టుకు, గోళ్ళకు ఈ ఆయిల్ మంచిది. ఆముదపు నూనెను పాపాయి కళ్ళకి, పెదవులకు దూరంగా అప్లై చేయాలి.పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు వారితో బంధాన్ని పెంచుకోవచ్చు. ఈ సమయాన్ని పాపాయితో ఆనందంగా గడపవచ్చు. ప్రతి రోజూ పాపాయికి మసాజ్ చేస్తూ వారితో గడపడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వాటితో పాటు పాపాయి ఆరోగ్యానికి మర్దనా ఎంతో మంచిది.

English summary

Top 10 Oils That Are Good For Baby Skin

Baby massage is one of those key baby care practice that is widely followed in India. Doctors and health care providers all over the world differ in their opinion about the actual benefits of baby massage and its effect on baby’s development.
Desktop Bottom Promotion