For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుజ్జి పాపాయిల్లో డైపర్ రాషెష్ నివారించే సింపుల్ టిప్స్

By Swathi
|

తల్లిగా బుజ్జి పాపాయిని చూసుకుంటూ మురిపోతూ ఉంటారు. ఆ సంతోషాలన్నీ ఒకటైతే.. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న పిల్లలకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, అనారోగ్య సమస్యలు రాకుండా.. కేర్ తీసుకోవడం కూడా పెద్ద చాలెంజ్ లాంటిది. పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ తో కూడిన పని.

బేబీ సంరక్షణ కోసం తల్లి లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వస్తాయి. బేబీ కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే చిన్న పిల్లలకు ముఖ్యంగా డైపర్ వాడుతుంటారు. కొంతమంది బయటకు వెళ్లినప్పుడు మాత్రమే డైపర్స్ వాడితే.. మరికొందరు ఎల్లప్పుడూ డైపర్స్ నే ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి డైపర్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. చాలా మంది పిల్లల్లో అవి ర్యాషెష్ కి కారణమవుతాయి. కాబట్టి.. చిన్న పిల్లల్లో డైపర్ ర్యాషెష్ నివారించడానికి పాటించాల్సిన సింపుల్ టిప్స్ మీకోసం..

టిప్ 1

టిప్ 1

చాలా ఎక్కువ సేపు ఒకే డైపర్ ని బేబీకి వేయరాదని గుర్తుంచుకోండి. ఒకవేళ అది పూర్తీగా ఉపయోగించకపోయినా.. రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి.

టిప్ 2

టిప్ 2

రోజులో కొన్ని గంటల పాటు డైపర్ లేకుండా బేబీ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సున్నితమైన వాళ్ల చర్మానికి కాస్త గాలి అవసరం. రోజంతా డైపర్లతో ఉంచితే.. రాషెష్ రావడం ఖాయం.

టిప్ 3

టిప్ 3

బేబీకి ఉపయోగించే ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీగా ఉండేలా జాగ్రత్త పడాలి. బేబీ వైప్స్, బేబీ పౌడర్ వంటి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అవి డైపర్ వేసే ప్రాంతంలో చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి.. కెమికల్స్ లేకుండా ఉండేవే ఉపయోగించాలి.

టిప్ 4

టిప్ 4

డైపర్ తడిచిన వెంటనే దాన్ని మార్చాలి. లేదంటే ర్యాషెష్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

టిప్ 5

టిప్ 5

రెగ్యులర్ గా స్నానం చేయించడం చాలా అవసరం. 5 నెలలు నిండిన పిల్లలకు రెగ్యులర్ గా స్నానం చేయించడం వల్ల.. ర్యాషెష్ నివారించవచ్చు.

టిప్ 6

టిప్ 6

స్నానం చేయించిన వెంటనే సున్నితంగా చర్మాన్నంతటినీ శుభ్రం చేయాలి. తడి లేకుండా తుడవాలి. టవల్ తో ఎక్కువగా రుద్దడం వల్ల చర్మంపై దురద, ర్యాషెష్ కి కారణమవుతుంది.

టిప్ 7

టిప్ 7

మీ బేబీ డైపర్ ర్యాషెష్ రావడానికి అవకాశం ఉందని మీకు తెలిస్తే.. ఆయింట్ మెంట్స్, లోషన్స్ డాక్టర్స్ సలహా ప్రకారం ఉపయోగించాలి.

టిప్ 8

టిప్ 8

శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ లను డైపర్లకు బదులుగా ఉపయోగించాలి. ఇవి బేబీ యూరిన్ ని పీల్చుకుంటాయి. డైపర్స్ కంటే కాటన్ క్లాత్స్ చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

8 Easy Tips To Prevent Diaper Rashes In Babies

8 Easy Tips To Prevent Diaper Rashes In Babies. Among various other minor ailments that an infant could be affected with, diaper rash is a common one.
Story first published:Saturday, May 21, 2016, 11:39 [IST]
Desktop Bottom Promotion