For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడే పుట్టిన పిల్లల గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

మనలో చాలామంది.. అప్పుడే పుట్టిన పిల్లలను చూడగానే.. చిరునవ్వు కనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్లు బుజ్జి చేతులు, సున్నితమైన కాళ్లు, సుతిమెత్తని చర్మం, అమాయకంగా కనిపించే హావభావాలు.. ముద్దాడేలా చేస్తాయి. రోజంతా వాళ్లతో.. హ్యాపీగా గడపాలన్న ఫీలింగ్ కలుగుతుంది.

అప్పుడే పుట్టిన శిశువు సంరక్షణ కోసం.. తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దవాళ్లు, డాక్టర్లు చెప్పే అన్ని సలహాలను పాటిస్తూ.. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడే పుట్టిన బేబీని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

పొట్టలో బేబీ గురించి ఎట్రాక్టివ్ ఫ్యాక్ట్స్ ?

ఇంకా పూర్తీగా డెవలప్ కానీ.. వాళ్ల అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి.. చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలి. అలాగే వాళ్ల ఇమ్యున్ సిస్టమ్ కూడా.. చాలా బలహీనంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్తపడాలి. అయితే.. వాళ్ల గురించి కొన్ని వింత విషయాలు మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. డాక్టర్లు కూడా చెప్పని కొన్ని ఆశ్చర్యకర, విచిత్రమైన వాస్తవాలు మీకోసం..

కన్నీళ్లు

కన్నీళ్లు

అప్పుడే పుట్టిన పిల్లలు ఏడుస్తారు.. కానీ.. కన్నీళ్లు మాత్రం రావు. ఎందుకంటే.. వాళ్లకు ఇంకా టియర్ డక్ట్స్ పూర్తీగా డెవలప్ అయి ఉండవు. 12 వారాలు వచ్చే వరకు అవి డెవలప్ అవవు. అంతవరకు పిల్లలు ఏడ్చినా కన్నీళ్లు రావన్నమాట.

టేస్ట్

టేస్ట్

అప్పుడే పుట్టిన శిశువుల్లో.. టేస్ట్ బడ్స్ చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి. వాళ్లు తీపి, చేదు, స్పైసీనెస్ ని గుర్తించగలరు. కానీ.. సాల్ట్ మాత్రం టేస్ట్ గుర్తించలేరు.

మోకాళ్ల చిప్పలు

మోకాళ్ల చిప్పలు

అప్పుడే పుట్టిన శిశువుల్లో మోకాళ్ల ఎముకలు, మోకాళ్ల చిప్పలు, మోకాలి చుట్టూ ఎముకలు ఇంకా ఏర్పడి ఉండవు. అవన్నీ.. కేవలం బేబీకి ఏడాది వయసు వచ్చిన తర్వాతే ఏర్పడతాయి.

ఎముకలు

ఎముకలు

అప్పుడే పుట్టిన పిల్లలు 300 ఎముకలను కలిగి ఉంటారు. పెద్దవాళ్లు 206 మాత్రమే కలిగి ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ.. ఎముకలు ఒకదానికొకటి కలిసిపోతాయి. అలా.. ఎముకల సంఖ్య తగ్గుతుంది.

హెయిర్

హెయిర్

పిల్లల చర్మంపై... కొద్దిగా పలుచగా.. హెయిర్ పెరుగుతుంది. ఈ హెయిర్ వాళ్లకు ప్రొటెక్షన్ గా ఉంటుంది. దీన్ని లన్యుగో అంటారు. బేబీ పొట్టలో ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడంలో ఈ హెయిర్ సహాయపడుతుంది.

మెనుస్ట్రేట్

మెనుస్ట్రేట్

కొంతమంది అప్పుడే పుట్టిన ఆడపిల్లలు.. మెనుస్ట్రేట్ అవుతారు. నిజమే.. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. వాస్తవం. గర్భాశయంలో ఉన్నప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకు.. హైలెవల్ లో ఈస్ట్రోజన్ కి ఎక్స్ పోజ్ అయి ఉంటారు. దీనివల్ల.. కొన్ని చుక్కల బ్లడ్ వాళ్ల డైపర్ లో మొదట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్.

లాక్టేట్

లాక్టేట్

చాలా అరుదైన సందర్భాల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో పాలు ఉత్పత్తి అవుతాయి. గర్భాశయంలో ఉన్నప్పుడు చాలా హార్మోన్ల ప్రభావం వల్ల.. అతి చిన్న బ్రెస్ట్ బడ్స్ డెవలప్ అయి.. చాలా కొద్ది మోతాదులో పాలు ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి ప్రక్రియ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఇది చాలా సాధారణం. అలాగే.. ఇది పుట్టిన కొన్ని రోజుల్లోనే ఆగిపోతుంది.

ప్రేమ

ప్రేమ

అప్పుడే పుట్టిన పిల్లలకు ప్రపంచం తెలియకపోయినా.. పేరెంట్స్ ని మాత్రం చాలా ప్రేమిస్తారు. గర్భంలో ఉన్నప్పుడు మీ వాయిస్ వింటారు. మీ వాసనను ఇష్టపడతారు. అందుకే పేరెంట్స్ అంటే అమితమైన ప్రేమ బుజ్జి పాపాయిలకు.

పాదాలు

పాదాలు

ప్యూర్ సిల్క్ కంటే.. చాలా అందంగా, స్మూత్ గా ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువు పాదాలు. ఈ ప్రపంచంలోని అన్నింటికంటే అత్యంత అందమైనవి అవే. మరో విషయమేంటో తెలుసా.. అప్పుడే పుట్టిన పిల్లల పాదాలు మట్టి, బురద, రాయి ఇలా ఏ స్పర్శ గ్రహించలేవు.

English summary

9 Strange Facts About Newborns That You Never Knew!

9 Strange Facts About Newborns That You Never Knew! Most of us, when we look at a newborn baby, have a smile on our faces. The baby's delicate features, the soft skin and his/her innocence can make one want to just cuddle with the baby all day long!
Story first published:Tuesday, July 12, 2016, 10:50 [IST]
Desktop Bottom Promotion