For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలంటే దాన్నిమ్మ కంపల్సరీ.. !

|

పిల్లలు తినే రెగ్యులర్ డైట్ లో హెల్తీ, న్యూట్రీషిన్, ప్రోటీన్ ఫుడ్స్ పుష్కలంగా ఉండాలి. అంతే కాదు వారి రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పండ్లలో దానిమ్మ కూడా హెల్తీ ఫుడ్. 6 నెలల తర్వాత పిల్లలకు ఘనపదార్థాలను ఇవ్వడానికి సలహాలిస్తుంటారు. దానిమ్మను ఒక సూపర్ ఫుడ్ గా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. పిల్లలకు దానిమ్మ జ్యూస్ ను ఇవ్వడం సురక్షితమే. ఈ పండులో ఫొల్లెట్, ఫైబర్, పొటాషియం, మరియు వాటర్ సోలబుల్ విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నది.

దానిమ్మ జ్యూస్ ను పిల్లలకు అందివ్వడం వల్ల అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది బేబీ స్టొమక్ కు స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. డయోరియాను కంట్రోల్ చేస్తుంది మరియు గ్యాస్ట్రిటైస్ ను నివారిస్తుంది. దానిమ్మ రసం అద్భుతంగా పనిచేస్తుంది . దంతాలకు కూడా స్మూతింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

Benefits Of Pomegranates For Babies

చిన్న పిల్లలకు దానిమ్మ జ్యూస్ అందివ్వడం వల్ల వారికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

బేబీకి పూర్తి పోషకాలు అందుతాయి. దానిమ్మలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి . ఇది మినరల్స్ కూడా ఒక మంచి మూలం. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది మరియు శరీరంలోని ఆక్సిజన్ అణువులను అస్థిరపరుస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: బేబీ బాడీలోని బ్యాక్టీరియాను తొలగించడానికి దానిమ్మ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని రీసెంట్ స్టడీస్ నిర్ధారించాయి . దానిమ్మలో ఉండే ఎంజైమ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి.

Benefits Of Pomegranates For Babies

జీర్ణ సమస్యలను నివారిస్తుంది: చిన్న పిల్లలు తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు . చిన్న పిల్లల్లో అభివృద్ధి చెందని జీర్ణవ్యవస్థ వల్ల పిల్లల్లో తరచూ జీర్ణ సమస్యలు ఎదురౌతాయి . ఇది బ్యాక్టీరియాను ఆహ్వానించడం వల్ల పిల్లల్లో డయోరియాకు దారితీస్తుంది . ఇది మలబద్దకానికి కూడా కారణం అవుతుంది.

ప్రేగుల్లో పరాన్న జీవులను తొలగిస్తుంది: పిల్లల్లో ప్రేగులల్లో పరాన్న జీవులు(పురుగులు)పడటం సర్వసాధారణం. ఈ పురుగులు పెద్దప్రేగులో నివసిస్తాయి మరియు పోషకాల మీద ఆధారపడి ఉంటాయి . దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ ఇంటెన్సినల్ వార్మ్ ను నాశనం చేయడానికి సహాయపడుతుంది.

కాలేయానికి రక్షణ కల్పిస్తుంది: దానిమ్మ జ్యూస్ కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది . దాంతో కాలేయం రక్షణ పొందుతుంది.

English summary

Benefits Of Pomegranates For Babies

Pomegranates are one of the foods that should be included in a baby's diet. It can be introduced to your baby 's diet after 6 months. Pomegranate can be considered as a super food, due to its high antioxidant content.
Story first published: Wednesday, February 10, 2016, 16:18 [IST]
Desktop Bottom Promotion