For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ బోన్స్ స్ట్రాంగ్ గా మార్చే నేచురల్ పదార్థాలు

|

బేబీ పుట్టిన తర్వాత ఐదు, ఆరు నెలల వరకూ సాలిడ్ ఫుడ్ ను పెట్టారు. అప్పటి వరకూ వారికి లిక్విడ్స్ మాత్రమే అందిస్తుంటారు. శిశువుకు జీర్ణించే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, 5, లేదా 6 నెలల వరకూ లిక్విడ్స్ మాత్రమే అందిస్తుంటారు. ఇక ఆ తర్వాత సాలిడ్ ఫుడ్స్ పెట్టడం ప్రారంభిస్తారు. అయితే ఈ విషయంలో చాలా మంది తల్లులకు ఎలాంటి ఘనపదార్థాలు పెట్టాలని ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా బేబీకి జీర్ణమవ్వడానికి తేలికగా ఉండే ఆహారాలు...ఇమ్యూనిటి పెంచే ఆహారాలు...బోన్స్ స్ట్రాంగ్ గా మార్చే ఆహారాలను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరు కూడా ఎస్ అంటే ఖచ్చితంగా మీరు మీ బేబీ హెల్త్ అండ్ బేబీ డెవలప్ మెంట్ కు క్రుషి చేస్తున్నట్లే..ఎందుకంటే బీబే క్రమంగా పెరిగే కొద్ది వారిలో బోన్స్ స్ట్రాంగ్ ఏర్పడటం చాలా అవసరం.

మన శరీరానికి ఎముకలు ఇంటర్నల్ గా ఫ్రేమ్ వర్క్ వంటివి, హుమన్ బాడీలో ఎముకలు లేకుండా శరీరం ఏర్పడదు.

కాబట్టి, మానవ శరీరానికి ఎముకలు అత్యంత అవసరం. ఇవి శరీరంలో అంతర్గత అవయవాలకు అవసరమైన వాటిని చేరవేయడానికి... అలాగే బాడీకి సపోర్టివ్ గా నిలబడటానికి, అంతర్గత అవయవాలకు రక్షణ కల్పించడానికి, కాళ్ళు, చేతులు, మెడ , జాయింట్స్ కదిలించడానికి చాలా అవసరమవుతుంది.

అందువల్ల, అప్పుడే పుట్టిన బేబీస్ లో హెల్తీగా...స్ట్రాంగ్ బోన్స్ ఏర్పడటం చాలా అవసరం. బేబీలో ఎముకలు సరిగా పెరగలేదంటే భవిష్యత్తులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పెరుగుదల కనబడదు, జాయింట్ పెయిన్స్, వీక్ నెస్ వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి.

పిల్లల్లో ఎముకలు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా లేకపోతే, వారు పొడవు పెరగలేరు. అంతే కాదు, వారు ఎక్కువగా ఫిజికల్ గా గాయపడాల్సి వస్తుంది.

బేబీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, తల్లిదండ్రులు పిల్లలకు హెల్తీ డైట్ ను అందివ్వాలి . ముఖ్యంగా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా అందివ్వడం మంచిది.

కాబట్టి, మీ బేబీ బోన్స్ నేచురల్ గా స్ట్రాంగ్ గా పెరగాలంటే, వారి డైలీ డైట్ లో కొన్ని నేచురల్ ఆహార పదార్థాలను చేర్చండి...

1. డైరీ ప్రొడక్ట్స్:

1. డైరీ ప్రొడక్ట్స్:

మిల్క్, చీజ్, పెరుగు మొదలగు వాటిలో క్యాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇవి బేబీ బోన్స్ మరియు టీత్ ను నేచురల్ గా స్ట్రాంగ్ గా మార్చుతాయి. మరియు పాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు బేబీకి వివిధ రకాలుగా సహాయపడుతాయి.

2. స్వీట్ పొటాటో:

2. స్వీట్ పొటాటో:

క్యాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ లో స్వీట్ పొటాటో ఒకటి. వీటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బోన్ కెపాజిటి పెంచడంలో గ్రేట్ గా సమాయపడుతాయి.

3. సోయా మిల్క్:

3. సోయా మిల్క్:

సోయా మిల్క్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది, ఇది పిల్లల్లో ఇమ్యూనిటి పెంచుతుంది.

4. పచ్చిబఠానీలు:

4. పచ్చిబఠానీలు:

బేబీబోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, వారికి అందించే రెగ్యులర్ డైట్ లో పచ్చిబఠానీలను చేర్చాలి. లెంటిల్స్ లో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

5. ఆరెంజ్ :

5. ఆరెంజ్ :

ఆరెంజ్ సిట్రస్ ఫ్రూట్ . ఇందులో క్యాల్షియం, మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది బేబీ ఇమ్యూనిటి పెంచడంతో పాటు బోన్స్ ను హెల్తీ అండ్ స్ట్రాంగ్ గా మార్చుతుంది.

6. రాగి:

6. రాగి:

బేబీ బోన్స్ స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంచాలంటే, వారి తినే రెగ్యులర్ డైట్ లో రాగిమాల్ట్ చేర్చాలి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వారి ఎదుగుదలకు స్ట్రాంగ్ బోన్స్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

7. నట్స్ :

7. నట్స్ :

బాదం వంటి నట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది బోన్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది.

English summary

Natural Ingredients That Can Make Your Baby’s Bones Stronger

Have you started feeding solid foods to your baby? Are you wondering what foods should be given to your baby to make his/her bones stronger? If yes, then you are thinking in the right direction because healthy bones are extremely important for a growing child.
Desktop Bottom Promotion