For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు రాత్రిళ్లు ఎందుకు నిద్ర లేస్తారు ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

By Swathi
|

తల్లిదండ్రులంతా.. చెప్పే కంప్లైంట్.. వాళ్ల బేబీ మధ్య రాత్రిలో నిద్రలేస్తున్నారని. రాత్రంతా పిల్లలను నిద్రపుచ్చడం చాలా కష్టమైన పని. అలాగే పిల్లలు రాత్రిపూట ఎందుకు నిద్రలేస్తున్నారనేది తెలుసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. చాలా సందర్భాల్లో ఆకలిగా, చల్లగా, వెచ్చగా ఉన్నప్పుడే ఏడుస్తారు.

అయితే మొదటిసారి తల్లిదండ్రులు అయినప్పుడు.. పిల్లలు ఎందుకు ఏడుస్తారనేది తెలుసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అది కూడా మధ్యరాత్రి ఏడ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కంగారు పడతారు. ఒకవేళ పిల్లలు రాత్రిళ్లు ఎందుకు నిద్రలేస్తారనే దానికి ఖచ్చితమైన ఆన్సర్ దొరకదు.

Reasons Why Babies Wake Up At Night

కాకపోతే.. అనేక కారణాలుంటాయి. వాటిల్లో ఏది అనేది గుర్తించడం చాలా అవసరం. రాత్రిపూట పిల్లలు ఎందుకు లేస్తారు అనేదానికి కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. వాటిల్లో సమయాన్ని బట్టి, ఏడుపుని బట్టి కారణం తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే.. హ్యాపీగా నిద్రలోకి జారుకుంటారు మీ బుజ్జి పాపాయి.

ఆకలి
పిల్లలకు చిన్న పొట్టలుంటాయి. వాళ్లు తిన్నా, తాగినా.. కొంచమే తీసుకుంటారు. దీంతో అది త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా తల్లిపాలు తాగే పిల్లలు ఎక్కువసార్లు రాత్రిపూట నిద్రలేస్తూ ఉంటారు. ఎందుకంటే.. తల్లిపాలు... చాలా త్వరగా జీర్ణమవుతాయి.

Reasons Why Babies Wake Up At Night

కదలడం
చాలామంది పిల్లలు సైడ్ కి తిరిగి పడుకోవడాన్ని ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు వాళ్లు చాలా కదులుతూ ఉంటారు. దీనివల్ల అసౌకర్యంగా ఫీలై.. నిద్రలేస్తారు. అలాంటప్పుడు వాళ్లను వెనక్కి లాగి.. సైడ్ కి పడుకోపెట్టాలి.

మరీ వేడిగా లేదా మరీ చల్లగా
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు చాలా చల్లగా ఫీలవుతున్నప్పుడు నిద్రలేచి ఏడుస్తారు. వేడిగా ఫీలయినప్పుడు కూడా.. అలానే చేస్తారు. కాబట్టి.. ఆ పరిస్థితిని గుర్తించి.. దానికి తగిన వాతావరణం కల్పించాలి.

పళ్లు వచ్చేటప్పుడు
పిల్లలకు పళ్లు వచ్చేటప్పుడు వాళ్ల చిగుళ్లు నొప్పికి గురవుతాయి లేదా దురద పెడతాయి. దీనివల్ల రాత్రిళ్లు నిద్రలేచి ఏడుస్తా ఉంటారు.

Reasons Why Babies Wake Up At Night

కడుపు నొప్పి
పిల్లల్లో ఫుడ్ డైజెషన్ సరిగా అవనప్పుడు.. కడుపులో నొప్పి వస్తుంది. దీనివల్ల అసౌకర్యంగా ఫీలై.. రాత్రి నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు.

నిద్రలో మార్పులు
పిల్లలు నిద్రపోయే విధానం పెద్దలు నిద్రపోయే విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లు కొన్ని గంటలు నిద్రపోవడం, లేవడం చేస్తూ ఉంటారు. వాళ్ల శరీరం కంటిన్యూగా 8 గంటలు నిద్రపోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మధ్యలో లేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భాలను గుర్తించి.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మళ్లీ హ్యాపీగా నిద్రపోతారు.. మీ బుజ్జి పాపాయిలు.

English summary

Reasons Why Babies Wake Up At Night

Reasons Why Babies Wake Up At Night. All parents have but one complain that their baby wakes up in the middle of the night. It is extremely difficult to get the baby to sleep through the night
Story first published:Friday, June 24, 2016, 14:52 [IST]
Desktop Bottom Promotion