For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాటిల్ ఫీడింగ్ కంటే బ్రెస్ట్ ఫీడింగ్ సురక్షితమైనది? ఎందుకంటే..

|

మహిళ గర్భం పొంది, మరో జీవికి ప్రాణం పోస్తోదని తెలస్తే, అది ఒక అద్భుతమైన విషయం. తల్లికి మాత్రమే కాదు, కుటుంబ సభ్యులందరిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసే ఒక అద్భుత మార్పు.
గర్భం పొందిన తర్వాత ప్రతీదీ కొత్తగా అనిపిస్తుంది. ఆహారం, అలవాట్లలో మార్పు చేసుకోవాలి. గర్భం పొందినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించడం అన్నది గర్భిణీ స్త్రీకి ఒక చాలెంజ్ వంటిది.

ఇదంతా ఒక ఎత్తైతే ప్రసవం తర్వాత బిడ్డను చూసుకోవడం మరో చాలెంజ్ అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్య, ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద మరియు అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భంలోనే కాదు, ప్రసవం తర్వాత కూడా తల్లి ఆరోగ్యం మీద బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది.

తల్లి తీసుకొన్న ప్రతి ఆహారం బిడ్డకు పాల రూపంలో చేరుతుంది. కాబట్టి, తల్లి తీసుకొనే ఆహారాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతే కాదు ప్రతి క్షణం బిడ్డను అంటిపెట్టుకొని ఉండి బిడ్డకు అవసరమయ్యే సపర్యలు చేస్తూ సంత్తుప్తి పరచాలి. బిడ్డ కోసం ఎక్కువ సమయం గడపాలి.

అదే విధంగా ప్రసవం తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవం తర్వాత తల్లి బిడ్డకు పట్టే పాల ద్వారానే పూర్తి పోషకాలను పొందుతారు . బేబీ గ్రోత్ కు ఇవి చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొన్ని సందర్భాల్లో వివిధ రకాల కారణాల వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ కు బదులుగా బాటిల్ పీడింగ్ ఇస్తుంటారు. అయితే బాటిల్ పీడింగ్ అంత సురక్షితం కాదు. పిల్లలకు ఫీడింగ్ బాటిల్స్ ఉపయోగించవద్దని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. బాటిల్ ఫీడింగ్ వల్ల పిల్లలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటారని సూచిస్తున్నారు. బాటిల్ ఫీడింగ్ కంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉత్తమం అని చెప్పడానికి కొన్ని కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. రీజన్ #1 :

1. రీజన్ #1 :

బాటిల్ ఫీడింగ్ విషయంలో బాటిల్స్ ను ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా, బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఇది అప్పుడే పుట్టిన పిల్లల్లో హాని చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ కు గురిచేస్తుంది. అదే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇలాంటి సమస్యలుండవు.

2. రీజన్ #2 :

2. రీజన్ #2 :

బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకు మాత్రమే ఆరోగ్యకరం కాదు, తల్లికి కూడా ఆరోగ్యకరమే. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లి క్రమంగా ..వేగంగా...బరువు తగ్గుతుంది.

3. రీజన్ #3 :

3. రీజన్ #3 :

ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పిల్లలు పాలు తాగితే పాలతో పాటు గాలికూడా కడుపులోకి చేరుకుంటుంది. తద్వారా గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడుతాయి. బాటిల్స్ పాలు తాగే పిల్లలు మదర్ ఫీడ్‌కు దూరమవుతారు. పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిది.

4. రీజన్ #4 :

4. రీజన్ #4 :

బాటిల్ ఫీడింగ్ వల్ల , వివిధ రకాల ఫీడింగ్ బాటిల్స్ ను ఉపయోగించడం ద్వారా పెదవులు, దంతాలు, నోటి అమరికలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

5. రీజన్ #5 :

5. రీజన్ #5 :

రబ్బర్‌లోని కంటికి కనిపించని జెమ్స్ ద్వారా అనారోగ్య సమస్య ఏర్పడుతున్నాయి. మదర్ ఫీడ్ అయితే ఆరోగ్యదాయకమని, అదే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలను ఇచ్చేటప్పుడు నాలుకు మడత పడుతుందని.. తాగిన తర్వాత శ్వాస తీసుకోవడం పిల్లలకు కష్టమవుతుంది. మదర్ ఫీడ్, కప్పుల్లో పాలు తాగే పిల్లల కంటే ఫీడింగ్ బాటిల్స్ ద్వారా పాలు తాగే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

6. రీజన్ #6:

6. రీజన్ #6:

ఫీడింగ్ బాటిల్ ద్వారా పిల్లలు పాలు తాగితే.. దవడ, దంత సమస్యలు ఏర్పడతాయి. మాటలు సకాలంలో రావు. ఉచ్ఛారణ సరిగ్గా ఉండదు. దంత వరుసలో మార్పులుంటాయి.

7. రీజన్ #7:

7. రీజన్ #7:

ఫీడింగ్ బాటిల్స్ అధికంగా ఉపయోగిస్తే.. డయేరియా వంటి సమస్యలు పిల్లల్లో ఏర్పడుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

8. రీజన్ # 8:

8. రీజన్ # 8:

బాటిల్ ఫీడింగ్ సమయంతో కూడుకొన్న పని. బాటిల్స్ ను శుభ్రం చేయడం మిల్క్ తయారుచేసుకోవడం మొదలగునవన్నీ టైమ్ వేస్ట్, మరియు బిడ్డకు హానికరం. బ్రెస్ట్ ఫీడింగ్ నేచురల్ గా జరిగే మార్పు మరియు సులభమైన మార్గం.

9. రీజన్ #9:

9. రీజన్ #9:

ఎక్కువ రోజులనుండి బాటిల్ పీడింగ్ ఇస్తుంటే , ముఖ్యంగా దంతాలు ఏర్పడే సమయంలో బాటిల్ ఫీడింగ్ వల్ల దంతాలు సరిగా ఏర్పడవు, మరియు అనారోగ్యకరమైన దంతాలు ఏర్పడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

10. రీజన్ #10 :

10. రీజన్ #10 :

బాటిల్ పీడింగ్ వల్ల బిడ్డలో చెవులకు ఇన్ఫెక్షన్స్ సోకుతుంది. దాంతో సరిపగా పాలు తాగలేరు. ఇన్ఫెక్షన్ శ్వాసనాలానికి లేదా ఇయర్ ట్రాక్ కు పాకడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవుతుంది.

11. రీజన్ #11:

11. రీజన్ #11:

బాటిల్ ఫీడింగ్ సమయంలో కొన్ని సందర్భాల్లో పాలు కలిపేటప్పుడు వేడిని గుర్తించకపోతే బీబి నోటికి గాయమవుతుంది. నోరు మంట పెడుతుంది . కాబట్టి, పాలు పట్టే ప్రతి సారి పాలు గోరువెచ్చగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అదే బ్రెస్ట్ ఫీడింగ్ లో ఈ సమస్యలుండవు.

12. రీజన్ #12:

12. రీజన్ #12:

బాటిల్ పీడింగ్ తల్లులు బిడ్డకు దూరమవుతారు. దాంతో బిడ్డ యొక్క ఫీలింగ్స్ తెలియవు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకు తల్లి స్పర్శతో పాటు అనుబంధం బలపడుతుంది.

English summary

Reasons Why Breastfeeding Is Better Than Bottle Feeding

As we all know, breastfeeding is an important part of child-rearing and provides the baby with rich nutrients that is required for his/her growth. However, due to various reasons like lack of time to breastfeed, reduced breast milk production, etc, a mother may start feeding her baby with bottled milk.
Story first published:Tuesday, May 24, 2016, 14:03 [IST]
Desktop Bottom Promotion