For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం పాటు అందివ్వాల్సిన ఫుడ్స్ చార్ట్..!!

మెదటి సారి గర్భం పొంది, ప్రసవించిన తర్వాత తల్లి మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. బేబి పుట్టిన తర్వాత బేబీ డే1 నుండి 12నెలల వరకూ ఎలాంటి ఫుడ్స్ అందివ్వాలో డార్క్ ను సంప్రదించి లిస్ట్ అవుట్ చేసుకోవడం మంచిద

|

మెదటి సారి గర్భం పొంది, ప్రసవించిన తర్వాత తల్లి మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. బేబి పుట్టిన తర్వాత బేబీ డే1 నుండి 12నెలల వరకూ ఎలాంటి ఫుడ్స్ అందివ్వాలో డార్క్ ను సంప్రదించి లిస్ట్ అవుట్ చేసుకోవడం మంచిది.

బిడ్డ పుట్టగానే శిశువు దశలో ఘనాహారాలను వేటిని సులభంగా జీర్ణం చేసుకోలేరు. వాస్తవానికి అందుకే అప్పుడే పుట్టిన పిల్లలకు కేవలం బ్రెస్ట్ మిల్క్ మాత్రమే కొన్ని నెలల పాటు ఇస్తుంటారు. డాక్టర్ రెకమెండ్ చేయనిదే ఫార్ములా మిల్క్ ను బేబికి పట్టించకపోవడమే మంచిది.

బేబి పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకూ ఎలాంటి ఆహారాలను అందివాలనే ఫుడ్ చార్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాయి. వీటిని గైడ్ లైన్స్ గా ఉపయోగించుకోవడం మంచిది. ఇంకా సందేహాలుంటే డాక్టర్ ను కలిసి బేబికి అందివ్వాల్సిన ఫుడ్స్ పండ్ల మరింత అవగాహన చేసుకోవడం మంచిది.

బేసిక్ రూల్ : బేబి పుట్టినప్పటి నుండి 6 నెలల వరకూ బ్రెస్ట్ మిల్క్ ను అంది్వాలి. తర్వాత ఫ్రూట్ జ్యూస్, ఆతర్వాత సాలిడ్ ఫుడ్స్ ను పెట్టాల్సి ఉంటుంది. సాలిడ్ ఫుడ్ కూడా చాలా మెత్తగా గుజ్జులాగే చేసి పెట్టాలి. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి తినిపించాలి. పచ్చిగుడ్డు, మాంసాహారాలను ఎట్టిపరిస్థితిలో పెట్టకపోవడమే మంచిది. ఎగ్ పెట్టాలని కోరుకుంటున్నట్లై కేవలం 7 నెలల తర్వాత ఉడికించిన గుడ్డును తినిపించవచ్చు. అది కూడా డాక్టర్ అంగీకారంతో మొదలు పెట్టండి. అప్పుడే పుట్టిన బేబీకి తినిపించాల్సిన ఫుడ్స్ చార్ట్ ను ఒక సారి చూద్దాం..

మొదటి నెల:

మొదటి నెల:

బేబి పుట్టిన మొదటి నెలలో, మొదటి ఆహారంగా బ్రెస్ట్ మిల్కే అందివ్వాలి.మొదటి కొన్ని నెలలు సాలిడ్ ఫుడ్స్ ను నివారించడం మంచిది. మొదటి నెలలో ప్రతి రెండు గంటలకొకసారి బేబికి బ్రెస్ట్ మిల్క్ ను పట్టించాలి..

రెండో నెల:

రెండో నెల:

రోజుకు 7 నుండి 8 సార్లు బ్రెస్ట్ మిల్క్ పట్టాలి. డాక్టర్ సలహా లేదా సూచన ప్రకారంన ఇతర ఫార్ములా మిల్క్ ను పట్టించవచ్చు.

మూడో నెల:

మూడో నెల:

మూడో నెలలో కూడా, బ్రెస్ట్ మిల్క్ మాత్రమే పట్టించాలి. సాలిడ్ ఫుడ్స్ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. ప్రతి నాలుగు గంటలకొకసారి ఫీడ్ చేయొచ్చు.

నాగో నెల:

నాగో నెల:

డాక్టర్ సూచన ప్రకారం, ఫ్రూట్ జ్యూసులను అందివ్వాలి. అయితే ఒకేరకమైనది మాత్రమే అందివాలి. వివిధ రకాల ఫ్రూట్ జ్యూస్ తో ఒకేసారి మొదలు పెట్టకూడదు. డాక్టర్ సలహా ప్రకారం ఒకే ఒక రకమైన జ్యూస్ ను అది కూడా స్వయంగా ఇంట్లో తయారుచేసిందే అందివ్వాలి.

ఐదో నెల

ఐదో నెల

ఫ్యామిలీ డాక్టర్ ను కలిసిన తర్వాత నిధానంగా సాలిడ్ ఫుడ్ ను అందివ్వాలి. బాగా మెత్తగా ఉడికించి, మెత్తగా గుజ్జులా చేసిన స్వీట్ పొటాటో, అరటిపండ్లు, ఆపిల్స్, లేదా సెరల్స్ ను అందివ్వాలి. మెత్తగా చేసిన ప్యూర్డ్ ఫుడ్ లో ఒక స్పూన్ బ్రెస్ట్ మిల్క్ పట్టించాలి. ఒక సర్వింగ్ కు చాలి తక్కువ క్వాంటిటీ మాత్రమే ఎంపికచేసుకోవాలి. ఫ్రూట్స్ తినిపించాలనుకునే వారుచ మొదటి మెత్తగా పేస్ట్ చేసి తినిపించాలి.

ఆరో నెల:

ఆరో నెల:

బేబీ ఏదైనా ఆహారం తిరస్కరించిందంటే, దాన్ని తిరిగి పిల్లలకు పెట్టకూడదు. ఇంకా ఫ్రూట్ జ్యూస్ లను కూడా అందివ్వాలి. మొత్తంగా రోజుకు 6 సార్లు తినిపించాల్సి ఉంటుంది.

ఏడో నెల:

ఏడో నెల:

మెత్తగా ఉడికించిన అన్నం (మెత్తగా పేస్ట్ )లా చేసి పెట్టాలి. అలాగే పోరిడ్జ్, పెరుగు, మెత్తగా ఉడికించిన ఆపిల్, మెత్తటి అరటిపండు అలాగే వెజిటేబుల్స్ (మెత్తగా ఉడికించినవి) పెట్టాలి. రోజుకు 6 సార్లు తినిపించాలి. బాగా మెత్తగా ఉండికించిన పప్పును రోజుకు రెండు సార్లు మాత్రమే తినిపించాలి. బేబీ కెపాజిటి అంత కంటే ఎక్కువ ఉంటే డాక్టర్ ను కలిసి ఇంకాస్త ఎక్కువ ఫుడ్స్ ను అందివ్వాలి.

8 -9 నెలల బిడ్డకు :

8 -9 నెలల బిడ్డకు :

బాగా మెత్తగా ఉడికించిన అన్నం (పేస్ట్ లా చేయాలి), పండ్లు, వెజిటేబుల్స్, పెరుగు వంటివి, కొద్దిగా క్వాంటిటీ పెంచి తినిపించాలి. అయితే అవుట్ సైడ్ ఫుడ్స్, సాప్ట్ డ్రింక్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ లేదా ప్రొసెస్డ్ ఫుడ్స్ ను ఎట్టి పరిస్థితిలో పసిపిల్లలకు పెట్టకూడదు.

10-12 నెలల బేబీకి

10-12 నెలల బేబీకి

బాగా మెత్తగా ఉడికించిన వెజిటేబుల్స్, మెత్తగా ఉడికించిన అన్నం, పెరుగు, పాలు, సీజనల్ ఫ్రూట్స్ వంటివి పెట్టాలి. నట్స్, సాల్ట్ ఫుడ్స్ , పాలు , పచ్చి గుడ్లు వంటివి ఎట్టిపరిస్థితిలో పెట్టకూడదు .

English summary

Food Chart For Your Baby

It is better to prepare a food chart to feed your baby from the first month to the 12th month. So, here is a food chart for babies...
Desktop Bottom Promotion