For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు ఇప్పడప్పుడే వద్దు అనుకొనే వారికి..ఈ చిట్కాలే ముద్దు...!

|

పిల్లల్ని కనడ౦ కోసం ఆగడమంటే ఒక్కోక్కరికీ ఒక్కో అభిప్రాయం వుంటుంది. పిల్లల్ని కనడానికి రెండు మూడు సంవత్సరాలు ప్లానింగ్ అంటారు. అలా ప్లానింగ్ చేయాలని మీరనుకుంటుంటే మీరు ఒంటరి వారేమీ కాదు. మీరెంత సేపు ఆగాలనేది క్లిష్టమైన ప్రశ్న - సరైన సమయం అనేదేమీ లేదు, మీరు మరీ ఎక్కువ సంవత్సరాలు ఆగితే అది ఆలస్యం కూడా కావచ్చు.

దీర్ఘకాలంలో పిల్లలు కనడానికి కష్ట అవుతుంది. మీకు సరైన కాలం ఏదో తెలుసుకోవడం ముఖ్యం - మీరు 20, 30లలో వుండి, అది మరీ తొందర అవుతుంది అనుకుంటే, మీరు పిల్లల్ని కనడానికి ఆగేందుకు ఇవిగో కొన్ని గొప్ప కారణాలు:

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

ఆర్ధిక పరిస్థితి: పిల్లల్ని కనకుండా ఆగడానికి ఇదే ఒక పెద్ద కారణం - ఆర్ధిక పరిస్థితి. పిల్లలకోస ఒక జీవితకాలం పాటు డబ్బులు ఖర్చు చేయాలి. ఇంకోలా చెప్పాలంటే పిల్లలింకా లేని వారు మార్పు చేయగల, సరికొత్త కారు షోరూమ్ నుంచి కొనుక్కు వచ్చినట్టే. పిల్లల్ని కనడం కూడా అంతే ఖర్చవుతుంది - దీంట్లో ఎలాంటి మినహాయింపులు వుండవు.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

సహనం: మీకు పిల్లలు ఆలస్యంగా కలిగితే (ఆశిస్తే) చిన్న చిన్న వాటి గురించి మీరు ఇబ్బందిపడరు, వాటిని ఎలా నెగ్గుకు రావాలో మీరు ఈలోగా నేర్చుకునే వుంటారు. పిల్లల్ని పెంచాలంటే ఇది చాలా ముఖ్యం. సహనం మీకు చాలా నియంత్రణను ఇస్తుంది, పెంపకంలో ఉండి తీరాల్సిన సుగుణం ఇది.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

వ్యర్ధంగా మీ యవ్వనాన్ని ఖర్చు చేసారు: రెండు పదుల వయసులో లేదా అంతకన్నా ముందు పిల్లల్ని కంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది. రాత్రంతా పార్టీ చేసుకోవడం, వారాంతాలు, వారం మొత్తం కొత్త స్నేహితులతో కొత్త ప్రాంతాల్లో గడపడం లాంటివి పక్కన పెట్టేసినట్టే. ఒక్కసారి పిల్లల్ని కంటే, ఆ సరదాల పుట మీ జీవితపు పుస్తకం లోంచి చించి వేసినట్టే - ఇక మీకు దాంతో పని వుండదు. ఒక తండ్రిగా మీరు మానసికంగా కొత్త వారిని, కొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తుంటే దగ్గరౌతారు - అయితే వయసు మీద పడ్డ తండ్రిగా మీరు ఇప్పటికే ఇవన్నీ నేర్చుకుని వుంటారు.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

మీరు సరైన భాగస్వామిని కలిగి ఉండాలి: సమాజం చెప్పినట్టుగా చాలా మంది త్వరగానే పెళ్లి చేసుకునేవారు. దాంతో పిల్లలూ త్వరగా పుట్టే వాళ్ళు. సమస్యేమిటంటే 45 ఏళ్ళు రాగానే విడాకులు తీసేసుకుంటారు. తమతో పాటుగా ఎదిగే భాగస్వామి లేక జీవితంలో ముందుకు వెళ్ళలేని వారు కూడా కొంత మంది వున్నారు. మీరు పిల్లల్ని కనడం వాయిదా వేస్తే మీ జీవితం పంచుకునే భాగస్వామి మీకు దొరకవచ్చు.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

మీ ఆత్మ ప్రయాణం: తామే౦టో, తమకు జీవితం నుంచి ఏం కావాలో ఇంకా సరిగ్గా తెలుసుకోలేడ్ని చాలా మంది చాలా ఆలస్యంగా కనుగొంటారు, బహుశా పిల్లల్ని కనేలోగా వారికి తమదైన స్థానాన్ని పొందడానికి మరింత సమయం కావాలి. మీరు జీవితంలో మరో మనిషికి దారి చూపడానికి మిమ్మల్ని సమర్ధులుగా చేసేందుకు - కుటుంబం ఏర్పాటు చేయడం ఆలస్యం చేసి మీరు, మీ భాగస్వామి మనుషులుగా మరింత అనుభవం సంపాదించండి.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

వృత్తి: వృత్తిలో పురోగతి సాధించి, వివిధ ప్రదేశాలు తిరగడానికి, మీరు పిల్లలు కావాలనుకున్నప్పుడు కొన్ని బాధ్యతలు వదిలించుకోవడానికి మీకు కొన్నేళ్ళ సమయం వుంటుంది. మీరు ఆలస్యంగా పిల్లల్ని కంటే మీరు మీ వృత్తి జీవితంలో పురోగతి సాధించి, మీ కంపెనీని విస్తరించి, ఆ దశలో అవసరమైతే ఒకడుగు వెనక్కి వేసి విరామం తీసుకోవచ్చు.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

ప్రయాణం: మీ వీపు మీద ఒక సంచి వేసుకుని, ఒక కోల్డ్ బీర్ కొనడానికి సరిపడా డబ్బులుండగా ప్రయాణం చేయడం, ఒక పిల్లాడ్ని వేసుకుని ప్రయాణం చేయడం - రెండూ రెండు వేర్వేరు విషయాలు. పిల్లలు లేనప్పుడు మీరు, మీ భాగాస్వామి ప్రపంచం అంతా చుట్టి రావచ్చు, పిల్లల్ని కని కుటుంబం ఏర్పరుచుకునే ముందే అన్నీ చూసి అనుభవి౦చేయండి.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

ఇల్లు కొనడం: ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో పిల్లాడిని పెంచాలని మనం ఎవ్వరమూ అనుకోలేము. మీకు కొత్తగా పెళ్లైనప్పుడు, కష్టపడి పని చేస్తూ మీకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంటున్నప్పుడు, మీ జీవితపు వాస్తవ పరిస్థితి అదే కావచ్చు. పిల్లల్ని కనడానికి కొంత కాలం ఆగడానికి ఒక వాస్తవిక కారణం ఏమిటంటే - తోట, ఈత కొలను తో వుండే మీ కలల ఇంటిని కొనడం. ఇక దానికి పిల్లల్ని చేర్చడమే తరువాయి.

పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

విద్య పూర్తీ చేయడం: ప్రస్తుత ఆర్ధిక వాతావరణంలో పై చదువులు మునుపటికన్నా ముఖ్యం అయిపోయాయి. పిల్లాడి ఆలనా పాలనా చూసుకుంటూ, గోరుముద్దలు తినిపిస్తూ - ఈ మధ్యలో ఏదైనా డిగ్రీ చేయాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది - రెండిటిలో ఏదో ఒకటి దెబ్బ తింటుంది, ఎలా అయినా మీరే బాధ పడాలి. మీ డిగ్రీ పూర్తీ చేసుకుని, ఆ తరువాత గర్భం దాల్చడం చాలా మంచి పని.

మీరు పిల్లల్ని కనడానికి ఆగాలి అనేందుకు కొన్ని ప్రాథమిక కారణాలు వున్నాయి, కానీ అవి మరీ వ్యక్తిగతమైనవే. అయితే వాటిలో ఏదీ కూడా మీరు త్వరగా పిల్లల్ని కంటే మీరు విజయవంతమైన తల్లిదండ్రులు కాలేరు అనడానికి లేదు. మీరు గనుక వివాహం అయ్యాక గర్భధారణ కోసం వేచి వుంటే, ఈ గొప్ప కారణాల్లో ఏది మిమ్మల్ని పిల్లల్ని కనడం వాయిదా వేయడానికి మీకు ఏది ముఖ్యమో చూడ౦డి.

English summary

9 Great Reasons to Wait to Have Kids | పిల్లల్ని కనడానికి ఈ 9 కారణాలే అడ్డుకులైతే...?

When it comes to reasons to wait to have kids, everybody has an opinion. And if you are looking for reasons to wait to have children, you are not alone.
Story first published: Monday, April 8, 2013, 12:35 [IST]
Desktop Bottom Promotion