For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అండోత్సర్గము సమయంలో అరోగ్య రక్షణ మార్గాలు

By Mallikarjuna
|

అండోత్సర్గము అనేది ఒక జీవప్రక్రియ, అండాశయంలోని ఫోలిసెల్స్ రుతుచక్రంలో ఒక రుతచక్రంకు ఒక్క అండము విడుదల అవుతుంది. ఒక మహిళ నుండి మరో మహిళలకు అండోత్సరంగో వ్యత్యాసం ఉంటుంద. సాధారణంగా 28 రోజుల రుతుచక్రం రెగ్యులర్ గా పీరియడ్స్ అయ్యే వారిలో నెలసరి అయిన మొదటి రోజు నుండి 14వ రోజున అండం విడుదల అవుతుంది. కానీ, కొన్ని సందర్భాల్లో పది నుండి 19 తేది మద్య ఎప్పుడైనా కూడా సంభవించవచ్చు . అండము ఫలదీకరణ ఫలితంగా , స్పెర్మ్ విలీనమైంది . గర్భం పొందడానికి అండోత్సర్గము సమయం తెలుసుకోవడం చాలా ముఖ్యం .

అండోత్సర్గము సమయంలో పార్ట్నర్స్ ఇద్దరు ప్రేమ కలిగి ఉండటం, ఆ సమయంలో కలవడం వల్ల మీరు గర్భవతి పొందుటకు సహాయం చేస్తుంది . పిల్లలు లేకుండా వంధ్యత్వంతో బాధపడేవారికి ఇచ్చే చికిత్సలో కూడా అండోత్సర్గము యొక్క సమయం లెక్కించడం ద్వారా నిర్వహిస్తున్నారు . ఫలితంగా మీ శరీరం చక్కటి గర్భం పొందటానికి అండోత్సర్గము సమయంలో కొన్ని అదనపు అరోగ్య సంరక్షణ కూడా అవసరం అవుతుంది. మీరు గర్భం పొండానికి చిట్కాలు శోధిస్తున్నట్లైతే, అండోత్సర్గము సమయంలో ఆరోగ్య సంరక్షణ మీద కూడా ప్రధాన ప్రాముఖ్యతను కలిగిఉండాలి . అండోత్సర్గము సమయంలో ఆరోగ్య సంరక్షణ మీరు ఆ విలువైన రోజు మిస్ కాకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది .

మీరు అండోత్సర్గం చెందే సమయాన్ని మీ ఓవొలేషన్ జరిగే చార్టింగ్ తెలిపే బాసల్ బాడీ టెంపరేచర్, అలాగే గర్భాశయ మ్యూకస్ లో మార్పులను గమనించడం, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ద్వారా లేదా ఓవొలేషన్ ప్రిడిక్టర్స్ కిట్ ను ఉపయోగించి అండోత్సర్గం సమయాన్ని గుర్తించవచ్చు. గర్భం పొందడానికి అండోత్సర్గం జరిగే సమయంలో మీరు తీసుకోవల్సిన కొన్నిఆరోగ్య సంరక్షణ చిట్కాలున్నాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యకరమైన అండోత్సర్గంకు మరియు సంతోషకరమైన ప్రెగ్నెన్సీకు సహాయపడుతాయి.

జంక్ ఫుడ్ మానుకోండి :

జంక్ ఫుడ్ మానుకోండి :

అండోత్సర్గము సమయంలో జంక్ ఆహారాలు , ఫాస్ట్ ఫుడ్ మరియు క్యాన్డ్ ఫుడ్స్ ను తినడం నివారించాలి. అండోత్సర్గం సమయంలో ఇటువంటి ట్రాన్స్ ఫ్యాట్ కలిగినటువంటా ఆహారాలు తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. కొన్ని స్టడీస్ ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ ముఖ్యంగా పాలీ సిస్టిక్ అండాశయ సిండ్రోమ్ మహిళలు గర్భం ధరించే సంభావ్యతను తగ్గిస్తాయి నిరూపించారు .

వ్యాయామం :

వ్యాయామం :

మీలో హ్యార్మోనులను సంతులనం చేయడానికి రెగ్యులర్ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అండోత్సర్గము పూర్తిగా సంబంధిత హార్మోన్లు మీద ఆధారపడి ఉంటుంది. హార్మోన్ అసమతుల్యత ప్రతికూలంగా అండోత్సర్గము ప్రక్రియ ప్రభావితం చేస్తుంది . రెగ్యులర్ గా వ్యాయామం చేయడం గర్భం పొండానికి సహాయపడే చిట్కాలల ఒకటి.

మొలకలు :

మొలకలు :

సరైన అండోత్సర్గమును ప్రోటీనులు చాలా అవసరం . మొలకల్లో ప్రోటీనులు పుష్కంగా ఉంటాయి. ఇవి మీ ఋతు చక్రం సాధారణ జరగడంల సహాయపడుతుంది. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం త్రీసుకోవడం వల్ల గర్భం పొందడానికి, గర్భాధరణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన చిట్కాలలో ఇది ఒకటి

ఆదర్శ బరువు :

ఆదర్శ బరువు :

సాధారణ ఋతుక్రమం కోసం, ఒక శరీర ఆకారం కలిగి ఉండటం ముఖ్యం .ఆరోగ్యకరమైన అండోత్సర్గం జరగడానికి ఒక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పాలీ సిస్టిక్ ఓవెరీ సిండ్రోమ్ వంటి అనేక సమస్యలు ఊబకాయం కారణంగా ఉన్నాయి.

హెల్త్ చెకప్ :

హెల్త్ చెకప్ :

మీకు పీరియడ్స్ సమస్యలున్నప్పుడు, సకాలంలో పీరియడ్స్ రాకుండా, లేదా 2, 3 నెలల తర్వాత పీరియడ్స్ అవడం ఇటువంటి సమస్యలనున్నప్పడు, వైద్య చికిత్సలు పరీక్షలు చేయించుకోవడా చాలా కీలకమైనది. ప్రారంభ దశలనే చికిత్సలు తీసుకొని సులభంగా సమస్యని నివారంచే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి, సమస్య ప్రారంభంలోనే తెలుసుకొని, చికిత్స చేయించుకోవడం ముఖ్యం.

కెఫిన్ తక్కువ గా తీసుకోవాలి :

కెఫిన్ తక్కువ గా తీసుకోవాలి :

మీలో అండోత్సర్గము మెరుగుపడాలంటే కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి , కెఫిన్ మీ సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుంది . అండోత్సర్గ సమయంలో తీసుకొనే ఆరోగ్య సంరక్షణలో కెఫిన్ నివారించాలని గుర్తించుకోల్సిన ముఖ్యమైన అంశం.

విశ్రాంతి:

విశ్రాంతి:

సాధారణంగా ఒత్తిడి అండోత్సర్గము మీద ప్రభావం చూపించే ఒక ముఖ్యమైన అంశం . అండోత్సర్గ సమయంలో చాలా రిలాక్డ్స్ గా ఉండటం, గర్భం పొందడానికి ఒక ఆరోగ్యకరమైన చిట్కా. ఇది మీలో హార్మోనులను సంతులనం చేస్తుంది.

క్లీన్ అలవాట్లు :

క్లీన్ అలవాట్లు :

గర్భం పొండానికి అండోత్సర్గం సమయంలో తీసుకోవల్సిన ఆరోగ్య సంరక్షణ చిట్కాలలో ఇది ముఖ్యమైన అంశం చెడు మరియు ప్రమాధకరమైన అలవాట్లును మానుగకోవడం ఉత్తమం. కాబట్టి, మంచి అలవాట్లును ఏర్పరుచుకొని ఆరోగ్యకరమైన అండోత్సర్గంను పొందాలి.


English summary

Health Care During Ovulation

Ovulation is the biological process by which a mature ovarian follicle ruptures and discharges an ovum during a menstrual cycle. The time of ovulation differs from woman to woman.
Story first published: Wednesday, December 18, 2013, 17:57 [IST]
Desktop Bottom Promotion